మాజీ ప్రియురాలితో మళ్లీ రొమాన్స్ చేయబోతున్న నాగార్జున , కింగ్ 100వ సినిమాలో హీరోయిన్ ఎవరో తెలుసా?

Published : Oct 11, 2025, 11:17 AM IST

టాలీవుడ్ కింగ్ నాగార్జున తన 100వ సినిమా కోసం భారీగానే ప్లాన్స్ వేస్తున్నారు. అందులో భాగంగా తన మాజీ రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్ ను రంగంలోకి దింపబోతున్నాడు మన్మధుడు. ఇంతకీ నాగార్జున వందవ సినిమాలో హీరోయిన్ ఎవరు? 

PREV
16
టాలీవుడ్ మన్మధుడు

టాలీవుడ్ మన్మధుడుగా నాగార్జునకు యమా క్రేజ్ ఉంది. 66 ఏళ్ళ వయసులో కూడా కుర్రహీరోలకు పోటీ ఇస్తూ.. ఫిట్ గా కనిపిస్తున్నారు నాగార్జున. అమ్మాయిల మనసుల్లో ఇప్పటికీ రాకుమారుడిగానే ఉన్నాడు. తెలుగు సినీ పరిశ్రమలో రొమాంటిక్ ఇమేజ్ ఉన్న హీరోగా నాగార్జున కెరీర్ అందరికి తెలిసిందే. నాగార్జునతో సినిమా అంటే హీరోయిన్లు ఎగిరి గంతేస్తుంటారు. ఇప్పటికీ అదే ట్రెండ్ కొనసాగుతోంది. ఇక కింగ్ తో కొంత మంది హీరోయిన్ల రొమాన్స్ పై అప్పట్లో రకరకాల వార్తలు వైరల్ అయ్యాయి. ఈక్రమంలో ఆ హీరోయిన్లలో ఒక నటిని తన 100 వ సినిమా కోసం రంగంలోకి దింపబోతున్నాడట నాగార్జున.

26
100వ సినిమా కోసం

అక్కినేని నాగార్జున తన 100వ సినిమా కోసం రెడీ అవుతున్నాడు. తన లాండ్ మార్క్ మూవీనీ తానే స్వయంగా నిర్మిస్తున్నాడు కింగ్. అన్నపూర్ణ స్టూడియోస్ , మనం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో ఉంది. ఈసినిమా కోసం కార్తీక్ అనే కొత్త దర్శకుడికి అవకాశం ఇచ్చాడు నాగ్. అంతే కాదు ఎలాంటి హడావిడి లేకుండా రీసెంట్ గా ఈసినిమా షూటింగ్ ను సింపుల్ గా స్టార్ట్ చేశాడు నాగార్జున. అయితే ఈసినిమాకు సబంధించిన వివరాలు ఇంకా బయటకు రాలేదు. త్వరలో ఈమూవీ డీటేయిల్స్ ను వివరించే అవకాశం ఉంది. అయితే ఈమూవీలో హీరోయిన్ గా నాగార్జున మాజీ ప్రియురాలు టబును తీసుకున్నారన్న వార్త వైరల్ అవుతోంది.

36
కీలక పాత్రలో టబు

నాగార్జున తన 100వ సినిమాగా ఇది చాలా ప్రత్యేకంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. సినిమా స్క్రిప్ట్ నుండి అందులో నటించబోయే స్టార్స్ వరకూ ప్రతీ అంశంలోనూ ఆయన నేరుగా ఇన్వాల్వ్ అవుతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఓ క్రేజీ అప్‌డేట్ ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. అందేంటంటే ఈసినిమాలో నాగార్జున హిట్ పెయిర్, ఓకప్పటి కింగ్ రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్, సీనియర్ నటి టబు కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈసినిమా యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కబోతోంది. ఇందులో ముగ్గురు హీరోయిన్‌లు కనిపించనున్నారు. వారిలో ఒకరు టబు కావడం విశేషం.

