నందమూరి బాలకృష్ణ అఖండ 2 కొత్త రిలీజ్ డేట్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేయాలనే డిమాండ్ ఎక్కువవుతోంది. అఖండ 2 కనుక సంక్రాంతికి విడుదలైతే ఏం జరుగుతుందో ఈ కథనంలో తెలుసుకుందాం.
నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 చిత్రం ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ డిస్కషన్ గా మారిపోయింది. డిసెంబర్ 5 రిలీజ్ కి అంతా రెడీ అయిపోయింది. థియేటర్ల వద్ద అభిమానుల హంగామా కూడా మొదలు పెట్టారు. కటౌట్లు కట్టారు. బాలయ్య పోస్టర్లకు పాలాభిషేకాలు మొదలయ్యాయి. మరికొన్ని నిమిషాలలో ప్రీమియర్ షోలు ప్రారంభం అవుతాయి అనగా చిత్ర యూనిట్ షాక్ ఇచ్చింది. అఖండ 2 రిలీజ్ వాయిదా అని ప్రకటించారు. ఈరోస్ సంస్థతో ఆర్ధిక వ్యవహారాలు, వివాదాలు కారణంగా అఖండ 2 రిలీజ్ ఆగిపోయింది.
25
గోల్డెన్ ఆపర్చునిటీ మిస్
అఖండ 2 రిలీజ్ వాయిదా పడడం అభిమానులకి బిగ్ షాక్ అనే చెప్పాలి. కారణాలు ఏవైనా అఖండ 2 చిత్రానికి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ పోయింది. ఈ చిత్ర బడ్జెట్ రికవరీ కావాలంటే సోలో రిలీజ్, హిట్ టాక్ వల్ల మాత్రమే సాధ్యం అని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. డిసెంబర్ 5 ముగిసింది కాబట్టి ఇప్పుడు నిర్మాతలు కొత్త రిలీజ్ డేట్ కోసం చర్చలు జరుపుతున్నారు. డిసెంబర్ 12న లేదా డిసెంబర్ 25న రిలీజ్ అంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
35
అవతార్ 3 తో పోటీ
డిసెంబర్ 25న అయితే అవతార్ 3 తో పోటీ పడాల్సి ఉంటుంది. అభిమానులు అయితే అఖండ 2ని సంక్రాంతికి రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే అఖండ 2 సంక్రాంతికి రిలీజ్ కావాలంటే చాలా సమస్యలు ఉన్నాయి. ఆల్రెడీ సంక్రాంతి బెర్తులని రాజా సాబ్, మన శంకర వరప్రసాద్ గారు చిత్రాలు ఖరారు చేసుకున్నాయి. బరిలో జన నాయకుడు, పరాశక్తి లాంటి డబ్బింగ్ చిత్రాలు కూడా ఉన్నాయి.
రాజా సాబ్ నిర్మాత విశ్వప్రసాద్ ఆల్రెడీ థియేటర్స్ తో అగ్రిమెంట్ పూర్తి చేశారట. ఇక మెగాస్టార్ చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు సినిమాపై విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ చిత్రానికి కూడా భారీగా థియేటర్స్ ఉండేలా డీల్ ముగిసినట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో బాలయ్య అఖండ 2 వస్తే ఎన్ని థియేటర్లు దక్కుతాయో తెలియని పరిస్థితి. సంక్రాంతికి పెద్ద సినిమాలు ఎన్ని రిలీజ్ అయినా కలెక్షన్స్ బాగానే వస్తాయి. అయితే ముందు నుంచే థియేటర్లు ఆక్యుపై చేసుకుని ఉండాలి.
55
నష్టం ఎవరికి అంటే..
అఖండ 2 సడెన్ గా సంక్రాంతికి వస్తే ఆ చిత్రానికే నష్టం ఎక్కువ అని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు. ఎందుకంటే అఖండ 2 హిట్ కావాలంటే 200 కోట్లకి పైగా గ్రాస్ రాబట్టాలి. రాజా సాబ్, మన శంకర వరప్రసాద్ చిత్రాలతో పోటీ పడి ఆ ఫీట్ సాధించడం కష్టం అవుతుంది. సో అఖండ 2 ఏదైనా సేఫ్ రిలీజ్ డేట్ చూసుకోవడం బెటర్ అనే టాక్ వినిపిస్తోంది. మరి నిర్మాతలు ఏం డిసైడ్ చేస్తారో వేచి చూడాలి.