Bigg Boss Telugu 9: భరణి మేనేజ్మెంట్ కోటా అని తేలిపోయిందా ? నిహారికతో నాగార్జున షాకింగ్ వీడియో వైరల్

Published : Dec 07, 2025, 02:02 PM IST

నాగార్జున, నిహారిక కొణిదెల మధ్య బిగ్ బాస్ షో గురించి సంభాషణ జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో ప్రకారం భరణి మేనేజ్మెంట్ కోటా అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. 

PREV
15
బిగ్ బాస్ తెలుగు 9లో షాకింగ్ ఎలిమినేషన్

కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ తెలుగు 9లో ఇక మరికొన్ని రోజుల ఆట మాత్రమే మిగిలి ఉంది. ప్రస్తుతం హౌస్ లో 8 మంది సభ్యులు ఉన్నారు. ఆదివారం రోజు షాకింగ్ ఎలిమినేషన్ ఉండబోతోంది. దాదాపుగా రీతూ చౌదరి ఎలిమినేట్ కావడం ఖాయం అని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో బిగ్ బాస్ నిర్వాహకులపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. పెద్ద ఎత్తున ట్రోలింగ్ కూడా జరుగుతోంది.

25
భరణిపై నెగిటివ్ ఒపీనియన్

బిగ్ బాస్ నిర్వాహకులు తమకి కావాలసిన వాళ్ళ కోసం జెన్యూన్ ప్లేయర్స్ ని ఎలిమినేట్ చేస్తున్నారు అంటూ ప్రచారం జరుగుతోంది. తాజా పరిణామాల నేపథ్యంలో ఆ విమర్శలు మరింత పెరిగాయి. భరణిపై బిగినింగ్ నుంచి కొందరు ఆడియన్స్ లో నెగిటివ్ ఒపీనియన్ ఉంది. భరణి గేమ్, టాస్క్ లలో సరిగ్గా పెర్ఫామ్ చేయడం లేదు. పైగా ఎలిమినేట్ అయిన వ్యక్తిని ఆడియన్స్ ఓటింగ్ అంటూ మళ్ళీ తీసుకువచ్చారు.

35
నాగబాబు అండదండలు

దివ్య, తనూజతో బాడింగ్స్ పెట్టుకోవడం తప్ప గేమ్ పరంగా భరణి సాధించింది ఏమీ లేదు అనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. భరణి.. మెగా బ్రదర్ నాగబాబు అండదండలతో హౌస్ లోకి అడుగుపెట్టినట్లు అంతా భావిస్తున్నారు. నాగబాబు కోసం భరణిని ఇంత కాలం హౌస్ లో ఉంచారని కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి. రీసెంట్ గా నాగార్జున, నిహారిక కొణిదెల మధ్య జరిగిన కాన్వర్జేషన్ ఒకటి వైరల్ గా మారింది.

45
నాగార్జునతో నిహారిక

గోవా ఫిలిం ఫెస్టివల్ లో నిహారిక, నాగార్జున కలుసుకున్నారు. అక్కడ వీరిద్దరూ సరదాగా మాట్లాడుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య బిగ్ బాస్ 9 గురించి, భరణి గురించి చర్చ వచ్చింది. నాగార్జున నిహారిక మాట్లాడుతూ.. మొన్నే నాన్నగారు బిగ్ బాస్ షోకి వచ్చారు అని చెప్పారు. నిహారిక ఎందుకు అని అడగగా.. భరణి కోసం వచ్చారు. భరణి నాన్నగారికి ఫ్రెండ్ అంట కదా.. నాన్నగారిని భరణి గురువుగా భావిస్తారు. అందుకే అతడిని విష్ చేయడానికి వచ్చారు అని నాగార్జున నిహారికతో చెప్పారు.

55
భరణి మేనేజ్మెంట్ కోటా

దీనితో ఈ వీడియో వైరల్ గా మారింది. భరణి మేనేజ్మెంట్ కోటా అనే విషయం మరోసారి కన్ఫర్మ్ అయింది అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. దీనిని బట్టి చూస్తుంటే భరణి టాప్ 5 లో ఉండడం ఖాయంగా కనిపిస్తోంది అని అంటున్నారు. అందుకే ఈ వారం రీతూ చౌదరిని ఎలిమినేట్ చేస్తున్నారు. భరణితో పాటు సుమన్ శెట్టి కూడా ఇంత కాలం హౌస్ లో ఉండాల్సిన కంటెస్టెంట్ కాదు అనేది నెటిజన్ల అభిప్రాయం. సుమన్ శెట్టికి ఇంత వరకు బలమైన పాయింట్ పెట్టు ఒకరిని నామినేట్ చేయడం కూడా తెలియదు. అలాంటి వ్యక్తిని హౌస్ లో ఉంచారు అని దుమ్మెత్తి పోస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories