ఎంఎస్‌ నారాయణ సినిమాల్లోకి రాకముందు చేసిన పని ఇదేనా? అస్సలు ఊహించరు, తనని బాధపెట్టే సంఘటన అదే!

First Published | Oct 14, 2024, 8:46 PM IST

పాపులర్‌ కమెడియన్‌ ఎమ్మెస్‌ నారాయణ సినిమాల్లోకి రాకముందు ఏం పనిచేసేవాడో తెలుసా? తనని కలిసి వేసిన సంఘటన రివీల్‌. 
 

ఎంఎస్‌ నారాయణ తెలుగు చిత్రపరిశ్రమలో తనదైన నవ్వులతో రెండు దశాబ్దాలపాటు అలరించిన నటుడు. విచిత్రమైన బాడీ లాంగ్వేజ్‌, విభిన్నమైన డైలాగ్‌ డెలివరీతో ఆద్యంతం నవ్వులు పూయించారు.  తనదైన మార్క్ హాస్యంతో ఆకట్టుకున్నారు. టాలీవుడ్‌లో బ్రహ్మానందం, అలీ తర్వాత జస్ట్ ఆ బాడీ చూస్తే నవ్వు వచ్చేందంటే అది ఎమ్మెస్‌ నారాయణకే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. రెండు దశాబ్దాల కెరీర్‌లో ఆయన ఏకంగా 750కిపైగా సినిమాలు చేసి మెప్పించారు. అంతేకాదు గిన్నిస్‌ రికార్డు సాధించారు. కేవలం 17ఏళ్ల టైమ్‌లోన 700లకుపైగా సినిమాలు చేసిన నటుడిగా ఆయన ఈ అరుదైన రికార్డుని సాధించడం విశేషం. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 ఇంట్రెస్టింగ్‌ అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.
 

ఎమ్మెస్‌ నారాయణ.. తక్కువ టైమ్‌లోనే ఇంతటి ఎక్కువ సినిమాలు చేసిన కమెడియన్‌గా రికార్డు సృష్టిస్తారు. ఆయన్నుంచి ఏడాదికి ఏకంగా ముప్పై, నలభై సినిమాలు రిలీజ్‌ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అత్యంత బిజీయెస్ట్ ఆర్టిస్ట్ గా రాణించారు. తనదైన  కామెడీతో నవ్వులు పూయించారు. అలాంటి హాస్యనటుడు బాధ పడిన సందర్భం ఒకటి ఉంది.

తన జీవితంలో ఆ సంఘటన ఆయన్ని బాగా బాధపెట్టించిందట. అదేంటో కాదు తన చిన్న చెల్లి మరణం. ఆమె మరణించినందుకు చాలా బాధపడ్డానని, ఆమెకి తాను ఏం పెట్టుకోలేకపోయాను అని ఆయన బాధపడ్డారు. 
 

Latest Videos


ఈ సందర్భంగా తనకు సంబంధించి ఆసక్తికర విషయం బయటపెట్టారు ఎమ్మెస్‌ నారాయణ. తాను సినిమాల్లోకి రాకముందు ఏం చేసేవాడో వెల్లడించారు. తాను మొదట్లో టీచర్‌గా పనిచేసేవారట. తాము పది మంది సంతానం అని, ఏడుగురు మగ పిల్లలు, ముగ్గురు ఆడపిల్లల సంతానం అని. చిన్న చెల్లి పెళ్లి అయ్యాక కొన్ని రోజులకే చనిపోయిందని, కానీ ఆమెకి ఏం పెట్టుకోలేకపోయానని తెలిపారు

ఎమ్మెస్‌నారాయణ. తాను టీచర్‌గా పనిచేసినప్పుడు బాగా చాలీచాలనీ జీతం వచ్చేదని, తన సిస్టర్స్ కి పెద్దగా ఇచ్చుకునే అవకాశం లేదని, కానీ అప్పుడో, ఇప్పుడు యాభై, వంద ఇస్తుండేవాడిని అని చెప్పారు. 
 

కానీ ఆమె ఎక్కువ రోజులు బతకలేదని, తాను ఆర్టిస్ట్ అయ్యేంత వరకు బతికి ఉండి ఉంటే బాగా చూసుకునేవాడిని, బాగా పెట్టుకునే వాడిని అని, అదే తన జీవితంలో ఎంతో బాధగా అనిపించే సంఘటన అని చెప్పారు ఎమ్మెస్‌ నారాయణ. సాక్షికి గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు.

పది మంది పిల్లలం కావడంతో ఆర్థిక పరిస్థితి బాగా ఉండేది కాదని, తాను చిన్నపాటి టీచర్‌గా పనిచేశానని, చాలీచాలనీ జీతం వచ్చేందని, దాంతోనే కుటుంబ పోషణ ఉండేదని, ఆడపిల్లలకు పెద్దగా పెట్టుకునే అవకాశం లేదని తెలిపారు ఎమ్మెస్ నారాయణ. ఆ సమయంలో మనీ కోసం చాలా స్ట్రగుల్‌ అయినట్టు తెలిపారు.  
 

ఆ ఇంటర్వ్యూలో తాను చేసే పేరడీ పాత్రల గురించి చెబుతూ, తాను ఇమినేషన్‌ చేయడాన్ని ఎక్కువగా ఎంజాయ్‌ చేసేవాడిని అన్నారు. అయితే ఇలాంటి పేరడీ పాత్రలు చేయడమనేది దర్శకుడి ఛాయిస్‌ అని, ఆయన చెప్పినట్టు చేయాల్సిందే, అని, తాము ఆర్టిస్ట్ లం కాబట్టి ఈ పాత్రలు చేయాలా? వద్దా అనేది ఆలోచించలేదని తెలిపారు.

డైరెక్టర్స్ చెప్పినట్టు చేసేవాడిని అని, ఇలాంటి పాత్రలు చేస్తుంటే చాలా హ్యాపీగా, ఎంజాయ్‌గా ఉంటుందన్నారు. ఈ పాత్ర చేయనని తాను ఎప్పుడూ చెప్పలేదన్నారు. దర్శకులు తన కోసం స్పెషల్‌గా క్యారెక్టర్స్ రాసేవారని తెలిపారు ఎమ్మెస్‌ నారాయణ.  ఎమ్మెస్‌ నారాయణ అనారోగ్యంతో 2015లో మరణించారు. వయసు రీత్యా అవయవాలు దెబ్బ తిని కన్నుమూశారు.

ఎమ్మెస్‌ నారాయణ నటుడు మాత్రమే కాదు, దర్శకుడు కూడా. ఆయన తన కొడుకు విక్రమ్‌ని పరిచయం చేస్తూ `కొడుకు`సినిమా చేశాడు. అది ఆడలేదు. దాదాపు ఎనిమిది సినిమాలకు రైటర్ గా పనిచేశాడు. ఇప్పుడు ఆయన లేని లోటు తెలుగు సినిమాల్లో స్పష్టంగా కనిపిస్తుందని చెప్పొచ్చు. 

Read more: సినిమా సెట్‌లో రమ్మంటూ శోభన్‌బాబు సైగలు.. అన్నపూర్ణమ్మకి సోగ్గాడు నేర్పిన జీవిత పాఠం

Also Read: డిప్రెషన్‌లోకి వెళ్లిన శ్రీకాంత్‌, ఆల్మోస్ట్ కెరీర్ క్లోజ్‌.. చిరంజీవి వల్లే మళ్లీ మామూలు మనిషి

click me!