Krishna Mukunda Murari: భవానికి పెద్ద షాకిచ్చిన ముకుంద.. ఈశ్వర్ కి తలతిరిగే పనిష్మెంట్ ఇచ్చిన రేవతి?

Published : Apr 27, 2023, 02:22 PM IST

Krishna Mukunda Murari: స్టార్ మా లో ప్రసారమవుతున్న కృష్ణ ముకుంద మురారి సీరియల్ మంచి రేటింగ్ ని సంపాదించుకుంటూ టాప్ సీరియల్స్ సరసన స్థానం సంపాదించుకుంటుంది. భర్త పరిస్థితికి తనే కారణమని బాధపడుతున్న ఒక భార్య కథ ఈ సీరియల్. ఇక ఈరోజు ఏప్రిల్ 27 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.  

PREV
18
Krishna Mukunda Murari: భవానికి పెద్ద షాకిచ్చిన ముకుంద.. ఈశ్వర్ కి తలతిరిగే పనిష్మెంట్ ఇచ్చిన రేవతి?

ఎపిసోడ్ ప్రారంభంలో పెద్దమ్మ నీవల్లే నేను మాట తప్పానని  అపార్థం చేసుకుంటుంది. తనకి చెప్పకుండా నేను నిన్ను పెళ్లి చేసుకొని వచ్చినప్పుడు కూడా నాలుగు రోజులు బాధపడింది తప్పితే ఇలాద్వేషించలేదు. మా పెద్దమ్మ నన్ను ఎప్పుడూ ఇంతలా దూరం పెట్టలేదు అంటూ బాధపడతాడు మురారి. అది చూసి కృష్ణ కూడా కన్నీరు పెట్టుకుంటుంది. భర్తని దగ్గరకు తీసుకుని ఓదారుస్తుంది.

28

 మరోవైపు ముకుంద ఆలోచిస్తూ కృష్ణ, మురారి కోసం ప్రాణాలకు తెగించి అత్తయ్యకి  ఎదురు నిలబడింది. మురారితోపాటు అందరి సానుభూతి సంపాదించుకుంది. ఇంత జరిగాక మురారి ఎవరితోనో మాట్లాడడు. కృష్ణ తోనే మాట్లాడి, మాట్లాడి విడిపోయే విషయంలో నిర్ణయాన్ని మార్చుకుంటారేమో అని కంగారుపడుతూ గట్టిగా అరుస్తుంది. భవాని వచ్చి నీకేమైంది, దేనికి అంతలా ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది.

38

నందిని విషయంలో తప్పు చేశారు అంటుంది ముకుంద. నా తప్పునే ఎత్తి చూపిస్తావా అంటుంది భవాని. దీనివల్ల మీకు ఏం ఒరిగింది.. అందరూ నందిని కి న్యాయం జరిగిందని అంటున్నారు. మీరు మురారి వాళ్లకి శిక్ష వేశాను అనుకుంటున్నారు కానీ వాళ్లకి మంచి ప్రైవసీ దొరికిందని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ముకుంద. మరోవైపు ఆకలేస్తుంది భోజనం పెట్టమంటాడు ఈశ్వర్.

48

రేవతి పట్టించుకోదు. ఏంటి నీ తల పొగరు అని అడుగుతాడు ఈశ్వర్. చెప్పాల్సిన అవసరం నాకు లేదు అంటుంది రేవతి. అడిగే అధికారం నాకుంది అంటాడు ఈశ్వర్. ఇంట్లో అందరికీ అధికారాలే ఉంటాయి కానీ అర్థం చేసుకునే మనసే ఎవరికి ఉండదు. తప్పు చేసిన మీరు ఏ తప్పు చేయని నా కొడుకు కోడలికి శిక్ష వేస్తున్నారు. మనకి నచ్చిన వాళ్ళు మనతో మాట్లాడకపోతే మనసుకి ఎంత కష్టంగా ఉంటుందో మీకు కూడా తెలియాలి.

