Gundeninda Gudigantalu: తాగొచ్చిన బాలుకి చుక్కలు చూపించిన మీనా..కోపాలు తగ్గించుకుని ఎలా ఒక్కటయ్యారంటే

Published : Jan 16, 2026, 11:30 AM IST

‘గుండె నిండా గుడి గంటలు’ జనవరి 16న 599 వ ఎపిసోడ్ ప్రేక్షకులను కట్టిపడేసింది. బాలూ–మీనా మధ్య గొడవ, ప్రభావతి ఆనందం, చివర్లో ఇద్దరి మధ్య సర్దుబాటు ఈ ఎపిసోడ్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

PREV
15
తమ్ముడిపై మీనా ప్రేమ, తాగొచ్చిన బాలు 

శుక్రవారం (జనవరి 16) ఎపిసోడ్ బాలూ తాగి ఇంటికి రావడంతో మొదలవుతుంది. ఇంటి బయటే మీనాతో గొడవ పడతాడు. తన మాట వినకుండా గుడికి వెళ్లిందని ఆమెపై కోపం చూపిస్తాడు. తమ్ముడి బర్త్‌డే కోసం మాత్రమే వెళ్లానని, తండ్రి లేని వాడు కాబట్టి మంచి జరగాలనే ఉద్దేశంతోనే అలా చేసినట్లు మీనా చెబుతుంది. అయినా బాలు కోపం తగ్గదు. ‘నాపై ప్రేమ లేదా? నేను కేవలం డ్రైవర్‌ని కాబట్టే ఇలా చేస్తున్నావా?’ అంటూ మరింతగా రెచ్చిపోతాడు. చివరికి మీనా అతడిని బలవంతంగా ఇంట్లోకి తీసుకెళ్తుంది. భోజనం కూడా చేయకుండా పడుకుంటాడు. 

25
అలాంటి తల్లి మీరు ఒక్కరే 

బాలూ–మీనా గొడవను చూసిన ప్రభావతి ఎంతో సంతోషిస్తుంది. ‘ఇప్పుడు మీకు తృప్తిగా ఉందా?’ అని మీనా అడిగినా ప్రభావతి ఏమాత్రం పట్టించుకోదు. కొడుకు తాగి వచ్చి గొడవ పడుతుంటే సంతోషించే తల్లిని మీరు మాత్రమే అని మీనా అంటుంది. ఇక రోజూ ఇలాగే గొడవలు పడుతుంటారని ఆమె చెప్పడం మీనాకు బాధ కలిగిస్తుంది.

35
కారు కీస్ దాచిపెట్టేసిన మీనా 

మరుసటి రోజు ఉదయం మీనా కాఫీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తే బాలు తీసుకోడు. ఇకపై ఆమె చేత్తో ఏదీ తీసుకోనని అంటాడు. దీంతో మీనా అతడికి బుద్ది చెప్పాలని కారు కీస్ దాచేస్తుంది. వాటి కోసం బాలు వెతుకుతుండగా సత్యం ఏం జరిగిందని అడుగుతాడు.రాత్రి తాగొచ్చావా అని బాలుని నిలదీస్తాడు. మీనాను కూడా అడిగినా ఆమె మౌనంగా ఉంటుంది. ప్రభావతి అసలు విషయం చెప్పడంతో, కారు కీస్ కూడా మర్చిపోయేంత తాగావా అంటూ సత్యం బాలుని హెచ్చరిస్తాడు.

45
బాలుకి ఎదురు తిరిగిన మీనా 

తర్వాత మీనా కారు కీస్ తీసుకెచ్చి సత్యం ముందు పెడుతుంది. కిచెన్‌లో మర్చిపోయాడని చెబుతుంది. దీంతో సత్యం మరింత కోపపడతాడు. ఆ తర్వాత కిచెన్‌లో బాలు మీనాతో మరోసారి గొడవ పడతాడు. ‘నేను కిచెన్‌కే రాలేదు కదా, ఎందుకు అబద్ధం చెప్పావు?’ అంటూ ఆమెపై విరుచుకుపడతాడు.ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి, మీనా కూడా ధైర్యంగా ఎదురు తిరుగుతుంది. పెళ్లి అయిన తర్వాత ఆడపిల్ల పూర్తిగా పుట్టింటికి దూరమవ్వాలా అని బాలుని నిలదీస్తుంది. చివరకు బాలు అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

55
కోపాలు తగ్గి ఇద్దరి మధ్య ప్రేమ 

ఫ్రెండ్ రాజేష్‌తో మీనా గురించి చెప్పి బాలు బాధపడుతుంటాడు. అటు మీనా కూడా పూలు అల్లుతూ ఇంట్లో జరిగిన విషయాల్ని చెప్పి బాధపడుతుంది. ఇద్దరూ వెనక్కి తగ్గాలని వాళ్లవాళ్లు సలహా ఇస్తారు.దీంతో మీనాకు సర్‌ప్రైజ్ ఇవ్వాలని బాలు ఒక బహుమతి తీసుకెళ్తాడు. అదే సమయంలో మీనా కూడా బాలుకోసం గుమగుమలాడే వంట చేసి పెడుతుంది. ఇలా భావోద్వేగాలతో ‘గుండె నిండా గుడి గంటలు’ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories