ప్రస్తుతం నిహారిక ఓ యంగ్ హీరోను ప్రేమిస్తున్నారని, అతనితోనే త్వరలో వివాహం చేసుకోనుందని వార్తలు వెలువడుతున్నాయి. కానీ ఈ వార్తలపై నిహారిక నుంచి లేదా మెగా ఫ్యామిలీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయినప్పటికీ సోషల్ మీడియాలో ఈ వార్తలు వైరల్ అవుతున్నాయి.
అంతేకాకుండా, ఇటీవల నిహారిక ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాజకీయాల్లోకి అడుగుపెడతారని కూడా కొన్ని రూమర్లు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ వార్తలను ఆమె ఖండించగా, అభిమానుల మాత్రం ఆమె రాజకీయాల్లోకి రావాలన్న కోరుకుంటున్నారు.