ఘాటి సినిమాను క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. ఉత్తరాంధ్రలో గంజాయి సాగు నేపథ్యంగా రూపొందిన ఈ పాన్ ఇండియా సినిమా, అనుష్క కెరీర్‌లో ఇంత వరకూ చేయని డిఫరెంట్ మూవీగా నిలవబోతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్, పోస్టర్లలో అనుష్క లుక్ కు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.
అయితే సినిమా విడుదల వాయిదా పడటమే కాదు, అనుష్క తదుపరి ప్రాజెక్ట్ గురించి ఎలాంటి అధికారిక సమాచారం లేకపోవడంతో అభిమానులు నిరాశకు గురవుతున్నారు. గతంలో అరుంధతి, బాహుబలి లాంటి సినిమాల్లో పవర్ ఫుల్ పాత్రల్లో కనిపించిన ఈ స్టార్ హీరోయిన్ చేసిన సినిమాలు ఆతరువాత పెద్దగా గుర్తింపు పొందలేదు.