ప్రేమ,పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన శ్రీలీల , అమ్మ ఎప్పుడు వెంటే ఉంటుందన్న హీరోయిన్

Published : Jul 19, 2025, 06:52 PM IST

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీలీల పెళ్లిపై క్లారిటీ ఇచ్చింది. తన పెళ్ళి ఎప్పుడు జరుగుతుంది, ఏ ఏజ్ లో జరుగుతుంది అనే విషయంలో ఫుల్ క్లారిటీతో ఉంది హీరోయిన్.

PREV
16

టాలీవుడ్‌లో చాలా తక్కువ కాలంలో స్టార్‌డమ్ అందుకున్న హీరోయిన్లలో శ్రీలీల ఒకరు. ఒక్క సినిమాతో ఆమె ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. అయితే ఆమె చేసిన ఫస్ట్ సినిమా ప్లాప్ అయినా.. తన అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకర్శించింది శ్రీలీల. ఇక ఆతరువాత సీనియర్ హీరోల సరసన రెచ్చిపోయి తన టాలెంట్ అంతా చూపించేసింది బ్యూటీ. తన పెర్ఫామెన్స్ తో పాటు ఎనర్జిటిక్ డ్యాన్సులు, స్క్రీన్ ప్రెజెన్స్‌తో భారీగా ఫ్యాన్ బేస్ ను కూడా సంపాదించుకుంది.

26

ఇండస్ట్రీలోకి వచ్చీ రావడంతోనే మాస్ మహారాజ రవితేజ, సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి స్టార్స్ పక్కన ఆడిపాడింది బ్యూటీ. వరుస సినిమాలు చేస్తూ టాలీవుడ్‌లో దూసుకుపోతున్న ఆమె, ఇటీవల బాలీవుడ్‌లో కూడా అడుగుపెట్టింది. అయితే బాలీవుడ్ లో మాత్రం అనుకున్నంత ఆఫర్లు రావడంలేదు అని తెలుస్తోంది. ఇటు టాలీవుడ్ ను కూడా ఒక ఊపు ఊపేసిన శ్రీలీల.. ఈమధ్య కాస్త డల్ అవుతోంది.

36

ఇక తాజాగా పెళ్లిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది స్టార్ హీరోయిన్. తను ఎప్పుడు పెళ్లి చేసుకోబోయేది క్లారిటీ ఇచ్చింది శ్రీలీల. ఓ ఇంటర్వ్యూలో శ్రీలీల చేసిన ప్రేమ, పెళ్లి వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అని అడిగిన ప్రశ్నకు ఆమె మాట్లాడుతూ.. "ప్రస్తుతం నా వయస్సు 24 సంవత్సరాలు మాత్రమే. నాకు 30 సంవత్సరాలు వచ్చేంతవరకూ పెళ్లి చేసుకునే ఆలోచన అస్సలు లేదు. ఇప్పుడు నా పూర్తి ఫోకస్ సినిమాలపైనే ఉంది. నాకు వ్యక్తిగత జీవితం గురించి ఆలోచించేందుకు కూడా సమయం లేదు," అని తెలిపింది.

46

ఇక ఈమధ్య శ్రీలీల బాలీవుడ్ హీరోతో ప్రేమలో ఉన్నట్టు వార్తలు వైరల్ అయిన క్రమంలో.. ఆ విషయంలో కూడా క్లారిటీ ఇచ్చేసింది హీరోయిన్. ప్రేమ విషయంలో స్పందిస్తూ.. " నేను ప్రస్తుతం ఎలాంటి రిలేషన్‌షిప్‌లో లేను, నిజంగా నేను ఎవరితోనైనా ప్రేమలో ఉంటే, మా అమ్మ నా వెంట ఉండగలిగేది కాదు. కానీ ఇప్పటికి నేను ఎక్కడికైనా వెళితే అమ్మా నన్ను వదలకుండా నాతోనే ఉంటుంది. ఇటీవల అమెరికా వెళ్ళినప్పుడు కూడా అమ్మ నాతోనే ఉంది. అలాంటి పరిస్థితుల్లో ప్రేమలో పడగలనా?" అని ప్రశ్నించింది శ్రీలీల.

56

ఇటీవల తనకు పెద్ద సినిమాలు వస్తున్నాయని, అలాంటి అవకాశాలను కోల్పోకుండా కెరీర్‌పైనే దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నట్లు చెప్పింది. ప్రస్తుతం ప్రేక్షకుల ప్రేమ, అభిమానమే తనకు ముఖ్యమని, వాటిని నిలబెట్టుకోవడమే లక్ష్యమని వెల్లడించింది.

66

శ్రీలీల ప్రస్తుతం టాలీవుడ్‌లో ఫామ్ లోకి వచ్చే ప్రయత్నం చేస్తోంది. రీసెంట్ గా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఆమె, పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందేందుకు ప్రయత్నిస్తోంది. ఇలా కెరీర్ పీక్‌లో ఉన్న సమయంలో ప్రేమ పెళ్లి అంటూ వచ్చే రూమర్స్ తన కెరీర్ కు ఇబ్బందిగా మారతాయని భావిస్తోంది శ్రీలీల. అందుకే సోషల్ మీడియాలో వచ్చే రూమర్స్ కు పక్కాగా క్లారిటీ ఇచ్చేసింది. ప్రస్తుతం శ్రీలీల కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు ఈ విషయంలో రకరకాలుగా స్పందిస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories