రకుల్ ప్రీత్ బోల్డ్ లుక్ కు ఇంటర్నెట్ మండిపోతోంది.. ఆ దుస్తులు లేకుండా బ్లాక్ గౌన్ లో అందాల రచ్చ.. పిక్స్

First Published | Apr 27, 2023, 1:51 PM IST

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) స్టన్నింగ్ అవుట్ ఫిట్స్ లో దర్శనమిస్తూ నెట్టింట దుమారం  రేపుతోంది. తాజాగా ఓ ఈవెంట్ లో రకుల్ గ్లామర్ మెరుపులతో మతులు పోగొట్టింది.
 

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం  అవసరం లేదు.  టాలీవుడ్ ను కొంతకాలం ఊపూపిన ఈ బ్యూటీ గతేడాది మొత్తం బాలీవుడ్ వైపు మళ్లీంది. ఓకే ఏడాది ఐదారు చిత్రాలతో అలరించింది.

బాలీవుడ్ లో రకుల్ అంతగా కలిసి  రాలేదనే చెప్పాలి. సినిమా ఆఫర్లు అందినా వాటి ఫలితాలు మాత్రం స్టార్ బ్యూటీ జోరుకు బ్రేక్ లు వేశాయి. దీంతో మళ్లీ సౌత్ వైపు చూస్తోంది.  భారీ ప్రాజెక్ట్స్ తెరపైకి వస్తున్న వేళ అవకాశాల కోసం ఎదురుచూస్తున్నట్టు కనిపిస్తోంది.
 


ప్రస్తుతం రకుల్ ముంబైలోనే సందడి చేస్తోంది. తన భాయ్ ఫ్రెండ్ జాకీ భగ్నానీతో ఆయా ఈవెంట్లు, పలు కార్యక్రమాలకు హాజరవుతూ సందడి చేస్తున్న విషయం తెలిసిందే. అందుకు సంబంధించిన ఫోటోలను కూడా రకుల్ అభిమానులతో పంచుకుంటూనే వచ్చింది.

తాజాగా రకుల్ GQ మోస్ట్ ఇన్ ఫ్లూయెన్షల్ యంగ్ ఇండియన్ అవార్డ్స్ ఫంక్షన్ లో పాల్గొంది. సినీ తారలు పాల్గొన్న ఈ వేడుకలో రకుల్ అదిరిపోయే అవుట్ ఫిట్ లో దర్శనమిచ్చింది. ఒకరకంగా చెప్పాలంటే తన బోల్డ్ లుక్ తో రకుల్ మైండ్ బ్లాక్ చేసింది. తెగ్గించేసిందా అన్నట్టుగా గ్లామర్ విందు చేసింది. 

లేటెస్ట్ లుక్ లో రకుల్ ప్రీత్ సింగ్ బ్లాక్ గౌన్ లో మెరిసింది. అయితే గౌన్ లో నిలువునా చీరి ఉంది. నడుము భాగంలో మాత్రమే జతచేసి, మిగితా దంతా ఓపెన్ గానే ఉంది.  దీంతో రకుల్  అందాలతో మెరుపులు మెరిపించింది. లోదుస్తులు కూడా లేకుండా మతిపోగొట్టింది.
 

అందాల ప్రదర్శనలో నెక్ట్స్ లెవల్ అనిపించింది. రకుల్ బోల్డ్ షోకు ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గ్లామర్ తో మంటలు మండిస్తోంది. అదే అవుట్ ఫిట్ లో ఫొటోలకు ఫోజులిచ్చింది. తాజాగా ఆ పిక్స్ ను షేర్ చేయడంతో నెట్టింట వైరల్ గా మారాయి. 
 

మరోవైపు రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం కేరీర్ పరంగా వెనకబడిపోతుండటంతో కాస్తా రూటు మార్చినట్టు తెలుస్తోంది. ఓ వార్త ప్రకారం.. రకుల్ ప్రీత్ త్వరలో స్పెషల్ సాంగ్ లోనూ కనిపించబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం రకుల్ తీరు చూస్తుంటే నిజమే అనిపిస్తోంది. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.
 

తెలుగులో చివరిగా రకుల్ ‘కొండపొలం’లో నటించింది. ఆ తర్వాత నుంచి నేరుగా బాలీవుడ్ లోనే బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది. ప్రస్తుతం సౌత్ లోనే సినిమాలు చేస్తోంది. తమిళంలో శివ  కార్తీకేయన్ సరసన ‘ఆయలాన్’, కమల్ హాసన్ సరసన ‘ఇండియన2’లో నటిస్తోంది. 
 

Latest Videos

click me!