MS Raju: మళ్లీ పెళ్లి విషయంలో జరిగిన మిస్టేక్‌ ఇదే.. నరేష్‌, పవిత్రల సినిమా డిజాస్టర్‌పై ఎంఎస్‌ రాజు రియాక్షన్‌

Published : Aug 11, 2026, 04:58 PM IST

దర్శక, నిర్మాత ఎంఎస్‌ రాజు.. `అగధ` సినిమా ప్రమోషన్స్ లో భాగంగా `మళ్లీ పెళ్లి` సినిమా గురించి రియాక్ట్ అయ్యారు. ఆ మూవీ విషయంలో జరిగిన మిస్టేక్‌ ఏంటో బయటపెట్టారు.

PREV
15
అగధతో రాబోతున్న ఎంఎస్‌ రాజు

స్టార్‌ ప్రొడ్యూసర్‌ ఎంఎస్‌ రాజు ఇప్పుడు దర్శకుడిగా తనని తాను నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే. ఆయన ఇప్పటికే నాలుగు సినిమాలకు దర్శకత్వం వహించారు. ఇప్పుడు `అగధ` చిత్రాన్ని తెరకెక్కించారు. కామాక్షి భాస్కర్ల, శ్రావణ్‌ రెడ్డి, వనితా విజయ్‌ కుమార్‌, రోషన్‌ బషీర్‌, షిజు, భాను చందర్‌ వంటి వారు నటించిన చిత్రమిది. శ్రీ ఆదివరాహ ప్రొడక్షన్స్ పతాకంపై అజయ్‌ కేఆర్‌ సమర్పణలో కాశీ విశాలాక్షి బలుసు నిర్మించారు. ఈ మూవీ ఈ నెల 14న విడుదల కాబోతుంది. చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా దర్శకుడు ఎంఎస్‌ రాజు సినిమా విశేషాలను పంచుకున్నారు.

25
నరేష్‌, పవిత్రలతో మళ్లీ పెళ్లి చేసిన ఎంఎస్‌ రాజు

అందులో భాగంగా సీనియర్‌ నటుడు నరేష్‌, పవిత్ర లోకేష్‌ జంటగా `మళ్లీ పెళ్లి` అనే చిత్రంలో నటించారు. దీనికి ఎంఎస్‌ రాజు దర్శకత్వం వహించారు. నరేష్‌ నిర్మాత కావడం విశేషం. ఈ చిత్రాన్ని నరేష్‌ యాంగిల్‌లో రూపొందించారు. ఆయన తన మూడు పెళ్లిళ్ల విషయంలో ఫేస్‌ చేసిన స్ట్రగుల్స్ ని, మానసిక సంఘర్షణని ఆవిష్కరించారు. ఫ్యామిలీ విషయంలో తనకు సంతోషం లేదనే విషయాన్ని ఇందులో చెప్పారు. నరేష్‌.. పవిత్ర లోకేష్‌కి ఎందుకు దగ్గరయ్యారనేది చూపించారు. అదే సమయంలో పవిత్ర లోకేష్‌..ఎందుకు నరేష్‌కి దగ్గర కావాల్సి వచ్చింది? వీరి మధ్య ప్రేమ ఎలా చిగురించిందని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.

35
మళ్లీ పెళ్లి డిజాస్టర్‌పై ఎంఎస్‌ రాజు కామెంట్‌

ఇదిలా ఉంటే ఈ మూవీ థియేటర్లో ఆడలేదు. మార్నింగ్‌ షో తప్ప మాట్నీ నుంచే థియేటర్ల నుంచి ఎత్తేశారు. ఈ క్రమంలో తాజాగా దీని గురించి దర్శకుడు ఎంఎస్‌ రాజు స్పందించారు. ఆ మూవీ నరేష్‌తో ఉన్న రిలేషన్‌ కోసం తీసినట్టు తెలిపారు. ఆబ్లిగేషన్‌లోనే చేశామని ఆయన తెలిపారు. ఆ సినిమా ఫలితంపై స్పందిస్తూ, సినిమా తీశాక ఇది థియేటర్‌ ఫిల్మ్ కాదనిపించిందన్నారు. ఇది థియేటర్లో ఆడే సినిమా కాదు, ఓటీటీ ఫిల్మ్ అని అప్పుడే అనిపించిందన్నారు. ఓటీటీలో మాత్రం అదిరిపోయే వ్యూస్‌ని సాధించిందని చెప్పారు.

45
అగధ అంటే ఏంటంటే?

ఇక `అగధ` గురించి మాట్లాడుతూ, ఆయన తన కాన్ఫిడెంట్స్ ని వెల్లడించారు. కచ్చితంగా సినిమా పెద్ద హిట్‌ అవుతుందనే నమ్మకంతో ఉన్నట్టు తెలిపారు. తాను ఇంత కాన్ఫిడెంట్‌గా ఏ సినిమాకు లేదని, ఒక మూవీ గురించి ఇంతగా ఎప్పుడూ మాట్లాడలేదని, ఇప్పుడు మాట్లాడుతున్నానంటే ఆ మాటల్లోనే సినిమా ఎలా ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు అన్నారు. `అగధ అంటే లోతైన అంశం, ఓ శూన్యం అని చెప్పుకోవచ్చు. మనం దేవుడ్ని, దెయ్యాలను కంటితో చూడలేదు. అలాంటి ఫోర్స్‌లకు మధ్య జరిగే కథ ‘అగధ’.

55
అగధలో స్పెషాలిటీ ఏంటంటే

ఇందులో హారర్, భయపెట్టే అంశాలు మాత్రమే ఉండవు. అన్ని రకాల అంశాలు ఉంటాయి. దేవుడికి వ్యతిరేకంగా పని చేసే ఓ దుష్ట శక్తిని ‘అగధ’ అన్నట్టుగా చూపించాను. ఇదొక ఆర్ట్ ఫిల్మ్‌లా కాకుండా అందరినీ రంజింపజేసేలా రూపొందించాను. నేను చూసిన రియాల్టీకి నా ఫ్యాంటసీని జోడించి ఓ మంచి సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వాలని తీశాను. ‘దేవి’ టైంలో నేను ఎన్నో ఆర్థిక సమస్యలను ఎదుర్కొన్నాను. కానీ ఏదో ఒక పవర్ నన్ను ముందుకు నడిపించింది. ఇప్పుడు ‘అగధ’ జర్నీలోనూ నాకు అలాంటి ఓ ఫోర్స్ ముందు ఉండి నడిపించినట్టుగా అనిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న తరాన్ని అట్రాక్ట్ చేసేలా దుష్టశక్తి మీద ఓ సినిమాని తీయాలని అనుకుని ‘అగధ’ చేశాను. కేవలం సింగిల్ స్క్రీన్స్ కాదు మల్టీప్లెక్స్ ఆడియెన్స్‌ని కూడా ఆకట్టుకోవాలని అనుకున్నాను. ఈ చిత్రాన్ని నిజాయితీతో తెరకెక్కించాను.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories