అక్కినేని నాగ చైతన్య త్వరలో రెండో వివాహానికి సిద్ధం అవుతున్నారు. ఆల్రెడీ పెళ్లి కార్యక్రమాలు కూడా మొదలయ్యాయి. పసుపు దంచే కార్యక్రమం కూడా జరిగింది. శోభిత ధూళిపాల, నాగ చైతన్య ఇద్దరూ పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకోబోతున్నారు. నాగ చైతన్య వ్యక్తిగత జీవితం ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. సమంతతో లవ్ ఎఫైర్ మొదలుకుని పెళ్లి, విడాకుల ఇలా చైతన్య వార్తల్లో ఉంటూనే ఉన్నారు.
టీనేజ్ లోనే చైతు ప్రేమలో పడ్డాడట. స్కూల్ లో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడట. అమ్మాయి స్కూల్ మారిపోతున్నప్పుడు నాగ చైతన్య భరించలేకపోయాడట. నా హార్ట్ బ్రేక్ అయింది. నన్ను వదిలి ఎలా వెళతావు అని ఆ అమ్మాయిని అడిగా. కాలేజ్ డేస్ లో కూడా అదే విధంగా జరిగింది.
Nagarjuna Akkineni
కానీ అలాంటి సంఘటనలు జీవితంలో చాలా నేర్పిస్తాయి అని నాగ చైతన్య తెలిపారు. రిలేషన్ షిప్స్ విషయంలో మీరు ఎమోషనల్ గా ఉంటారా అని యాంకర్ ప్రశ్నించింది. నాగ చైతన్య నేను చాలా ఎమోషనల్. నేను ప్రేమించిన వ్యక్తితో ఉండే అటాచ్మెంట్ మాటల్లో చెప్పలేం. వాళ్ళు దూరమైతే ఆ బాధని భరించలేం అంటూ నాగ చైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Naga Chaitanya
టీనేజ్ లో లవ్ బ్రేకప్ అయినప్పుడు చాలా రోజులు ఏడ్చాను. ప్రపంచం అంతం అయిన ఫీలింగ్ కలిగింది. నా జీవితంలో ఇంకేమి మిగల్లేదు అనే ఫీలింగ్ వచ్చినట్లు అనిపించింది. వాటన్నింటిని ఇప్పుడు తలుచుకుంటే నేను ఎంత స్టుపిడ్ గా ఎఫైర్స్ పెట్టుకున్నానా అని అనిపిస్తుందని నాగ చైతన్య తెలిపారు.