Naa Anveshana: యూట్యూబర్ అన్వేష్ కు దిమ్మతిరిగే షాక్.. ఇన్‌స్టాగ్రామ్ ఏం చేసిందంటే?

Published : Feb 20, 2026, 10:09 AM IST

హిందూ దేవుళ్లపై అసభ్యకర వీడియోలు, అమ్మాయిల గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం.. నా అన్వేష్ మాట్లాడిన లాగ్వేజ్ పై తీవ్ర విమర్శలు వచ్చిన నేపథ్యంలో.. ఇన్‌స్టాగ్రామ్ ఆ యూట్యూబర్ కు పెద్ద షాక్ ఇచ్చింది.

PREV
15
యూట్యూబర్ అన్వేష్ కు బిగ్ షాక్..

సోషల్ మీడియా సంచలనం.. ప్రముఖ యూట్యూబర్.. నా అన్వేషన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా తాజాగా బ్యాన్ అయింది. ఈ ఖాతాకు సుమారు 1.3 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. గతంలో భారతదేశాన్ని దూషించిన ఆరోపణలపై హైదరాబాద్ సీసీఎస్ పోలీస్ స్టేషన్‌లో అన్వేష్‌పై కేసు నమోదైంది.ఈ నేపథ్యంలో అతడి ఇన్‌స్టాగ్రామ్ ఖాతా వివరాలు అందించాలని సీసీఎస్ పోలీసులు ఇన్‌స్టాగ్రామ్ యాజమాన్యానికి లేఖ రాశారు. పోలీసుల అభ్యర్థనకు స్పందించిన ఇన్‌స్టాగ్రామ్ మేనేజ్‌మెంట్ అవసరమైన వివరాలను అందించినట్లు తెలుస్తోంది.

25
నా అన్వేషన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా బ్యాన్

అన్వేష్ మతవిద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నాడన్న ఆరోపణలతో... అతని సోషల్ మీడియా పేజ్ ను తొలగించాలని సీసీఎస్ పోలీసులు ఇన్‌స్టాగ్రామ్ మరో లేఖ రాశారు. ఈ క్రమంలో పోలీసుల లేఖ అందుకున్న వెంటనే ఇన్‌స్టాగ్రామ్ యాజమాన్యం అన్వేష్ ఖాతాను పరిశీలించింది. 

అనంతరం ఖాతాను పూర్తిగా బ్యాన్ చేసినట్లు తెలిసింది. గతంలో అన్వేష్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాకు 1.8 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉండేవారు. అయితే హిందూమతం, భారతదేశంపై అతను రెచ్చిపోయి.. అనుచిత వ్యాఖ్యలు చేశాడనే ఆరోపణల తరువాత అతడి ఫాలోవర్ల సంఖ్య 1.3 మిలియన్లకు పడిపోయింది. ఇక ఇప్పుడు అన్వేష్ ఖాతా పూర్తిగా సస్పెండ్ చేయబడింది.

35
తెలుగు రాష్ట్రాల్లో సోషల్ మీడియా సంచలనం..

తెలుగులో ఎక్కువ మంది ఫాలో అవుతున్న ట్రావెల్ వ్లాగర్లలో అన్వేష్ ముందున్నాడు. యూట్యూబ్ ట్రావెలర్స్ కు అతను రోల్ మోడల్, సెలబ్రిటీ కూడా. అన్వేష్ కు సినిమా స్టార్స్ కు ఉన్నంత ఇమేజ్, పాలోయింగ్ ఉంది. ఈక్రమంలో అతను అప్పుడుప్పుడు చేసే కామెంట్స్ పై కూడా విమర్శలు వస్తుంటాయి. ముఖ్యంగా అతను వాడే భాషపై అభ్యంతరాలు వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఈమధ్య కాలంలో అన్వేష్ మహిళల వస్త్రధారణపై చెలరేగిన వివాదంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఓ వీడియో రూపొందించాడు.

45
అనుచిత భాష వాడినందుకు

ఆ వీడియోలో తన వాదన వినిపించే క్రమంలో అనుచిత భాష వాడినట్లు ఆరోపణలు వచ్చాయి. అలాగే హీరో శివాజీ కామెంట్స్ పై అన్వేష్ స్పందించడం... అది కాస్త రచ్చ రచ్చ అవ్వడం.. అందులో హిందూ దేవతల పేర్లు ప్రస్తావించడం కూడా వివాదాస్పదమైంది. అంతే కాదు పురాణ గాథల్లో లేని ఘటనలు జరిగినట్లుగా అర్థం వచ్చేలా సీత, ద్రౌపది గురించి వ్యాఖ్యానించినట్లు విమర్శలు వచ్చాయి. రామాయణంలో సీతపై అన్వేష్ చేసిన కామెంట్స్ భారీ వివాదానికి దారి తీశాయి.

55
గరికపాటిపై అన్వేష్ కామెంట్స్..

అంతే కాదు అన్వేష్ మాట్లాడే క్రమంలో.. ప్రవచనకారుల గురించి జుగుప్సాకరంగా వ్యాఖ్యలు చేసినట్టు ఆరోపణలు రావడం కూడా పెద్ద వివాదం అయ్యింది. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో అతడిపై కేసులు నమోదయ్యాయి.అన్వేష్ చేసిన కామెంట్స్ లో హిందూ దేవతలను, సమాజంలో గౌరవనీయ స్థానంలో ఉన్న గరికపాటి నరసింహా రావును అవమానించే విధంగా ఉండటంతో.. వ్యవహారం మరింత ఉద్రిక్తతకు దారితీసింది.

 సాధారణంగా ఇలాంటి వివాదాలపై ఎప్పుడూ.. స్పందించని గరికపాటి నరసింహా రావు కూడా అతనికి కౌంటర్ ఇచ్చారు. ఆతరువాత కూడా ఆగకుండా గరికపాటిపై మరోసారి రెచ్చిపోయి మాట్లాడాడు అన్వేష్. మరోవైపు చాగంటిపై కూడా అతను చేసిన కామెంట్స్ పై వ్యతిరేకత వచ్చింది. 

Read more Photos on
click me!

Recommended Stories