బాలకృష్ణ `తల్లిదండ్రులు` మూవీకి పోటీగా వచ్చి ఖంగుతిన్న సూపర్‌ స్టార్‌ ఎవరో తెలుసా? వాళ్లిద్దరికి ఇప్పటికీ పడదట

Published : Jul 19, 2025, 07:36 PM IST

బాలకృష్ణ చాలా సార్లు, చాలా మంది హీరోలతో పోటీపడ్డారు. కానీ 1991లో చోటు చేసుకున్న పోటీ ఇప్పటికీ ఆసక్తికరం. ఆ టైమ్‌లో బాలయ్య మూవీ వద్ద ఆ హీరో కోలుకోలేని దెబ్బ తిన్నాడట. 

PREV
15
బాలకృష్ణతో పోటీలో బోల్తా కొట్టిన స్టార్‌ హీరో

ఇండస్ట్రీలో చాలా మంది హీరోల మధ్య పోటీ కామన్‌గానే ఉంటుంది. సక్సెస్‌ కోసం పోటీపడటం సర్వసాధారణమే. వారి సినిమాలు పోటీ పడటం కూడా రెగ్యూలర్‌గానే జరుగుతుంది. ఒక వారం ఒక హీరో సక్సెస్‌ కొడితే మరో వారం మరో హీరో సక్సెస్‌ కొడతారు. 

కానీ పోటీగా వచ్చినప్పుడు ఎవరు హిట్‌ కొట్టారనేది అత్యంత ఆసక్తికరంగా మారుతుంది. అయితే ఇలాంటి పోటీ బాలయ్యకి `తల్లిదండ్రులు` సినిమా విషయంలో జరిగింది. ఆయనకు పోటీగా వచ్చిన మరో స్టార్‌ హీరో సినిమా గట్టిగా దెబ్బతిన్నది. మరి ఆ హీరో ఎవరో చూస్తే.

25
ఒకప్పుడు స్నేహంగా బాలయ్య, నాగార్జున

టాలీవుడ్‌లో బిగ్‌ స్టార్స్ గా రాణిస్తున్నారు నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున. ఒకప్పుడు వీరిద్దరు ఎంతో స్నేహంగానే ఉండేవారు. ఒకరి సినిమా ఈవెంట్లకి మరొకరు వెళ్లడం, ఒకరి సినిమా ఓపెనింగ్‌లకు మరొకరు గెస్ట్ గా హాజరు కావడం జరిగింది. 

కానీ ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో ఇద్దరి మధ్య గ్యాప్‌ వచ్చింది. అది ఇప్పటికీ కంటిన్యూ అవుతుందనేది ఇండస్ట్రీ వర్గాల నుంచి వినిపించే మాట. పదేళ్ల క్రితం ఓ ఈవెంట్లో తమ మధ్య ఏం లేదని చెప్పారు. కానీ ఆ గ్యాప్‌ ని ఫ్యాన్స్, ఇండస్ట్రీ వర్గాలు ఇప్పటికీ ఫీల్‌ అవుతూనే ఉన్నారు.

35
1991లో `తల్లిదండ్రులు` చిత్రంతో హిట్‌ కొట్టిన బాలయ్య

1991లో బాలకృష్ణ, నాగార్జున సినిమాల మధ్య పోటీ నెలకొంది. ఆ ఏడాది ఫిబ్రవరిలో బాలయ్య నటించిన `తల్లిదండ్రులు` సినిమా, నాగార్జున నటించిన `నిర్ణయం` మూవీ‌ పోటీపడ్డాయి. 

బాలకృష్ణ హీరోగా, విజయశాంతి హీరోయిన్‌గా రూపొందిన `తల్లిదండ్రులు` చిత్రానికి టి రామారావు దర్శకుడు. ప్రసాద్‌ ఆర్ట్స్ పిక్చర్స్ పై ఏవీ సుబ్బారావు నిర్మించారు. 

ఈ సినిమా ఫిబ్రవరి 9న విడుదలైంది. భారీ విజయాన్ని సాధించింది. సినిమాకి ఆడియెన్స్ బ్రహ్మరథం పట్టారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా కదిలి వచ్చారు. దీంతో ఇది పెద్ద హిట్‌ అయ్యింది.

45
బాలయ్యకి పోటీగా వచ్చిన నాగ్‌

`తల్లిదండ్రులు` సినిమాకి 12 రోజుల తర్వాత (ఫిబ్రవరి 21న) నాగార్జున నటించిన `నిర్ణయం` సినిమా విడుదలయ్యింది. ఇందులో నాగార్జునకి జోడీగా అమల హీరోయిన్‌గా నటించగా, ప్రియదర్శన్‌ దర్శకత్వం వహించారు.

 జయభేరి ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై డి కిశోర్‌ నిర్మించారు. ఇది థియేటర్లో ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. నెగటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. జనం ఆసక్తి చూపించలేదు. దీంతో రిలీజ్‌ అయిన రెండో రోజు నుంచే చాలా థియేటర్లు ఎత్తేశారట. 

బాలయ్య సినిమాకి జనం ఆసక్తి చూపించడంతో `నిర్ణయం` మూవీ స్థానంలో `తల్లిదండ్రులు` ప్రదర్శించారట. అలా బాలయ్యకి పోటీగా వచ్చి ఖంగుతిన్నారు నాగ్‌.

55
`శివ` హిట్‌ తర్వాత నాగార్జునకి వరుస పరాజయాలు

`నిర్ణయం` సినిమా రావడానికి ముందే నాగ్‌ నటించిన హిందీ `శివ` విడుదలైంది. నాగార్జున, వర్మ కాంబినేషన్‌లో తెలుగులో వచ్చిన `శివ`కిది హిందీ రీమేక్‌. 

తెలుగు మాదిరిగానే హిందీలో కూడా పెద్ద విజయం సాధించింది. ఆ సక్సెస్‌ ఆనందంలో ఉన్న నాగ్‌కి `నిర్ణయం` పెద్ద షాకిచ్చిందని చెప్పొచ్చు. ఆ తర్వాత నాగ్‌ నుంచి వచ్చిన చిత్రాలు కూడా ఆడలేదు. 

ఆ ఏడాది నాలుగు సినిమాలు విడుదల కాగా, ఒక్కటి కూడా హిట్‌ కాలేదు. అలా ఆ ఏడాది మన్మథుడికి కలిసి రాలేదని చెప్పొచ్చు. ఆ నెక్ట్స్ ఇయర్‌ `కిల్లర్‌` చిత్రంతో హిట్‌ అందుకున్నారు నాగ్‌. మళ్లీ బౌన్స్ బ్యాక్‌ అయ్యారు. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories