ట్రోలర్స్‌కి ఎన్టీఆర్ సాలిడ్ రిప్లై.. తారక్ బక్క చిక్కడానికి ఇంత కథ ఉందా ?

Published : Sep 17, 2025, 10:54 AM IST

NTR New Beast Look: యాక్షన్ డ్రామా వార్ 2 తో జూనియర్ ఎన్టీఆర్ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. పైగా క్యారెక్టర్ డిజైన్ విషయంలో ట్రోల్స్ గురయ్యారు. ట్రోలర్స్‌కి సాలిడ్ రిప్లై ఇచ్చేందుకు తారక్ సిద్దమయ్యారు.

PREV
16
వార్ 2తో ఎన్టీఆర్ కి షాక్

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రతి సినిమాకు తనను తాను మలుచుకోవడానికి తీవ్రంగా కష్టపడుతాడు. సిల్వర్ స్క్రీన్‌పై కనిపిస్తే చాలు ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్ వచ్చేలా చేస్తారు. పాత్ర ఏదైనా సరే తన స్టైల్, జోష్‌తో అదరగొడతారు. ఆ పాత్రకు తన నటనతో ప్రాణం పోస్తారు. అయితే.. ఇటీవల విడుదలైన బాలీవుడ్‌ యాక్షన్ డ్రామా వార్ 2 తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. భారీ హైప్‌తో విడుదలై ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రిజల్ట్‌ సాధించలేకపోయింది. పైగా ఎన్టీఆర్ పాత్రపై, సిక్స్‌ప్యాక్ బాడీపై కూడా విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. ఇప్పుడు ఆ ట్రోల్స్ చెక్ పెడుతూ ఎన్టీఆర్ సాలిడ్ రిప్లే ఇచ్చారు.

26
వార్ 2లో ఎన్టీఆర్ రోల్‌పై విమర్శలు

టాలీవుడ్‌ టాప్ స్టార్‌గా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్‌లో వార్ 2 అనే యాక్షన్ మూవీతో ఎంట్రీ ఇచ్చారు. కానీ అభిమానులు, విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. తారక్ పాత్రను తగిన విధంగా రాయలేదని వాదనలున్నాయి. హృతిక్ రోషన్‌కి సరితూగే స్థాయిలో రోల్ రావాలని అభిమానులు భావించగా, సినిమాలో హృతిక్ స్క్రీన్ ప్రెజెన్స్ ఎన్టీఆర్‌ను పూర్తిగా డామినేట్ చేసిందని విమర్శలు వినిపిస్తున్నాయి. తారక్ నటనకు ప్రాధాన్యం ఉన్నప్పటికీ, పాత్ర బలహీనంగా రాసినట్లుగా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

36
అభిమానులకు షాకిచ్చిన వీఎఫ్ఎక్స్

వార్ 2 సినిమాలో ఎన్టీఆర్ సిక్స్‌ప్యాక్ బాడీతో కనిపించే ఎంట్రీ సీన్‌లో, ఆయన అసలైన ఫిజిక్‌కి సరిపోని బాడీని సీజీఐతో సెట్ చేసినట్టు నెటిజన్లు సెటైర్లు వేశారు. "మా హీరో ఫేస్‌ని ఎవరో ఇతరుల బాడీకి అతికించారు" అంటూ ఫ్యాన్స్ కూడా మండిపడుతున్నారు. ‘ఎన్టీఆర్ రేంజ్‌కి సరిపడే రోల్ ఇవ్వలేదు’, ‘మా హీరోను ఇలా చూపిస్తారా?’ అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా, మితిమీరిన VFX, ఓవర్ ది టాప్ యాక్షన్ సన్నివేశాలు కూడా అవసరమా అని ప్రశ్నించారు. ఎన్టీఆర్ నటనకు మంచి మార్కులు పడినప్పటికీ, రోల్ డిజైన్, VFX లోపం వార్ 2 డిజాస్టర్ కు ఓ కారణమనే చెప్పాలి.

46
డ్రాగన్ కోసం ఎన్టీఆర్ సాలిడ్ బీస్ట్ లుక్!

వార్ 2 సినిమా ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయింది. దీంతో ఎన్టీఆర్ ఈసారి ఎలాగైనా మంచి హిట్ కొట్టాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ తరుణంలో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న డ్రాగన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా రుక్మిణి వసంత్ ను ఎంపిక చేశారు. డ్రాగన్ సినిమా ఇప్పటికే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెట్స్ మీదకి వెళ్లింది. ఈ సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్ తన లుక్‌ను పూర్తిగా మార్చుతున్నారు. గతంలో కొంచెం బొద్దుగా కనిపించిన ఎన్టీఆర్ ఇప్పుడు బరువు తగ్గి బక్కచిక్కి, ఫిట్‌గా మారిపోయాడు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

56
జిమ్ ఫిట్నెస్ వీడియో వైరల్

తాజాగా జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించిన జిమ్ వీడియో లీక్ అయ్యింది. ఈ వీడియోలో ఎన్టీఆర్ ఫుల్ బీస్ట్ లుక్‌లో కనిపిస్తున్నారు. చెస్ట్, ఆర్మ్ వర్క్ అవుట్స్ చేస్తూ కనిపించారు. మేకర్స్ వీడియోకు “ప్రతి చెమట చుక్క విధ్వంసం కోసం నిర్మిస్తుందే” అనే పవర్‌ఫుల్ క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఫ్యాన్స్ ఈ చిన్న వీడియో చూస్తేనే డ్రాగన్ సినిమా ఫుల్ ఎక్సైట్‌మెంట్ అందిస్తుందనేది అర్థమవుతుందని కామెంట్స్ చేస్తున్నారు.

ఎన్టీఆర్ డ్రాగన్‌లో సాలిడ్ బీస్ట్ లుక్, యాక్షన్, ఫిట్‌నెస్, ఫ్యాన్స్‌కి మరో మాస్ రొమాన్స్ చూపించబోతున్నాడు. ఈ వీడియోతో తన బాడీపై ట్రోల్స్ చేసిన వారికి తారక్ సాలిడ్ రిప్లై ఇచ్చారంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరీ డ్రాగన్ మూవీ ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో వేచిచూడాలి.

🐉 in Beast mode#NTRNeel @tarak9999 pic.twitter.com/o36xmrTbDN

— NTR Trends (@NTRFanTrends) September 16, 2025

66
డ్రాగన్ కథ ఇదేనా..?

తారక్ - నీల్ కాంబోలో తెరకెక్కుతున్న డ్రాగన్ మూవీ స్టోరీ విషయానికి వస్తే.. థాయ్‌లాండ్, మయన్మార్‌లోని కొన్ని ప్రాంతాల్లో విస్తరించి ఉన్న గోల్డెన్ ట్రయాంగిల్ ప్రాంతాన్ని పాలించిన ప్రసిద్ధ చైనీస్ గ్యాంగ్ స్టర్, మాఫియా డాన్ 'జావో వీ' నిజ జీవిత పాత్ర నుంచి ప్రేరణ పొందినట్లు తెలుస్తోంది. 1969 లో చైనా-భారత్ మధ్య జరిగిన ఓపియం మాఫియా,  ట్రాఫికింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకుంటుందట. ఈ కథలో కలకత్తా పోర్ట్ గోల్డెన్ ట్రయాంగిల్‌కి దగ్గరగా ఉండటం, ఆ ప్రాంతం ఓపియం స్మగ్లింగ్‌కు కేంద్రంగా మారడం, చైనా మాఫియా కోల్‌కత్తాలో యాక్టివ్‌గా ఉండటం, స్థానిక గ్యాంగ్‌ల మధ్య గొడవలు, ఈ అక్టివ్ నెట్‌వర్క్‌లు యూరప్ వరకు విస్తరించడం ఈ కథలోని ప్రధానాంశాలు.

ఈ సినిమాలో ఎన్టీఆర్ మాఫియా డాన్ రోల్‌లో కనిపించబోతున్నారని సమాచారం. దిగువ స్థాయి నుంచి ఎదిగి ఇద్దరు గ్యాంగ్ స్టర్స్‌తో పోరాడి తిరుగులేని నాయకుడిగా అవతరిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్‌లో లెఫ్ట్ కార్నర్‌లో చైనా, భూటాన్, బెంగాల్-కొల్‌కతా గుర్తింపులు ఉన్నాయి. ఫ్యాన్స్ ఈ పోస్టర్ విశ్లేషణ ద్వారా సినిమాకు సంబంధించిన కథా వివరాలను అర్థం చేసుకుంటున్నారు. కథ చైనా కేంద్రంగా ఉండటంతో, ఈ సినిమాకు ‘డ్రాగన్’ అనే టైటిల్ పరిశీలిస్తున్నారని వార్తలు ఉన్నాయి. అధికారిక అనౌన్స్‌మెంట్ లేదు, కానీ సోషల్ మీడియాలో ఇప్పటికే ఈ టైటిల్ పాపులర్ అవుతోంది. అలాగే.. కథలో భారత్ లో 1969లో ప్రారంభమైన తొలి అటామిక్ న్యూక్లియర్ పవర్ స్టేషన్ కూడా నేపథ్యంగా ఉండే అవకాశాలున్నాయట.

Read more Photos on
click me!

Recommended Stories