47 ఏళ్లకు పెళ్లి చేసుకున్న సుబ్బరాజు , అమ్మాయి ఎవరో తెలుసా..?

First Published | Nov 27, 2024, 4:53 PM IST

టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న స్టార్  నటుడు పెళ్లి పీటలెక్కడు. 50 ఏళ్లకు అతి దగ్గరగా ఉన్న నటుడు పెళ్ళికొడుకయ్యాడు. ః

నటుడు సుబ్బరాజు పెళ్లి

ఈమధ్య  కాలంలో పెళ్లిళ్లు, విడాకులు ఎక్కువైపోయాయి  సినీ పరిశ్రమలో. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ గా ఉన్న స్టార్స్ అంతా పెళ్లి చేసుకుని ఇంటివారు అవుతున్నారు. 

కీర్తి సురేష్ కూడా త్వరలో తన ప్రియుడిని  పెళ్లి చేసుకోబోతున్నారు. అంతే కాదు తాజాగా తన ప్రియుడిని పరిచయం చేసింది కూడా.  ఈ నేపథ్యంలో తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ గా నటిస్తున్న స్టార్ నటుడు సుబ్బరాజు కూడా  పెళ్లి చేసుకుని బ్రహ్మచారి జీవితానికి గుడ్ బై చెప్పారు.

నటుడు సుబ్బరాజు పెళ్లి

తెలుగు ప్రేక్షకులకు  పరిచయం అక్కర్లేని పేరు సుబ్బరాజు. అయితే చాలా హ్యండ్సమ్ గా ఉండే ఈ నటుడికి 47 ఏళ్లంటే నమ్మడం కష్టం. లేట్ గా అయినా బ్యాచిలర్ జీవితానికి స్వస్తి చెపుతున్నాడు సుబ్బరాజు. తెలుతో పాటు తమిళంలో కూడా నటించాడు సుబ్బరాజు.

. తమిళంలో ఎం.కుమరన్ సన్ ఆఫ్ మహాలక్ష్మి, పోకిరి, శరవణ, ఆయుధం, ఆది, బాహుబలి 2, అసురగురు వంటి చిత్రాల్లో నటించాడు సుబ్బరాజు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో అనేక చిత్రాల్లో నటించారు.


నటుడు సుబ్బరాజు పెళ్లి

47 ఏళ్ల సుబ్బరాజు తన బ్రహ్మచారి జీవితానికి ముగింపు పలికి, వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. తన భార్యతో కలిసి దిగిన ఫోటోతో సోషల్ మీడియాలో ఈ విషయాన్ని వెల్లడించారు. "చివరికి నేను గెలిచాను" అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

నటుడు సుబ్బరాజు పెళ్లి

2003లో విడుదలైన ఖడ్గం సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు. తక్కువ కాలంలోనే మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. బాహుబలి 2 ఆయనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.

Latest Videos

click me!