46
మాజీ ప్రియురాలితో మళ్లీ రొమాన్స్

టబు, నాగార్జున జోడీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఇద్దరికి రొమాంటిక్ కపుల్ అన్న పేరు ఉంది. వీరిపై గతంలో ఎన్నో రూమర్స్ కూడా వచ్చాయి. నాగ్ టబును ప్రేమించాడని, కలిసి చెట్టాపట్టాలు వేసుకుని తిరిగారంటూ వార్తలు వైరల్ అయ్యాయి. వీరిద్దరు చాలా హిట్ సినిమాల్లో కలసి నటించారు. ముఖ్యంగా "నిన్నే పెళ్లాడుతా", "ఆవిడా మా ఆవిడే" , సిసింద్రి వంటి సినిమాల్లో ఈ జోడీ స్క్రీన్‌పై అద్భుతమైన కెమిస్ట్రీ చూపించింది. మరీ ముఖ్యంగా 1996లో రిలీజ్ అయిన నిన్నే పెళ్లాడుతా సినిమా రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా భారీ సక్సెస్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో నాగార్జున, టబు మధ్య ఉన్న కెమిస్ట్రీ చూసిన ఆడియన్స్ వీరిమధ్య ఏదో ఉంది అని ప్రచారం మొదలు పెట్టారు. అంతే కాదు వీరు పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్తలు కూడా వైరల్ అయ్యాయి అప్పట్లో. ఇక 1995లో వచ్చిన సిసింద్రీ సినిమాలో “ఆటాడుకుందాం రా..” సాంగ్‌లో ఈ జంట చేసిన రొమాన్స్ అంతా ఇంతా కాదు. ఇప్పటికీ ఆ పాట ఎవర్ గ్రీన్ గా నిలిచింది. అయితే వీరిమధ్య ఏదో ఉంది అన్న వార్తలపై పలు సందర్భాల్లో నాగార్జున క్లారిటీ కూడా ఇచ్చారు. తాము బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అని, టబు ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా తమ ఇంట్లోనే ఉంటుందన్నారు. నాన్నకు కూడా టబు అంటే ఎంతో అభిమానం అని నాగార్జున అన్నారు.

56
హిట్ సెంటిమెంట్ కోసం..

ప్రస్తుతం నాగార్జున టైమ్ పెద్దగా పనిచేయడంలేదు. సినిమాలు పెద్దగా వర్కౌట్ అవ్వడంలేదు. దాంతో ఈసారి 100వ సినిమా అయినా లాండ్ మార్క్ హిట్ కొట్టాలని ప్రయత్నిస్తున్నారు. ఈక్రమంలో నాగార్జున టబు కలిసి నటించిన సినిమాలన్నీ హిట్ అవ్వడంతో.. ఆ సెంటిమెంట్ ను రిపీట్ చేయాలని చూస్తున్నారట. ఈ జంట మళ్లీ తెరపైకి రాబోతుండటంతో, ఆ హిట్ సెంటిమెంట్ నిజంగా మళ్లీ పని చేస్తుందా? అనే ఆసక్తికర చర్చ మొదలయ్యింది. టబు ప్రస్తుతం బాలీవుడ్‌లో బిజీగా ఉన్నా, నాగార్జున 100వ సినిమాకోసం ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించనుందని సమాచారం. అయితే ఈ విషయంలో మాత్రం మూవీ టీమ్ కానీ, నాగార్జున కానీ అధికారికంగా ఎటువంటిప్రకటన చేయలేదు.

66
మరో ఇద్దరు హీరోయిన్లు ఎవరు?

నాగార్జున 100వ సినిమాలో టబు పాత్ర చాలా కీలకంగా ఉంటుందని, కథలో మలుపులకు ఆమె పాత్ర కారణం అవుతుందని సమాచారం. . మరోవైపు మిగిలిన ఇద్దరు హీరోయిన్‌ లు ఎవరు అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. వారిని ఇంకా సెలెక్ట్ చేయలేదనే తెలుస్తోంది. ఈ వీషయాలన్నింటిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. నాగార్జున అభిమానులు మాత్రం ఈ అద్భుతమైన కాంబినేషన్‌ను మళ్లీ తెరపై చూడబోతున్నందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఇది నిజం అయితే బాగుండు అని కోరకుంటున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories