10 ఏళ్ల తర్వాత టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్న నాగార్జున హీరోయిన్ ఎవరో తెలుసా?

Published : Oct 29, 2025, 12:31 PM IST

ఒకప్పుడు కింగ్ నాగార్జున, నటసింహం బాలయ్యతో రొమాన్స్ చేసిన స్టార్ హీరోయిన్.. చాలా గ్యాప్ తరువాత మళ్లీ టాలీవుడ్ లోకి అడుగు పెట్టబోతోంది. సూర్య సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వనున్న సీనియర్ బ్యూటీ ఎవరో తెలుసా?

PREV
15
బాలీవుడ్ నుంచి సౌత్ కు..

సౌత్ లో ఎప్పటి నుంచో.. బాలీవుడ్ హీరోయిన్ల హవానే నడిచింది. ముంబయ్ నుంచి ఎక్కువగా తారలు సౌత్ ప్లైట్ ఎక్కేవారు. సౌత్ లో రెండు మూడు సినిమాలు చేసి.. ఆతరువాత బాలీవుడ్ కు వెళ్ళిన వారు చాలామంది ఉన్నారు. కత్రీనా కైఫ్, ప్రియాంక చోప్రా, ఐశ్వర్యరాయ్ లాంటివారు ముందు సౌత్ లో సినిమాల్లో మెరిసన తరువాతే.. బాలీవుడ్ ను ఏలారు. ఇక టాలీవుడ్ లో కొన్ని సినిమాలు చేసి.. బాలీవుడ్ కు వెళ్లిన ఓ హీరోయిన్, చాలా కాలం గ్యాప్ తరువాత మళ్లీ తెలుగు తెరపై అడుగు పెట్టబోతోంది. ఇంతకీ ఆమె ఎవరో కాదు రవీనా టాండన్ .

25
బాలయ్య, నాగార్జున జోడీగా..

బాలీవుడ్‌లో ఒకప్పుడు టాప్ హీరోయిన్‌గా వెలువెలిగిన రవీనా టాండన్.. ఇటు తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా తెలుసు. గతంలో ఆమె నందమూరి బాలకృష్ణ జోడీగా ‘బంగారు బుల్లోడు’, అక్కినేని నాగార్జునతో ‘ఆకాశవీధిలో’ సినిమాల్లో నటించి ఆకట్టుకుంది రవీనా. ఆ తరువాత ఆమె తెలుగులో సినిమాలు చేయలేదు.. కానీ 2014లో మాత్రం మోహన్ బాబుతో కలిసి ‘పాండవులు పాండవులు తుమ్మెద’ సినిమాలో కనిపించింది. మోహన్ బాబు భార్యగా, యంగ్ హీరోలకు మారు తల్లి పాత్రలో నటించింది రవీనా.

35
పాన్ ఇండియా సినిమాలో కీలక పాత్ర

ఈమధ్య కాలంలో సౌత్ సినిమాల్లో ఎక్కవగా కనిపస్తోంది రవీనా. రీసెంట్ ఇయర్స్ లో రవీనా టాండన్ నటించిన ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఈసినిమాలో రమికా సేన్ పాత్రలో అదరగొట్టింది రవీనా.. ఈ పాత్రకు దేశవ్యాప్తంగా మంచి స్పందన వచ్చింది. అయితే టాలీవుడ్ లో మాత్రం ఆమె సినిమా చేసిన పదేళ్లు అవుతోంది. లాంగ్ గ్యాప్ తరువాత రవీనా టాండన్ ‘సూర్య 46’ ద్వారా టాలీవుడ్‌కు రీఎంట్రీ ఇస్తోంది.

45
10 ఏళ్ళ తరువాత టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ

కోలీవుడ్‌ స్టార్‌ హీరో సూర్య టాలీవుడ్‌లో స్ట్రైట్ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ ద్విభాషా చిత్రం “Suriya 46” అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. ఈసినిమాలో రవీనా టాండన్ కీలక పాత్రలో నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. రీసెంట్ గా రవీనా బర్త్ డే సందర్బంగా ఆమెకు బర్త్ డే విషెష్ తెలుపుతూ.. ఓ స్పెషల్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. “మీరు మా ప్రయాణంలో భాగం అవ్వడం ఆనందంగా ఉంది… రాబోయే అద్భుతమైన జర్నీ కోసం ఎదురుచూస్తున్నాం” అని మేకర్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

55
సూర్య - వెంకీ అట్లూరి సినిమాపై భారీ అంచనాలు

‘Suriya 46’ సినిమాలో సూర్య సరసన ‘ప్రేమలు’ ఫేమ్ మమితా బైజు హీరోయిన్ గా నటిస్తోంది. ఈమూవీలో సీనియర్ నటి రాధికా శరత్‌కుమార్ ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనుంది. ఈక్రమంలో రవీనా టాండన్ కూడా జాయిన్ కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై హైప్ మరింతగా పెరిగిపోయింది. తొలి ప్రేమ, సార్, లక్కీ భాస్కర్ లాంటి సినిమాలతో స్టార్ గా ఎదిగిన దర్శకుడు వెంకీ అట్లూరి.. వరుసగా ఇతర భాషా హీరోలతోనే సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఇక సూర్యతో వెంకీ కాంబినేషన్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోన్న ఈ సినిమా షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా కొనసాగుతోంది. 2026 సమ్మర్‌లో ఈ చిత్రం విడుదల కావచ్చని సమాచారం.

Read more Photos on
click me!

Recommended Stories