`ఏస్‌ vs మామన్‌` బాక్సాఫీస్ వార్.. విజయ్‌ సేతుపతికి ఝలక్‌ ఇచ్చిన సూరి

Published : May 24, 2025, 06:22 PM IST

విజయ్‌ సేతుపతి హీరోగా నటించిన `ఏస్‌` మూవీ శుక్రవారం విడుదలై ఆకట్టుకుంటుంది. కానీ గత వారం విడుదలైన సూరి మూవీ విజయ్‌కి షాకిస్తుంది.  

PREV
14
విజయ్‌ సేతుపతి `ఏస్‌` వర్సెస్‌ సూరి `మామన్‌`

విజయ్‌ సేతుపతి నటించిన గత మూవీ `మహారాజా` పెద్ద హిట్‌ అయ్యింది. దీంతో ఆయన్నుంచి వచ్చిన `ఏస్‌` మూవీ పై అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ మూవీకి పెద్దగా ప్రమోషన్స్ చేయలేదు. దీంతో ఇది వస్తుందనే విషయం చాలా మందికి తెలియదు. అలాంటి పరిస్థితుల్లో శుక్రవారం విడుదలైంది `ఏస్‌.  

24
విజయ్‌ సేతుపతి `ఏస్‌` మూవీ రెస్పాన్స్

క్రైమ్‌ కామెడీగా రూపొందిన `ఏస్‌` మూవీలో కన్నడ నటి రుక్మిణి హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీతో ఆమె కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో యోగిబాబు ముఖ్య పాత్ర పోషించారు. శుక్రవారం విడుదలైన మూవీకి మిశ్రమ స్పందన లభిస్తుంది.  యోగిబాబు పాత్ర వల్లే ఈ మూవీ అంతో ఇంతో ఆకట్టుకునేలా ఉందని అంటున్నారు. 

34
`ఏస్` మొదటి రోజు వసూళ్లు

విజయ్ సేతుపతి  గత చిత్రాలతో పోల్చితే `ఏస్` ఫస్ట్ డే కలెక్షన్లలో చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. విజయ్‌ గత మూవీని `ఏస్‌` టచ్‌ చేయలేకపోయింది.  ఈ చిత్రం మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 1.8 కోట్లు వసూలు చేసింది. ఇది చాలా పూర్‌ ఓపెనింగ్స్ కావడం గమనార్హం.

44
ఇక సూరి `మామన్‌` మూవీ బాక్సాఫీసు వద్ద రచ్చ

గత వారం విడుదలైన సూరి నటించిన 'మామన్' సినిమా మంచి వసూళ్లు రాబడుతోంది. కోలీవుడ్‌లో ఈ మూవీ శుక్రవారం ఒక్క రోజే రూ. 1.54 కోట్లు వసూలు చేసింది. ఇది విజయ్‌ సేతుపతి సినిమాకి దారుణమైన అవమానమనే చెప్పాలి. ఈ వారం కూడా `మామన్‌` సత్తా చాటే అవకాశం ఉంది. విజయ్‌ సేతుపతి మూవీకి వస్తున్న టాక్ చూస్తుంటే ఇది నిలబడటం కష్టమే అనిపిస్తుంది. దీంతో ఇది సూరి సినిమాకి కలిసి వస్తుందని ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories