Akhanda 3 Ready : బోయపాటితో బాలకృష్ణ సినిమా అంటే.. అభిమానులకు పండగే.. నందమూరి డైహార్ట్ ప్యాన్స్ అయితే పూనకాలతో ఊగిపోతుంటారు. ఇప్పటికే వీరి కాంబినేషన్ లో..నాలుగు సినిమాలు రిలీజ్ అవ్వగా.. ఐదో సినిమా కోసం రంగం సిద్దం అవుతున్నట్టు తెలుస్తోంది.
బాలకృష్ణ – బోయపాటి కాంబినేషన్ అంటేనే అభిమానులతో పాటు సినిమా లవర్స్ కు పండగే. వీరిద్దరి కలయికలో హిట్ సినిమాలే కానీ.. ఒక్క ప్లాప్ కూడా లేదు. బోయపాటి తో సినిమా చేయాలంటే అది బాలయ్యకు మాత్రమే సాధ్యం, ఎన్టీఆర్, రామ్ చరణ్, రామ్ లాంటి హీరోలకు భారీ డిజాస్టరస్ ను ఇచ్చిన బోయపాటి... బాలయ్యకు మాత్రం బ్లాక్ బస్టర్స్ అందిస్తూ వస్తున్నాడు. వీకి కాంబో ఆ రేంజ్ లో వర్కౌట్ అవుతుంది. ఈక్రమంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన నాలుగు సినిమాలు మంచి విజయాలు సాధించాయి. తాజాగా విడుదలైన అఖండ 2 కూడా ఈ కాంబినేషన్‌లో మరో హిట్‌గా నిలిచింది.
25
భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన సినిమా?
అఖండ 2 సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ మూవీపై అంచనాలు భారీ స్థాయిలో పెరిగాయి. కానీ అనుకున్న తేదీకి సినిమా రాకుండా పోస్ట్ పోన్ అవ్వడంతో.. భారీ ఓపెనింగ్స్ అవ్వాల్సింది.. తగ్గిపోయాయని అంటున్నారు. కానీ అభిమానులు ఈ సినిమాను ఆదరించడంత, కామన్ ఆడియన్స్ కు కూడా అఖండ2 నచ్చడంతో .. బాక్సాఫీస్ దగ్గర నిలబడింది బాలయ్య సినిమా. ఈ క్రమంలోనే ఈసినిమాకు మరో సీక్వెల్ ను తెరకెక్కించే ప్లాన్ లో ఉన్నారట టీమ్. ఈ క్రమంలో అఖండ 2 పై ఈసినిమా దర్శకుడు బోయపాటి కూడా క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది.
35
అఖండ 3పై అభిమానుల్లో ఆసక్తి
ఇక అఖండ సిరీస్ లు ఇలానే కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ఈ విషయంపై గతంలోనే పక్కాగా క్లారిటీ ఇచ్చారు దర్శకుడు. అంతే కాదు అఖండ 2 ప్రమోషన్ల సమయంలో, అఖండను ఒక సిరీస్‌లా కొనసాగిస్తూ ఐదు లేదా ఆరు సినిమాలు చేసే అవకాశం ఉందని బాలకృష్ణ, బోయపాటి శ్రీను వెల్లడించారు. అంతేకాదు, అఖండ 2 సినిమా చివర్లో పార్ట్ 3కు సంబంధించిన లీడ్‌ను కూడా చూపించారు. దీంతో అఖండ 3పై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరిగింది.అఖండ 2 సక్సెస్ అనంతరం మీడియాతో మాట్లాడిన దర్శకుడు బోయపాటి శ్రీను, అఖండ 3 గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఆయన మాట్లాడుతూ, అఖండ సినిమాకు అవెంజర్స్ స్థాయి స్కోప్ ఉందని తెలిపారు. అవెంజర్స్ అనేవి రచయితలు సృష్టించిన సూపర్ హీరోలు కాగా, మన భారత పురాణాల్లో నిజంగానే ఎన్నో సూపర్ హీరోలు ఉన్నారని ఆయన చెప్పారు. మన చరిత్ర నుంచే ఎన్నో కథలను, ఎన్నో శక్తివంతమైన పాత్రలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావచ్చని బోయపాటి వివరించారు. అయితే ప్రేక్షకులు చూస్తున్నారు కదా అని వెంటవెంటనే సీక్వెల్స్ తీయడం సరైన పద్ధతి కాదని ఆయన స్పష్టం చేశారు. రెండు మూడు సినిమాల గ్యాప్ తీసుకుని మళ్లీ అఖండ సిరీస్‌ను కొనసాగించాలనే ఆలోచన ఉందన్నారు.
55
కాస్త గ్యాప్ తీసుకున్న తరువాతే?
బోయపాటి మాట్లాడుతూ.. తాను మధ్యలో వేరే సినిమాలు పూర్తి చేయాల్సి ఉందని వాటిని కంప్లీట్చేసిన తరువాతే అఖండ 3 గురించి ఆలోచిస్తానని చెప్పారు. అఖండ 2 క్లైమాక్స్‌లో శంబాలా తలుపులు తెరుచుకోవడాన్ని చూపించామని, అక్కడి నుంచే అఖండ 3 కథ మొదలవుతుందని బోయపాటి తెలిపారు. ఈ వ్యాఖ్యలతో అఖండ 3 సినిమా పక్కాగా ఉంటుందని, బోయపాటి మరో రెండు సినిమాలు చేసిన తర్వాత మళ్లీ బాలకృష్ణతో కలిసి ఈ మూడో భాగాన్ని తెరకెక్కిస్తారని స్పష్టత వచ్చింది. అఖండ సిరీస్‌పై బాలయ్య అభిమానుల్లో మరింత ఉత్కంఠ పెరిగింది.