ముందుగానే OTTలోకి ఎన్టీఆర్ ‘దేవర’? కొత్త తేదీ

First Published | Oct 24, 2024, 11:34 AM IST

ఎన్టీఆర్ నటించిన 'దేవర' చిత్రం ఆంధ్రప్రదేశ్‌లో 100 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి, సంచలనం సృష్టించింది. ఈ దీపావళికి ఓటీటీలో విడుదల కానున్నట్లు సమాచారం.

#Devara, #NTR, #JahnaviKapoor, Koratala siva,


ఎన్టీఆర్‌-కొరటాల కాంబోలో వచ్చిన ‘జనతా గ్యారేజ్‌’వంటి సూపర్ హిట్ తర్వాత   వీరిద్దరూ కలిసి చేసిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘దేవర’ (Devara Movie). సినిమా రిలీజ్ రోజునే కొంచెం డివైడ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల్లో టాక్ కు సంభందం లేకుండా భారీ వసూళ్లు నమోదు చేసింది. అంతేకాదు తాజాగా దేవర మరో సంచలన రికార్డుని సెట్ చేసినట్టుగా తెలుస్తుంది. దేవర ఒక్క ఆంధ్ర రాష్ట్రం నుంచే 100 కోట్లకి పైగా షేర్ ని (జి ఎస్ టి కలిపి) రాబట్టినట్టుగా తెలుస్తుంది. 

#Devara, #NTR, #JahnaviKapoor, Koratala siva,


బాక్సాఫీస్ దగ్గర 25 రోజుల రన్ ని పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇప్పటికీ సాలిడ్ రన్ ని కంటిన్యూ చేస్తూ వస్తుంది. ఒక్క ఏపీ నుంచే 100 కోట్ల షేర్ ని రాబట్టిన మూడో సినిమాగా దేవర నిలిచింది. ఇంతకు ముందు RRR, బాహుబలి 2 లు నిలవగా ఒక్క ఏపీ నుంచి రెండు 100 కోట్ల షేర్ సినిమాలు ఉన్న హీరోగా తారక్ భారీ రికార్డు సెట్ చేసాడు.

ఆల్ మోస్ట్ నాలుగు వారాలను పూర్తి చేసుకోబోతున్న దేవర మూవీ రీసెంట్ టైంలో టాప్ స్టార్స్ నటించిన సినిమాల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ లాంగ్ రన్ ను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది. ఈ క్రమంలో అభిమానులు ఓటిటి రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు.


#Devara, #NTR, #JahnaviKapoor, Koratala siva,


దేవర సినిమా రిలీజ్ టైంలో బాలీవుడ్ మూవీస్ కి ఉండే…ఓటిటి విండో టైప్ లో 8 వారాల గ్యాప్ ను కన్ఫాం చేసుకుని ఎగ్రిమెంట్ చేసుకున్నారు. అయితే …సౌత్ భాషల ఓటిటి వర్షన్ ను ముందు నవంబర్ 8న రిలీజ్ చేసే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. కాగా ఇప్పుడు లేటెస్ట్ గా సినిమా ఓటిటి పై ఇండస్ట్రీలో కొత్త న్యూస్ ఒకటి బయిటకు వచ్చింది. 


అందుతున్న సమాచారం  ప్రకారం సినిమా ఓటిటి సౌత్ వర్షన్ లు ఈ దీపావళి కానుకగా వచ్చే వారం రిలీజ్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. అంటే అనుకున్న తేదీ కన్నా వారం ముందే ఇక్కడ పండగ చేయనుంది. దీపావళి ని దేవరతో సెలబ్రేట్ చేసుకునేలా నెట్ ఫ్లిక్స్ సంస్ద  ప్లాన్ చేస్తోంది అని సమాచారం. 

#Devara, #NTR, #JahnaviKapoor, Koratala siva,

 
 ఆరేళ్ల తర్వాత ఎన్టీఆర్‌ (NTR) సోలో హీరోగా చేస్తుండటం, జాన్వీ (Janhvi Kapoor) ఈ మూవీతోనే తెలుగు తెరకు పరిచయమవుతుండటంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.  అందుకు తగినట్లుగానే ఓ రేంజిలో ఓపినింగ్స్ వచ్చాయి.  డివైడ్ టాక్ వచ్చినా దసరా శెలవులను ఈ సినిమా క్యాష్ చేసుకుంది. తెలుగు రెండు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ‘దేవర’(Devara) గురించి, ఎన్టీఆర్‌ ద్విపాత్రాభినయం మాట్లాడుతున్నారు.   భాక్సాఫీస్ దగ్గర రికార్డ్ లు బ్రద్దలు కొడుతున్న ఈ సినిమా ఓటిటి రిలీజ్ కు సైతం రెడీ అయ్యింది.
 

ntr, devara2, koratala shiva


 ఎన్టీఆర్‌ సరసన జాన్వీ నటించిన ఈ సినిమా సీక్వెల్‌ వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు. మొదటిభాగం కంటే రెండోభాగం చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని దర్శకుడు ఇటీవల చెప్పారు. పార్ట్‌-1లో చూసింది 10 శాతమేనని.. రెండో భాగంలో 100శాతం చూస్తారన్నారు. ఓటిటిలో కూడా ఈ సినిమా భారీ రికార్డ్ లు క్రియేట్ చేస్తుందని భావిస్తున్నారు. 

ntr, devara2, koratala shiva


దేవర చిత్రంలో ఎన్టీఆర్ తో పాటు ప్రకాష్‌రాజ్‌, శ్రీకాంత్‌, షైన్‌ టామ్‌ చాకో, నరేన్‌ కీలక పాత్రల్లో నటించారు.  దేవర చిత్రాన్ని నందమూరి కల్యాణ్‌ రామ్‌ సమర్పిస్తున్నారు. ఎన్టీఆర్‌ ఆర్ట్స్,  యువ సుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించాయి. మిక్కిలినేని సుధాకర్‌, హరికృష్ణ.కె. ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. అనిరుద్‌ రవిచంద్రన్‌ సంగీతాన్ని అందించారు. శ్రీకర్‌ ప్రసాద్‌ ఎడిటింగ్‌ చేసారు. ఆర్‌. రత్నవేల్‌ తన కెమెరా పనితనంతో మిరాకిల్స్ సృష్టించారు. ఈ చిత్రానికి ప్రొడక్షన్‌ డిజైనర్‌గా సాబు సిరిల్‌ వ్యవహరించారు.
  

Latest Videos

click me!