చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు చిత్రం బ్లాక్ బస్టర్ వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ చిత్రం విషయంలో చిన్న పొరపాటు జరిగి ఉంటే సినిమా డిజాస్టర్ అయ్యేది. అదేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
బ్లాక్ బస్టర్ దిశగా చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు
మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ మన శంకర వరప్రసాద్ గారు చిత్రం సంక్రాంతికి విడుదలై ప్రభంజనం సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 150 కోట్ల వరకు గ్రాస్ రాబట్టింది. అయినప్పటికీ మెగాస్టార్ జోరు తగ్గలేదు. బుకింగ్స్ మైండ్ బ్లాక్ అయ్యేలా ఉన్నాయి. బుక్ మై షో లో రికార్డులు నమోదు చేస్తోంది ఈ చిత్రం. దీనితో మన శంకర వరప్రసాద్ గారు చిత్ర యూనిట్ సంబరాల్లో ఉన్నారు.
25
నయనతార విషయంలో చిరంజీవి డౌట్
ఈ చిత్రం విజయం సాధించిన సందర్భంగా చిరంజీవి, విక్టరీ వెంకటేష్, దర్శకుడు అనిల్ రావిపూడి.. నిర్మాతలు సాహు గారపాటి, సుష్మిత కొణిదెల సంక్రాంతి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా వీరి మధ్య నయనతార గురించి ఆసక్తికర చర్చ జరిగింది. చిరంజీవి మాట్లాడుతూ.. అడిగిన తక్కువ సమయంలోనే నయనతార ఎక్కువ డేట్లు ఇస్తుందా అనే సందేహం ఉండేది.
35
అనిల్ రావిపూడి మేనేజ్ చేశారు
కానీ కావలసినన్ని డేట్లు ఇచ్చింది. ఆమె వల్ల బడ్జెట్ ఎక్కువ అవుతుందా అనే సందేహం కూడా కలిగింది. కానీ అవన్నీ దర్శకుడు అనిల్ రావిపూడి అద్భుతంగా మేనేజ్ చేశారు. ఆమెని ఎలా ఒప్పించాడు అనేది నాకు కూడా ఆశ్చర్యంగా ఉంది అంటూ చిరంజీవి అన్నారు. అనిల్ మాట్లాడుతూ.. వాస్తవానికి చాలా మంది హీరోయిన్లని అనుకున్నాను. ఈ చిత్రంలో మీకు వేలు చూపించి మాట్లాడడం, వార్నింగ్ ఇవ్వడం లాంటి సన్నివేశాలు ఉన్నాయి.
బడ్జెట్ గురించి అలోచించి ఎవరో ఒకరిని పెట్టేస్తే తేడా కొట్టేస్తుంది అనిపించింది. మీకు వార్నింగ్ ఇవ్వాలి అంటే హీరోయిన్ కి కూడా ఒక రేంజ్ ఉండాలి. అలాంటి పాత్రకి బడ్జెట్ ఎక్కువైనా నయనతార అయితే బెస్ట్ అని అనిపించింది. ఆమెకి ఈ కథ బాగా నచ్చింది. నాకంటే ముందుగా సుష్మిత, సాహు గారు ఆమెతో మాట్లాడి టెక్నికల్ ఫార్మాలిటీస్ దాదాపుగా పూర్తి చేశారు.
55
నయనతారకి హిట్ అవుతుంది అని తెలుసు
అప్పుడు నేను నయనతారకి కథ చెప్పాను. ఆమెకి కథ నచ్చింది. చిరంజీవి, వెంకటేష్ ఇద్దరి కాంబినేషన్ అనగానే ఇంకా ఎగ్జైట్ అయ్యారు. కానీచిన్న టెక్నికల్ అంశంలో చర్చలు పూర్తి కాలేదు. ఇక నయనతార గారు ఈ చిత్రానికి ఒప్పుకోరు లే అని అనుకుంటున్న టైంలో నాకు ఫోన్ చేశారు. అనిల్ నాకు కథ నచ్చింది. ఇది ఓకే సూపర్ ప్రాజెక్టు అవుతుంది అని తెలుసు. కానీ వేరే విషయాలు సెట్ కావడం లేదే.. ఏం చేద్దాం అని అన్నారు. ఒక వేళ నేను నో చెబితే ఏం చేస్తావు అని అడిగారు. చేసేది ఏముంది మేడం.. వెంకటేష్ గారి దృశ్యం సినిమా చూశారా.. అందులో ఆ తేదీన నేను ఎక్కడికీ వెళ్ళలేదు అని చెబుతారు. అదే విధంగా నేను కూడా మిమ్మల్ని కలవలేదు.. మీతో మాట్లాడలేదు అని అనుకుంటా అని చెప్పా. వెంటనే నవ్వేసి ప్రాజెక్టు కి ఒకే చెప్పినట్లు అనిల్ రావిపూడి గుర్తు చేసుకున్నారు.