ఈ విషయాన్ని నాగచైతన్య బావ, టాలీవుడ్ స్టార్ హీరో రానా ఓ ప్రోగ్రామ్ లో అడిగాడు. రానా హోస్ట్ చేస్తున్న ఆ ప్రోగ్రామ్ కు చైతూ గెస్ట్ గా వచ్చాడు. వీరిద్దరు బంధువులే కాదు మంచి స్నేహితులు కూడా. సో నాగచైతన్యను ఎలాగైనా ఇరికించాలని చాలా ప్రయత్నాలు చేసిన రానా.. నీ ఫస్ట్ కిస్ ఎవరితో అని ప్రశ్నించాడు.
ఏమాత్రం భయపడకుండా, ఆలోచించకుండా నాగచైతన్య నిజం చెప్పేశాడు. నా ఫస్ట్ కిస్ నా క్లాస్ మెంట్ తో జరిగింది. అది కూడా 9th క్లాస్‌లో తొలి ముద్దు పెట్టాను అన్నాడు. ఆ షోలో చైతూ పక్కనే ఉన్న ఆయన కజిన్ సుమంత్ ఈ విషయం విని, షాక్ అయ్యాడు.
ఇక వెంటనే రానా అందుకుని, చూడడానికి ఇంత అమాయకంగా ఉన్నావ్ కదరా అన్నారు. దాంతో చైతూ.. రిప్లయ్ ఇస్తూ.. అమాయకంగా ఉండడమే నాకు ప్లస్ అయ్యిందిరా అని అన్నారు.