ఫస్ట్ టైమ్‌ కాబోయే భర్తని ప్రకటించిన కీర్తిసురేష్‌, అతిపెద్ద రహస్యం వెల్లడి

First Published | Nov 27, 2024, 4:51 PM IST

మహానటి కీర్తిసురేష్‌ త్వరలోనే అత్తారింటికి అడుగుపెట్టబోతుంది. ఆమె పెళ్లి చేసుకోబోతుంది. తాజాగా ప్రియుడుని ప్రకటించింది కీర్తిసురేష్‌ . 
 

`మహానటి` సినిమాతో తెలుగు ఆడియెన్స్ ని మాత్రమే కాదు, సౌత్‌ ఆడియెన్స్ ని మెస్మరైజ్‌ చేసింది కీర్తిసురేష్‌. ట్రెడిషనల్‌ లుక్‌లో కనిపిస్తూ ఆకట్టుకునే కీర్తిసురేష్‌ ఇటీవల బౌండరీలు బ్రేక్‌ చేసింది. బాలీవుడ్‌ సినిమాలో గ్లామర్‌కి గేట్లు ఎత్తేసి తనలోని మరో కోణాన్ని చాటుకుంది. ఈ నేపథ్యంలో కీర్తి గత రెండు మూడు రోజులుగా వైరల్‌గా మారింది. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఈ నేపథ్యంలో ఇప్పుడు మరో సర్‌ప్రైజ్‌ ఇచ్చింది కీర్తిసురేష్‌. ఆమె త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. కేరళాకి చెందిన ఆంటోని తట్టిల్‌ని ఆమె మ్యారేజ్‌ చేసుకోబోతుంది. ఆంటోనీ కొచ్చి, దుబాయ్‌లలో బిజినెస్‌ మేన్‌గా రాణిస్తున్నారు. కైపలాత్‌ హబీబ్‌ ఫరూక్‌తో కలిసి చెన్నైలో ఆస్పెరోస్‌ విండ సొల్యూషన్స్ కి హోనర్‌గా రాణిస్తున్నారు. వీరి వ్యాపారం కొచ్చి, దుబాయ్‌ బేస్డ్ గా రన అవుతుంది. ఈ రకంగా ఆంటోనీ కోట్లకు అధిపతి అని చెప్పొచ్చు. 


ఇదిలా ఉంటే కీర్తిసురేష్‌ ఆంటోని వివాహం చేసుకోబోతుందంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. కానీ క్లారిటీ లేదు. ఈనేపథ్యంలో ఇప్పుడు అధికారికంగా ప్రకటించింది కీర్తిసురేష్‌. సోషల్‌ మీడియా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. అంతేకాదు తన ప్రేమకు సంబంధించిన రహస్యాన్ని బయటపెట్టింది. చాలా రోజులుగానే వీరిద్దరు ప్రేమలో ఉన్నట్టు తెలిపింది. 15ఏళ్ల ప్రేమ, అనుబంధంగా వెల్లడిస్తూ ప్రియుడిని పరిచయం చేసింది. 
 

ఈ ఇద్దరు వెనకాల తిరిగి సూర్యుడిని చూస్తున్నట్టుగా ఉన్న ఓ ఫోటోని సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంది కీర్తిసురేష్‌. ఇందులో 15ఏళ్లు, ఇంకా కొనసాగుతుంది అంటూ రింగ్‌, బాండింగ్‌కి సంబంధించిన సింబల్‌ పంచుకుంది. అంతేకాదు ఇది ఎప్పట్నుంచో ఉంది అంటూ పేర్కొంది. ` AntoNY x KEerthy ( Iykyk)` అంటూ పేర్కొంది కీర్తిసురేష్‌. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్‌ అవుతుంది. సెలబ్రిటీలు స్పందించి అభినందనలు తెలియజేస్తున్నారు. కాజల్‌ వంటి హీరోయిన్లు కూడ స్పందించి విష్‌ చేయడం విశేషం. 

కీర్తిసురేష్‌, ఆంటోని పెళ్లి కూడా ఫైనల్‌ అయ్యిందట. డిసెంబర్‌ 11, 12 తేదీల్లో జరగబోతుందని తెలుస్తుంది. కీర్తిసురేష్‌ హిందూ, ఆంటోనీ క్రిస్టియన్‌. దీంతో మతం కూడా మారే అవకాశం ఉందట. ప్రస్తుతం ఈ విషయంతోపాటు లేటెస్ట్ ఫోటోలు సామాజిక మాధ్యమాలలో వైరల్‌ అవుతున్నాయి. 

read more: రజనీకాంత్‌ని పిచ్చోడిగా వర్ణించిన మీడియా, చిరంజీవితో కూడా గొడవ.. నాగబాబు చెప్పిన నిజాలు

Latest Videos

click me!