మెగా బ్రదర్ నాగబాబుకి ఓ స్టార్ హీరో సినిమాతో చేదు అనుభవం ఎదురైంది. దానిని నాగబాబు అవమానంగా ఫీల్ అయ్యారు. ఆ తర్వాత అదే బ్యానర్ లో సినిమా చేసేందుకు నాగబాబు అంగీకరించలేదు.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా రాణించడం మొదలు పెట్టిన తర్వాత ఆయన బ్రదర్ నాగబాబు కూడా సినిమాల్లో నటించడం ప్రారంభించారు. చిన్న పాత్రలు, క్యారెక్టర్ రోల్స్ చేశారు. నిర్మాతగా కూడా రాణించారు. అయితే నాగబాబుకి ఒక సినిమా విషయంలో అవమానం జరిగిందట. ఆ సినిమా మంచి విజయం సాధించింది.
25
వెంకటేష్ గణేష్ మూవీ
విక్టరీ వెంకటేష్ కి నటన పరంగా మైలురాయిగా నిలిచిన చిత్రాల్లో గణేష్ ఒకటి. ఈ మూవీ వెంకటేష్ పెర్ఫార్మెన్స్ అద్భుతం అనే చెప్పాలి. ఈ చిత్రాన్ని వెంకటేష్ బ్రదర్ సురేష్ బాబు.. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించారు. తిరుపతి స్వామి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ మూవీలో రంభ హీరోయిన్ గా నటించారు. ఈ చిత్రంలో ఉత్తమ నటుడిగా వెంకటేష్ కి, ఉత్తమ విలన్ గా కోట శ్రీనివాసరావుకి నంది అవార్డులు దక్కాయి.
35
నాగబాబుకు షాక్
ఈ చిత్రం లో నాగబాబు కూడా కీలకమైన పాత్రలో నటించారు. సినిమా రిలీజ్ అయ్యాక నాగబాబు మూవీ చూశారట. అంతే ఆయన మైండ్ బ్లాక్ అయింది. దీనికి గల కారణాన్ని ప్రేయసి రావే దర్శకుడు చంద్ర మహేష్ తెలిపారు. ఎడిటింగ్ లో పూర్తిగా నాగబాబు పాత్రని లేపేశారు. దీనితో సురేష్ ప్రొడక్షన్స్ పై, దగ్గబాటి ఫ్యామిలీపై నాగబాబుకు బాగా కోపం వచ్చింది.
ఇక వాళ్ళతో సినిమా చేయకూడదు అని అనుకున్నారట. ఆ తర్వాత వాళ్ళ బ్యానర్ లోనే నేను తెరకెక్కిస్తున్న ప్రేయసి రావే చిత్రంలో పాత్ర చేయమని నాగబాబు గారిని నేను అడిగాను. అప్పుడు ఆయన వాళ్ళ బ్యానర్ లో నటిస్తే నా రోల్ ని ఎడిటింగ్ లో లేపేస్తారు. నేను చేయను అని అన్నారు. ఈసారి అలా జరగదు అని హామీ ఇవ్వడంతో నాగబాబు.. ప్రేయసి రావే చిత్రంలో డాక్టర్ పాత్రలో నటించారు.
55
శ్రీకాంత్, రాశి మూవీ
శ్రీకాంత్, రాశి జంటగా నటించిన ప్రేయసి రావే చిత్రం ఘనవిజయం సాధించింది. ఎమోషనల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రానికి ఫ్యామిలీ ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. బబ్లూ పృథ్వీరాజ్, శివాజీ రాజా కీలక పాత్రల్లో నటించారు.