ఆడిషన్ కు పాస్ పోర్ట్ సైజ్ ఫోటో తీసుకెళ్లిన శోభా శెట్టి.
శోభా శెట్టి మాట్లాడుతూ, నేను నటిగా మారకపోతే ఫ్యాషన్ డిజైనర్‌గా మారిపోయేదాన్ని. కాలేజీ రోజుల్లో జరిగిన ఓ ఈవెంట్ చాలా చురుకుగా పాల్గొనేదాన్ని. ఈ సందర్భంగా ఒక దర్శకుడు నన్ను గమనించి, సీరియల్స్‌లో ప్రయత్నించమని సూచించాడు. ఆ సమయంలో డైరెక్టర్ మేనేజర్ నా నంబర్ తీసుకొని, కొన్ని రోజుల తరువాత ఆడిషన్‌కు పిలిచాడు. ఫోటోస్ కూడా తీసుకుని రమ్మన్నారు.
మొదటిసారి ఆడిషన్ కు వెళ్తున్నాను కదా.. పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు తీసుకుని వెళ్లాను. దాంతో వాటిని చూసి అక్కడ ఉన్నవారంతా నవ్వుకున్నారు. నేను ఈ రంగంలో కొత్త, ఏం తీసుకురావాలో తెలియక అలా చేశాను అని చెప్పగానే, వాళ్లే స్వయంగా నా ఫోటోషూట్ చేసి, కన్నడ సీరియల్‌లో ఏకంగా హీరోయిన్ రోల్ ఇచ్చారు. అంతే కాదు ఫస్ట్ సీరియల్ కు నేను అందుకున్న రెమ్యునరేషన్ రోజుకు రూ.750 మాత్రమే అని ఆమె అన్నారు.