Heroes 50th Movie: చిరు, బాలయ్య, నాగ్‌, వెంకీ 50వ సినిమా హిట్టా ఫట్టా.. మెగాస్టార్‌, మన్మథుడికి చేదు అనుభవం

Published : Oct 11, 2025, 10:46 AM IST

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్‌, నాగార్జున నలభై ఏళ్లకు పైగా హీరోలుగా సర్వైవ్‌ అవుతున్నారు. మరి వీరు నటించిన 50వ మూవీ ఏంటో తెలుసుకుంటే ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. 

PREV
15
చిరు, బాలయ్య, వెంకీ, నాగ్‌ 50వ సినిమాలు

స్టార్‌ హీరోలు దాదాపు నాలుగైదు దశాబ్దాలు హీరోలుగా సర్వైవ్‌ కావడం చాలా గొప్ప విషయం. అంత లాంగ్‌ కెరీర్‌ కొంత మంది హీరోలకే అది సాధ్యం. ప్రస్తుతం 40ఏళ్లకుపైగా కెరీర్‌లోనూ హీరోలుగా రాణిస్తున్నది టాలీవుడ్‌లో నలుగురు హీరోలు మాత్రమే ఉన్నారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌ ఇప్పటికీ హీరోలుగా రాణిస్తున్నారు. వీరితో సమకాలీకులైన మోహన్‌ బాబు, సుమన్‌, రాజశేఖర్‌, శ్రీకాంత్‌, జగపతిబాబు క్యారెక్టర్స్ చేస్తున్నారు. కానీ ఈ నలుగురు మాత్రం తమ ఇమేజ్‌ని కాపాడుకుంటున్నారు. వీరిలో వంద సినిమాలు పూర్తి చేసింది చిరంజీవి, బాలయ్యనే. నాగార్జున ఇప్పుడు వందవ మూవీ చేస్తున్నారు. వెంకీ ఇంకా చాలా దూరంలో ఉన్నాయి. మరి వీరి 50వ సినిమాలు ఏంటి? అవి హిట్టా, ఫట్టా అనేది చూద్దాం.

25
చిరంజీవి 50వ మూవీ అట్టర్‌ ఫ్లాప్‌

చిరంజీవి ప్రస్తుతం 158 సినిమాల వరకు వచ్చారు. మరో రెండు మూడు ప్రాజెక్ట్ లు లైనప్‌లో ఉన్నాయి. ఈ లెక్కన చిరంజీవి యాభైవ మూవీ ఎప్పుడో దాటేశారు. ఇంకా చెప్పాలంటే బ్రేక్‌ రావడానికి ముందే 50 సినిమాలు చేశారు చిరు. ఆయనకు `ఖైదీ` చిత్రంతో బ్రేక్‌ అందుకున్న విషయం తెలిసిందే.  అంతకు ముందే ఆయన యాభై సినిమాలను పూర్తి చేశారు. చిరు 50వ మూవీ `ప్రేమ పిచ్చోళ్లు`. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. 1983లో ఇది విడుదలైంది. రాధిక, కవిత హీరోయిన్లుగా నటించారు. ఈచిత్రం డిజాస్టర్‌గా నిలిచింది. అయితే చిరు యాభై మూవీస్‌లో నాలుగు గెస్ట్ రోల్స్ వి కూడా ఉన్నాయి. వాటిని తీసేస్తే యాభైవ మూవీ `శివుడు శివుడు శివుడు` అవుతుంది. దీనికి కూడా కోదండ రామిరెడ్డి దర్శకుడు. త్రిపాత్రాభినయం చేసిన ఈ మూవీ కూడా ఆడలేదు. చిరుకి 50వ మూవీ కలిసి రాలేదని, చేదు అనుభవాలనే మిగిల్చిందని చెప్పొచ్చు.

35
బాలయ్య 50వ మూవీ బ్లాక్‌ బస్టర్‌

బాలకృష్ణ ప్రస్తుతం 110 సినిమా చేస్తున్నారు. `అఖండ 2`తో త్వరలో రాబోతున్నారు. అయితే బాలయ్య 50వ మూవీ `నారి నారి నడుమ మురారి`. కోదండ రామిరెడ్డి దర్శకత్వంలోనే ఈ చిత్రం రూపొందింది. ఇందులో శోభన, నిరోషా హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఇందులో ఫైట్లు కూడా లేవు. ఒక్క ఫైట్‌ లేకుండా బాలయ్య హిట్‌ కొట్టిన మూవీ ఇది ఒక్కటే అని చెప్పొచ్చు.

45
నాగార్జున 50వ మూవీ పరాజయం, కానీ

ఇక నాగార్జున విషయానికి వస్తే తెలుగులో ఆయన యాభైవ మూవీ `ఆకాశ వీధిలో`. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. రవీనా టండన్‌ హీరోయిన్‌గా నటించింది. 2001లో ఈ మూవీ విడుదలైంది. ఆడియెన్స్ ని ఆకట్టుకోలేకపోయింది. అయితే తెలుగు, హిందీ, తమిళ చిత్రాలను కలుపుకుని చూస్తే 50వ మూవీ `అంగారే`. ఇది హిందీలో రూపొందింది. మహేష్‌ భట్‌ దర్శకుడు. అక్షయ్‌ కుమార్‌తో కలిసి నాగ్‌ ఈ మూవీ చేశారు. అక్కడ ఇది బాగానే ఆడింది. క్యామియో రోల్స్ పక్కన పెడితే `సీతారామరాజు` 50వ మూవీ అవుతుంది. వైవీఎస్‌ చౌదరీ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీలో హరికృష్ణ ముఖ్య పాత్ర పోషించారు. ఈ మూవీ తెలుగులో హిట్‌ ఖాతాలో పడింది. 

55
వెంకటేష్‌ 50వ మూవీ బ్లాక్‌ బస్టర్‌, కానీ

వెంకటేష్‌ యాభైవ మూవీ `నువ్వు నాకు నచ్చావ్‌`. విజయ భాస్కర్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ఆర్తి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీకి త్రివిక్రమ్‌ మాటలు రాయడం విశేషం. 2001లో విడుదలైన ఈ మూవీ బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. వెంకీని కెరీర్‌ పరంగా మరో మెట్టు ఎక్కించింది. హిందీ మూవీస్‌, గెస్ట్ రోల్స్ పక్కన పెడితే `జెమినీ` తన యాభైవ మూవీ అవుతుంది. ఇది డిజాస్టర్‌గా నిలవడం గమనార్హం. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories