యూట్యూబర్ ప్రపంచ యాత్రికుడు నా అన్వేష్ ఇటీవల హరిహర వీరమల్లు రివ్యూ ఇచ్చారు. తాను సినిమా చూడ కుండా ఇచ్చిన రివ్యూకి ఎన్నిలక్షల వ్యూస్ వచ్చాయి, ఎంత ఆదాయం వచ్చింది అనే వివరాలు రివీల్ చేశాడు.
ప్రపంచ యాత్రికుడు, నా అన్వేషణ అన్వేష్ గురించి పరిచయం అవసరం లేదు. ఇండియాలో అత్యంత ప్రభావవంతమైన యూట్యూబర్లలో ఒకడు నా అన్వేష్. ప్రపంచ దేశాలలో పర్యటిస్తూ అద్భుతమైన ప్రాంతాలని తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రేక్షకులకు చూపిస్తుంటారు. అప్పుడప్పుడూ తెలుగులో రాష్ట్రాల్లో, ఇండియాలో జరుగుతున్న వివాదాలు, రాజకీయ అంశాల గురించి కూడా నా అన్వేష్ మాట్లాడుతుంటారు.
DID YOU KNOW ?
హరిహర వీరమల్లు కలెక్షన్స్
హరిహర వీరమల్లు చిత్రం 6 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 67 కోట్ల షేర్ రాబట్టింది. గ్రాస్ కలెక్షన్స్ 109 కోట్ల వరకు చేరాయి.
25
నా అన్వేష్ హరిహర వీరమల్లు రివ్యూ
ఇటీవల ప్రపంచ యాత్రికుడు అన్వేష్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు మూవీ రివ్యూ పేరుతో ఓ వీడియో చేశారు. సినిమా చూడకుండానే హరిహర వీరమల్లు రివ్యూ ఇచ్చారు. కానీ వాస్తవానికి అది హరిహర వీరమల్లు రివ్యూ కాదు.
రివ్యూల పేరుతో సినిమాని కిల్ చేసే వారికి వ్యతిరేకంగా, సెటైరికల్ గా నా అన్వేష్ చేసిన వీడియో అది. నిర్మాతలు కొన్ని కోట్లు ఖర్చుపెట్టి, దర్శకులు, టెక్నీషియన్లు, నటీనటులు కొన్ని నెలలు, సంవత్సరాలు కష్టపడి తీసిన సినిమాకి రివ్యూలు ఎలా ఇస్తారు అని నా అన్వేష్ విరుచుకుపడ్డాడు.
35
రివ్యూయర్లపై నా అన్వేష్ విమర్శలు
సినిమా అనేది ప్రేక్షకులు తమ వెంట తీసుకుని వెళ్లే మొబైల్ ఫోన్ లాంటి వస్తువు కాదు.. ఏది బావుందో ఏది బాగాలేదో రివ్యూ చెప్పడానికి. సినిమాని ప్రేక్షకులు కేవలం 2.30 గంటలు చూసి వెళ్ళిపోతారు.
అలాంటప్పుడు ప్రేక్షకులకు రివ్యూ చెప్పాల్సిన అవసరం లేదు అని నా అన్వేష్ పేర్కొన్నారు. నా అన్వేష్ చేసిన ఈ వీడియోలో ఊహించని రెస్పాన్స్ వచ్చింది. దాదాపు 13 లక్షల మంది ఈ వీడియో చూశారని నా అన్వేష్ పేర్కొన్నారు.
హరిహర వీరమల్లు రివ్యూకి నా అన్వేష్ కి ఎన్ని లక్షల ఆదాయం వచ్చిందంటే
'నేను హరిహర వీరమల్లు రివ్యూ పేరుతో చేసిన ఫస్ట్ వీడియోకి మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ వచ్చింది. ఆ వీడియోకి నాకు ఎంత డబ్బు వచ్చిందో తెలిస్తే షాక్ అవుతారు. సినిమా చూడకుండా రివ్యూ చెబితేనే దాదాపు 13 లక్షల మంది వీడియో చూశారు.
ఎన్నారైలు ఈ వీడియో ఎక్కువగా చూశారు. దీనితో ఈ వీడియోకి నాకు రూ .1.6 లక్షల ఆదాయం వచ్చింది. సినిమా చూడకుండా చెబితేనే ఇంత వచ్చింది.. చూసి చెప్పి ఉంటే ఇంకెంత వచ్చేదో. ఇదేదో భలే ఉంది' అంటూ నా అన్వేష్ కామెంట్స్ చేశారు.
55
నష్టాల నుంచి బయటకి
అన్వేష్ ఇంకా మాట్లాడుతూ..' ఇటీవల నేను సోమాలియా, సౌత్ సూడాన్ దేశాల వీడియోలు చేశాను. ఆ వీడియోల ద్వారా నాకు దాదాపు 2 లక్షలు నష్టం వచ్చింది. దేవుడు హరిహర వీరమల్లు రివ్యూ రూపంలో కరుణించాడు. నష్టాలు కవర్ అయ్యాయి' అని నా అన్వేష్ పేర్కొన్నాడు.