ప్రభాస్, అనుష్క శెట్టి సూపర్ హిట్ పెయిర్ అనే సంగతి తెలిసిందే. వీళ్లిద్దరి మధ్య కెమిస్ట్రీని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు. బిల్లా, మిర్చి, బాహుబలి సిరీస్ లో వీళ్ళ జంట అదిరిపోయింది. బాహుబలి తర్వాత అనుష్క స్పీడ్ తగ్గించింది కానీ అప్పుడప్పుడూ సినిమాలు చేస్తూనే ఉంది. ఇక ప్రభాస్ గురించి చెప్పనవసరం లేదు.. పాన్ ఇండియా స్టార్ గా భారీ చిత్రాలతో దూసుకుపోతున్నాడు.