OG vs Pushpa2: `పుష్ప 2` రికార్డులకు పాతరేస్తున్న `ఓజీ`.. పవన్‌ కళ్యాణ్‌ ఆరాచకం

Published : Sep 24, 2025, 10:55 AM IST

పవన్‌ కళ్యాణ్‌ `ఓజీ` మూవీ అడ్వాన్స్ సేల్స్ పరంగా తెలుగు రాష్ట్రాల్లో దుమ్మురేపుతుంది. ఈ మూవీ అల్లు అర్జున్‌ `పుష్ప 2` రికార్డులను బ్రేక్‌ చేస్తుండటం విశేషం. 

PREV
15
`ఓజీ`వర్సెస్‌ `పుష్ప 2`

ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో `ఓజీ` మానియా నడుస్తోంది. సినిమా రిలీజ్‌కి ఒక్క రోజే ఉంది. దీంతో పవన్‌ కళ్యాణ్‌ అభిమానులే కాదు, సాధారణ ఆడియెన్స్ కూడా ఈ మూవీ కోసం ఎదురుచూస్తున్నారు. సినిమాకి సంబంధించిన గ్లింప్స్ లు, ట్రైలర్‌ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. దీంతో అడ్వాన్స్ బుకింగ్స్ లో దుమ్ములేపుతుందీ మూవీ. బెనిఫిట్‌ షోస్‌ టికెట్స్ ఓపెన్‌ చేసిన కొన్నిగంటల్లోనే అమ్ముడు పోయాయి. ఇక అడ్వాన్స్ బుకింగ్స్ లోనూ తన పవర్‌ని చూపిస్తున్నారు పవన్‌. ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ లో `పుష్ప 2` రికార్డులను బ్రేక్‌ చేస్తుండటం విశేషం.

25
అడ్వాన్స్ బుకింగ్స్ లో `పుష్ప 2` రికార్డులు బ్రేక్‌ చేస్తున్న ఓజీ

`పుష్ప 2` పాన్‌ ఇండియా మూవీగా విడుదలైంది. మొదటి భాగం పెద్ద హిట్‌ కావడంతో రెండో భాగంపై భారీ అంచనాలున్నాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీకి విశేషమైన క్రేజ్‌ నెలకొంది. అది అడ్వాన్స్ బుకింగ్స్ లో కనిపించింది. అయితే `పుష్ప 2` రేంజ్‌లో `ఓజీ`ని వరల్డ్ వైడ్‌గా కంపేర్ చేయలేం. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కంపారిజన్‌ వస్తోంది. ఈ క్రమంలో ఇప్పుడు తెలుగు స్టేట్స్ లో చాలా చోట్ల `పుష్ప 2` రికార్డులను `ఓజీ` మూవీ బ్రేక్‌ చేస్తుండటం విశేషం.

35
నైజాంలో `ఓజీ` హవా

నైజాంలో పవన్‌ కళ్యాణ్‌కి భారీ క్రేజ్‌ ఉంది. ఇక్కడ ఆయన సినిమాలు భారీగా వసూళ్లు చేస్తుంటాయి. `ఓజీ` కూడా తన సత్తాని చాటింది. ఇక్కడ `పుష్ప 2` రికార్డులను బ్రేక్‌ చేసింది. ఒక్క రోజు ముందు `ఓజీ` మూవీ రూ.14 కోట్లు రాబట్టగా, `పుష్ప 2` రూ.11 కోట్లు వసూలు చేసింది. దీంతో `పుష్ప 2` రికార్డు బ్రేక్‌ అయిపోయింది. మరోవైపు ఆంధ్రాలో ప్రీమియర్స్ కి సంబంధించి `పుష్ప 2` రూ.4.36కోట్లు వసూలు చేయగా, `ఓజీ` మూవీ ఐదు కోట్లు దాటేసింది. కర్నూల్‌లోనూ ప్రీమియర్స్ కి సంబంధించి `పుష్ప2` ని దాటేసింది ఓజీ. గుంటూరులో అడ్వాన్స్ సేల్స్ లో పుష్ప 2.. 188 షోస్‌కి రూ.1.42కోట్లు వసూలు చేస్తే, `ఓజీ` 160 షోస్‌కి 1.4కోట్లు సాధించింది.

45
ఓవర్సీస్‌లో దుమ్మురేపుతున్న `ఓజీ`

ఇలా చాలా ఏరియాల్లో `పుష్ప 2` రికార్డులను బ్రేక్‌ చేస్తోంది `ఓజీ` మూవీ. తెలుగు రాష్ట్రాల్లోనే ఈ రేంజ్‌లో సత్తా చాటుతుంది. కానీ ఇతర స్టేట్స్ లో మాత్రం `పుష్ప 2`ని దాటడం కష్టమే అని చెప్పొచ్చు. అయితే ఈ చిత్రం నార్త్ అమెరికాలో మాత్రం దుమ్మురేపుతుంది. అక్కడ అడ్వాన్స్ సేల్స్ ఇప్పటికే మూడు మిలియన్స్ దాటింది. అంటే ఓపెనింగే అక్కడ రూ.27కోట్లు రాబట్టే అవకాశం కనిపిస్తుంది. ఇది ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తుంది.

55
`ఓజీ` గ్రాండ్‌ రిలీజ్‌కి ప్లాన్‌

పవన్‌ కళ్యాణ్‌ హీరోగా సుజీత్‌ దర్శకత్వంలో రూపొందిన `ఓజీ` మూవీలో ప్రియాంక మోహన్‌ హీరోయిన్‌గా నటించింది. ఇమ్రాన్‌ హష్మీ విలన్‌గా చేశారు. శ్రియా రెడ్డి, అర్జున్‌ దాస్‌, ప్రకాష్‌ రాజ్‌, రాహుల్‌ రవీంద్రన్‌ వంటి వారు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం నేటి రాత్రి నుంచి బెనిఫిట్‌ షోస్‌ ప్రదర్శిస్తున్నారు. రేపు గురువారం(సెప్టెంబర్‌ 25న) గ్రాండ్‌గా రిలీజ్‌ అవుతుంది. ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్టైన్‌మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మించారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories