చిరంజీవి సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి, ఎన్నో కష్టాలు పడి, తన టాలెంట్ అంతా చూపించి, స్టార్ హీరోగా ఎదిగాడు. డాన్స్, ఫైట్స్, యాక్టింగ్, డైలాగ్ టైమింగ్ ఇలా అన్ని విషయాలలో తనను తాను నిరూపించుకున్నాడు.
అందుకే చిరంజీవి టాలీవుడ్ మెగాస్టార్ అయ్యాడు. అంతే కాదు తెలుగు సినీపరిశ్రమకు పెద్ద దిక్కుగా మారాడు. ఇండస్ట్రీలో మెగా సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఆయన కుటుంబం నుంచి అరడజనుకు పైగా స్టార్ హీరోలు ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. అంతే కాదు ముగ్గరు పాన్ ఇండియా హీరోలు కూడా మెగా ప్యామిలీలో ఉన్నారు.