నాగార్జున మొదటి భార్య లక్ష్మి రెండో పెళ్లి చేసుకుంది ఎవరినో తెలుసా? నాగచైతన్య తల్లి ఇప్పుడు ఎక్కడున్నారు

Published : Jul 01, 2025, 05:43 PM IST

నాగార్జున తన మొదటి భార్య లక్ష్మికి విడాకులు ఇచ్చి అమలను పెళ్లాడారు. మరి నాగచైతన్య తల్లి రెండో పెళ్లి చేసుకున్నది ఎవరిని? ఆయన ఏం చేస్తారు? నాగచైతన్య తల్లి పెళ్లి చేసుకున్నది ఏవరినో తెలుసా?

PREV
16

అక్కినేని ఫ్యామిలీలో నాగేశ్వరావు తప్పించిన వారసులంతా దాదాపు రెండు పెళ్లిళ్లు చేసుకున్నావారే. ముఖ్యంగా నాగార్జునతో ఇది మొదలయ్యింది. నాగార్జున మొదటగా రామానాయుడు కూతురు, హీరో వెంకటేష్ చెల్లెలు లక్ష్మిని పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికి నాగచైతన్య పుట్టిన తరువాత కొంత కాలానికి మనస్పర్ధలు వచ్చి విడాకులు తీసుకున్నారు. 

ఇక విడాకులు తరువాత నాగార్జున హీరోయిన్ అమలను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇక నాగచైతన్య తల్లి లక్ష్మి నాగార్జునకు విడాకులు ఇచ్చిన తరువాత రెండో పెళ్లి చేసుకుని ఫారెన్ లో సెటిల్ అయ్యింది. అయితే నాగ చైతన్య తల్లి పెళ్లి చేసుకున్నది ఎవరిని? ఆయన బాక్ గ్రౌండ్ ఏంటి? ఏం చేస్తారు? ఎక్కడుంటారు?

26

65 ఏళ్లు దాటినా కూడా టాలీవుడ్ లో స్టార్ హీరోగా వెలుగు వెలుగుతున్నాడు కింగ్ నాగార్జున. ఆయన వారసుడు నాగ చైతన్య కూడా సినిమాల్లో హీరోగా రాణిస్తున్నారు. అయితే ఇద్దరు తండ్రీ కొడుకులు రెండు సార్లు పెళ్లి చేసుకున్ని రికార్డ్ క్రియేట్ చేశారు అని చెప్పాలి. నాగార్జునలాగే ఆయన కుమారుడు నాగ చైతన్యకు కూడా మొదటి వివాహం విడాకులతో ముగిసింది. హీరోయిన్ సమంతను 2017లో పెళ్ళి చేసుకున్న నాగచైతన్య మూడేళ్లకే మనస్పర్ధలతో విడిపోయి విడాకులు తీసుకున్నారు.

36

సమంత తో విడాకుల తర్వాత నాగ చైతన్య హీరోయిన్ శోభితా ధూళిపాళ్లతో ప్రేమలో పడ్డారు. పోయిన ఏడాది డిసెంబర్ లో వీరి పెళ్లి చాలా గ్రాండ్ గా జరిగింది. ఇక నాగ చైతన్య, నాగార్జున మొదటి భార్య కుమారుడు. నాగార్జున ఫస్ట్ లక్ష్మిని పెళ్లి చేసుకోగా వారికి జన్మించిన కుమారుడే నాగ చైతన్య. 1990 సంవత్సరంలో లక్ష్మి తో విడాకులు తీసుకొని విడిపోయారు నాగార్జున. నాగార్జునలాగే ఆయన మొదటి భార్య లక్ష్మి కూడా విడాకుల తర్వాత మళ్లీ పెళ్లి చేసుకున్నారు.

46

ఆమె పెళ్లాడిన వ్యక్తి పేరు శరత్. అసలు పేరు శరత్ విజయరాఘవన్. ఆయన శ్రీరామ్ మోటార్స్ సంస్థను నడుపుతున్నారు. వీరి పెళ్లి తర్వాత లక్ష్మి తన భర్తతో కలిసి అమెరికాలో స్థిరపడ్డారు. అంతేకాదు లక్ష్మి రెండో పెళ్లి నాగచైతన్యకు ఇష్టం లేదని అప్పట్లో ప్రచారం జరగింది. తల్లితో అప్పుడప్పుడు మాట్లాడటం తప్పించి వారి దగ్గరకు చైతూ వెళ్లడని రూమర్స్ బాగా వచ్చాయి. కానీ అవన్నీ అసత్యాలని, అందులో ఎటువంటి నిజం లేదని నాగచైతన్య నిశ్చితార్థం, పెళ్లి తరువాత అందరికి క్లారిటీ వచ్చింది.

56

ఈ నిశ్చితార్థ వేడుకకు తన రెండో భర్తతో కలిసి వచ్చి తన కుమారుడిని ఆశీర్వదించారు లక్ష్మి. అంతే కాదు వీరంత గ్రూఫ్ ఫోటో కూడా దిగారు. అమలతో లక్ష్మి మాట్లాడిన ఫోటోస్ కూడా వైరల్ అయ్యాయి. నాగచైతన్య తన తల్లి ఫ్యామిలీతో కలిసి సపరేట్ గా ఫోటో కూడా దిగారు. ఇక రీసెంట్ గా అఖిల్ పెళ్లి కూడా అయ్యింది. అఖిల్ ది కూడా మొదటి పెళ్లి అవ్వకుండానే క్యాన్సిల్ చేసుకుని రెండోసారి కూడా ప్రేమ పెళ్లి చేసుకున్నారు. .

66

గతంలో వ్యాపార వేత్త జీవీకే మనవరాలు శ్రియా భూపాల్ ను ఆయన ప్రేమించారు. నిశ్చితార్ధం కూడా చేసుకున్నారు. పెళ్లి కోసం ఇటలీ వెళ్లబోయే సమయానికి ఏమయ్యిందో ఏమో కాని వీరి పెళ్లి బ్రేకప్ అయ్యింది. ఆతరువాత నుంచి చాలా గ్యాప్ ఇచ్చిన అఖిల్.. మరో వ్యాపారవేత్త ఫ్యామిలీకి చెందిన జైనాబ్ తో ప్రేమలో పడ్డాడు. రీసెంట్ గానే వీరి పెళ్లి అన్నపూర్ణ స్టూడియోస్ లో ఘనంగా జరిగింది.

Read more Photos on
click me!

Recommended Stories