ఇండిపెండెన్స్ డే రోజు తప్పక చూడాల్సిన దేశభక్తి తెలుగు సినిమాలు

Published : Aug 15, 2025, 07:51 AM IST

వెండితెరపై ఎన్నో దేశ భక్తి సినిమాలు తెరకెక్కాయి. ప్రేక్షకుల మదిలో దేశంపై ప్రేమను, భక్తిని గుర్తు చేస్తూ.. ప్రతీ భారతీయుడిని తట్టిలేపుతున్నాయి. ఇండిపెండెన్స్ డే రోజు చూడదగ్గ దేశభక్తి తెలుగు సినిమాలు ఏవంటే? 

PREV
110

దేశ భక్తి సినిమాలు 

భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశభక్తిని ప్రదర్శించే సినిమాలను చూసే ప్రాధాన్యం పెరిగింది. తెలుగు సినీ పరిశ్రమ నుంచి వచ్చిన కొన్ని సినిమాలు పౌరసత్వ విలువలను, త్యాగాన్ని, జాతీయ గౌరవాన్ని ప్రతిబింబిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇండిపెండెన్స్ డే సందర్భంగా తప్పక చూడాల్సిన దేశభక్తి తెలుగు సినిమాలు చాలా ఉన్నాయి. అందులో కొన్ని ఈరోజు చూద్దాం. అయితే తెలుగు సినిమాలు కాకపోయినా.. తెలుగు జాతిలో దేశ భక్తిని రేకెత్తించిన సినిమాలు కూడా కొన్ని ఉన్నాయి. అందులో అమరన్ లాంటి డబ్బింగ్ సినిమాలకు అగ్రస్థానం ఉంటుంది. మేజర్ ముకుందు వరదరాజన్ త్యాగాన్ని కళ్లకు కట్టినట్టు చూపించిన ఈసినిమా, ప్రతీ దేశ భక్తుడికి కన్నీరు తెప్పించింది. శివకార్తీకేయన్, సాయి పల్లవి నటనకు ఎన్ని అవార్డులు ఇచ్చినా తక్కవే అవుతుంది. అంత అద్భుతంగావచ్చిందీ ఈసినిమా. అంతే కాదు ఈమూవీకి జీవి ప్రకాశ్ మ్యూజిక్ పెద్ద బలం.

DID YOU KNOW ?
మొదటి సినిమా
దేశ భక్తి కాన్సెప్ట్ తో వచ్చి ఆస్కార్ సాధించిన తొలి తెలుగు సినిమాగా ఆర్ఆర్ఆర్ రికార్డు సాధించింది.
210

ఆర్ఆర్ఆర్

రామ్ చరణ్ , ఎన్టీఆర్ కలిసి నటించిన ఈ భారీ మల్టీస్టారర్ సినిమా బ్రిటీష్ వారిపై పోరాడిన దేశ భక్తుల చరిత్రను గుర్తు చేస్తుంది. రాజమౌళి అద్భుతమైన మేకింగ్, కీరవాణి సంగీతం, ఈసినిమాను విజయం వైపు నడిపించింది. ప్రపంచ స్థాయిలో ఈసినిమా అద్భుతమైన ప్రశంసలు అందుకోవడంతో పాటు ఆస్కార్ కూడా సాధించింది.

310

అల్లూరి సీతారామరాజు (1974)

స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా , సూపర్ స్టార్ కృష్ణ 100వ చిత్రం. బ్రిటిష్ పాలనపై తిరుగుబాటు చేస్తూ, దేశభక్తి భావాలను ప్రజల్లో ఎలా పెరిగేలా చేశారు అనేది అద్భుతంగా చూపించారు. ఈసినిమా అప్పట్లో సంచలనంగా మారింది. గొప్ప విజయాన్నిసొంతం చేసుకుంది.

410

మేజర్ చంద్రకాంత్ (1993)

కె రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్ర దేశం కోసం చేసిన త్యాగాన్ని చాటుతుంది. ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం, మోహన్ బాబు నిర్మాణం సినిమాకు బలంగా నిలిచాయి. ఆ ఏజ్ లో కూడా ఎన్టీఆర్ ఈసినిమాలో రకరకాల పాత్రల్లో కనిపించి మెప్పించారు. రిటైర్డ్ మేజర్ గా పెద్దాయన నటన అద్భుతంగా ఉంటుంది ఈసినిమాలో. ఇక ఎన్టీఆర్ నటించిన మరో దేశ భక్తి సినిమా బొబ్బిలి పులి. దాసరి నారాయణరావు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం యుద్ధ వీరుడి జీవితాన్ని చూపిస్తూ దేశభక్తిని ప్రేరేపించింది. ఎన్టీఆర్, శ్రీదేవి ఈసినిమాలో హీరో హీరోయిన్లు గా నటించారు.

510

ఖడ్గం (2002)

కృష్ణ వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఖడ్గం, ఉగ్రవాదం, దేశ భద్రత అంశాలపై విమర్శాత్మకంగా స్పందించిన చిత్రం. ప్రకాష్ రాజ్, రవితేజ నటన ఈసినిమాకే హైలైట్‌గా నిలిచాయి. శ్రీకాంత్ పాత్ర కూడా అద్భుతంగా ఉంటుంది. అప్పట్లో వివాదం అయిన ఈమూవీ.. భారీ రెస్పాన్స్ ను సాధించింది.

610

ఠాగూర్ (2003)

వివి వినాయక్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం అవినీతి వ్యతిరేకంగా పోరాడే కథ. చిరంజీవి ప్రధాన పాత్రలో నటించారు. తమిళ చిత్రం "రమణ" ఆధారంగా రూపొందిన ఈ చిత్రం లంచం తీసుకునేవారిని నిలదీస్తూ, శిక్షిస్తూ.. దేశం గురించి బాధ్యతను గుర్తుచేస్తుంది.

710

మహాత్మ (2009)

శ్రీకాంత్ హీరోగా, కృష్ణ వంశీ దర్శకత్వంలో రూపొందిన సినిమా మహాత్మ. ఈ చిత్రం గాంధీ సిద్ధాంతాలను ఫాలో అవుతూ మారిన ఒక వీధి రౌడీ కథ ఆధారంగా తెరకెక్కింది. ప్రతీక్షణం దేశ భక్తిని చాటిచెప్పె సినిమా ఇది.

810

ఘాజీ (2017)

1971లో జరిగిన భారత-పాక్ నౌక యుద్ధం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా, భారత నౌకాదళ వీరతను చాటుతుంది. రానా దగ్గుబాటి, తాప్సీ పన్ను ప్రధాన పాత్రలు పోషించారు. సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహించారు.

910

మేజర్ (2022)

26/11 ముంబయి దాడుల్లో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితాన్ని ఆధారంగా తీసుకొని రూపొందిన ఈ చిత్రం, అడవి శేష్ నటనతో బలంగా నిలిచింది. శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించాగా సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మించారు.

1010

సీతా రామం (2022)

ఒక ప్రేమ కథతో పాటు దేశభక్తిని మిళితం చేసిన ఈ చిత్రం హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందింది. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించారు.

Read more Photos on
click me!

Recommended Stories