స్టార్ హీరోలను అభిమానులు దేవుళ్ళలా పూజిస్తారు. నచ్చిన హీరో కోసం ఏం చేయడానికైనా వెనుకాడరు. ఈ విషయంలో హీరోయిన్స్ అభిమానులు కూడా తక్కువేం కాదండోయ్. వాళ్లకు నచ్చితే ఏకంగా గుడి కట్టేస్తారు. వివిధ పరిశ్రమలకు చెందిన హీరోయిన్స్ కి ఫ్యాన్స్ గుడులు కట్టి పూజిస్తున్నారు. కుష్బూ, నమిత, కాజల్, నయనతారతో పాటు పలువురు ఈ లిస్ట్ లో ఉన్నారు. తాజాగా తమన్నా జాయిన్ అయ్యారు.