58

అందుకే ఈరోజు నుంచి నేను కూడా నీతో మాట్లాడను అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రేవతి. మరోవైపు భర్త దగ్గరికి వచ్చి మనస్ఫూర్తిగా సారీ చెప్తుంది కృష్ణ. ఎందుకు అంటాడు మురారి. నావల్లే మీకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అంటుంది కృష్ణ. నువ్వు మంచి పని చేశావు కానీ అది ఇంట్లో ఎవరికీ నచ్చలేదు దానికి మనమేం చేస్తాము అంటాడు మురారి. మీది పెద్ద మనసు బాగా అర్థం చేసుకున్నారు.

68

మీ పెద్దమ్మ కూడా ఇలా అర్థం చేసుకొని ఉంటే నాకు ఈ గిల్టీనెస్ ఉండేది కాదు అంటూ బాధపడుతుంది కృష్ణ. ఇంక ఆ విషయం వదిలేయ్ అంటాడు మురారి. సరే భోజనానికి వెళ్దాం రండి అంటుంది కృష్ణ. పెద్దమ్మకి మొహం చూపించలేను అంటాడు మురారి. పిల్లలు తప్పు చేసినప్పుడు తల్లి శిక్ష వేయడం మామూలే కదా, ఆవిడ ప్రేమని భరించిన మీరు ఆవిడ కోపాన్ని మాత్రం భరించలేరా అంటూ భర్త కి సర్ది చెప్తుంది కృష్ణ.  మరోవైపు డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చిన కృష్ణ దంపతులతో ఎవ్వరూ మాట్లాడరు. వారి కుర్చీల్లో వారు భోజనం చేయటానికి కూర్చుంటారు. భవాని లేచి నిలబడిపోతుంది. 

78

మురారి లేచి రా కృష్ణ వెళ్ళిపోదాం, నాకు ఈ క్షణమే ఆకలి చచ్చిపోయింది అంటాడు. నాక్కూడా ఆకలి లేదు అంటూ భర్తని అనుసరిస్తుంది కృష్ణ. రేవతి బాధతో కొడుకుని కోడల్ని అలా చూస్తూ ఉండిపోతుంది.వాళ్ల సంగతి నీకెందుకు నువ్వు వడ్డించు అంటాడు ఈశ్వర్. అవును మన కడుపు నిండితే చాలు ఎవరెలా పోతే మనకెందుకు, మీరు కడుపు నిండా తినండి అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోబోతుంది రేవతి. తనని ఆపి నీది కడుపుకోత, నాది గుండె కోత. కన్నందుకు నీకు పెంచినందుకు నాకు ఈ కడుపు కోత తప్పదు అంటూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ భోజనం చేసిన తర్వాత మిగిలిన భోజనం అంతా సెక్యూరిటీ  కి ఇచ్చేయమని ముకుందకి చెప్తుంది భవాని. ఆశ్చర్యంగా చూస్తుంది ముకుంద.

88

అందరూ వెళ్లిపోయిన తర్వాత భోజనానికి వస్తారు కృష్ణ, మురారి. అక్కడ గిన్నెలు అన్ని ఖాళీగా ఉండడం చూసి బాధపడతారు. భర్త బాధపడటం చూసి చేతికి మంచినీళ్లు ఇచ్చి తాగమంటుంది. సూప్ బాగుందా అని నవ్వుతూ అడుగుతుంది. మురారి మాత్రం జోక్ ల తీసుకోకుండా వాళ్లు నీళ్లు మాత్రమే కాదు కన్నీళ్లు కూడా వదిలేశారు అంటాడు. తరువాయి భాగంలో మురారిని తల దువ్వి జడ వేయమంటుంది కృష్ణ. గుండు చేస్తాను అంటూ నవ్వుతాడు మురారి.

click me!

Recommended Stories