ముకుల్ దేవ్ 100 కోట్ల సినిమాలు.. టాలీవుడ్‌ విలన్‌కి బిగ్గెస్ట్ బూస్ట్ ఇచ్చిన ఆ మూడు చిత్రాలివే

Published : May 24, 2025, 06:46 PM IST

 రవితేజ హీరోగా వచ్చిన `కృష్ణ` చిత్రంలో విలన్‌గా నటించి మెప్పించిన నటుడు ముకుల్ దేవ్ మరణించారు. ఈ సందర్భంగా ఆయన వంద కోట్ల చిత్రాల గురించి తెలుసుకుందాం.  

PREV
17
సంచలనాత్మక మూవీలో ముకుల్‌ దేవ్‌

బాలీవుడ్ నటుడు ముకుల్ దేవ్(54) ఈ శనివారం కన్నుమూశారు.  ముకుల్ తన కెరీర్‌లో అనేక హిట్ చిత్రాలలో నటించారు. అయితే,  బాక్సాఫీసు వద్ద సంచలనాలు సృష్టించిన ఒక మూవీలో ఆయన నటించారు. ఆ మూవీ ఏంటి? ఆ సంగతులేంటో తెలుసుకుందాం. 

27
సోనాక్షి కి బ్రదర్‌గా నటించిన ముకుల్‌ దేవ్‌

ఆ సినిమా ఏంటో కాదు యాక్షన్ కామెడీగా వచ్చిన `సన్ ఆఫ్ సర్ధార్`. ఈ మూవీ 2012లో విడుదలైంది. ఇందులో ముకుల్ దేవ్ సోనాక్షి సోదరుడు టోనీ పాత్ర పోషించారు.

37
ఆడియెన్స్ కి దగ్గరైన ముకుల్‌ దేవ్‌

`సన్ ఆఫ్ సర్ధార్` చిత్రంలో ముకుల్ దేవ్‌తో పాటు సంజయ్ దత్, అజయ్ దేవగన్, సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రల్లో నటించారు. ఇందులో ముకుల్‌ పాత్ర బాగా ఆకట్టుకుంది. అందరికి దగ్గరయ్యింది. 

47
ముకుల్‌ దేవ్‌ కెరీర్‌లో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రం

`సన్ ఆఫ్ సర్ధార్` చిత్రం 40 కోట్ల బడ్జెట్‌తో నిర్మించబడింది. ప్రపంచవ్యాప్తంగా ఇది రూ.150 కోట్లకు పైగా వసూలు చేసింది. ముకుల్‌ దేవ్‌ కెరీర్‌లోనే అత్యధి కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది. 

57
ముకుల్‌ దేవ్‌ మరో వంద కోట్ల మూవీ

ముకుల్ దేవ్ నటించిన మరో 100 కోట్ల చిత్రం `ఆర్‌... రాజ్ కుమార్`. ఇది 2013లో విడుదలైంది. ఇందులో ముకుల్ దేవ్‌తో పాటు షాహిద్ కపూర్, సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రల్లో నటించారు.

67
ముకుల్‌ దేవ్‌కి పెద్ద బూస్ట్ ఇచ్చిన మూవీ

`ఆర్‌... రాజ్ కుమార్` 38 కోట్ల బడ్జెట్‌తో నిర్మించబడింది. ప్రపంచవ్యాప్తంగా 101.21 కోట్లు వసూలు చేసింది. ముకుల్‌కిది మరో పెద్ద బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. 

77
ముకుల్‌ దేవ్‌ మరో వంద కోట్ల మూవీ

ఈ జాబితాలో ముకుల్ దేవ్ నటించిన `జై హో `చిత్రం కూడా ఉంది.  ఈ మూవీ కూడా ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లకు పైగా వసూలు చేసింది. అందరిని ఆశ్చర్యపరిచింది. ఇలా ముకుల్‌ దేవ్ కెరీర్‌లో మూడు సినిమాలు వంద కోట్లకుపైగా వసూళ్లని రాబట్టడం విశేషం. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories