ఆ మూవీ చూసి, మహేష్ కి ఫోన్ చేసి మరీ తిట్టిన బడా పొలిటీషియన్, ఆయనంటే సూపర్ స్టార్ కి ఎందుకంత భయం?

First Published | Oct 14, 2024, 8:10 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఓ బడా పొలిటీషియన్ ఫోన్ చేసి మరీ తిట్టాడట. తన మూవీ విడుదలైతే ఆయన ఏమంటాడో అనే ఒక భయమట. ఇంతకీ ఎవరా బడా పొలిటీషియన్.. 
 

టాలీవుడ్ టాప్ స్టార్స్ లో మహేష్ బాబు ఒకరు. ఆయన ఇండియా వైడ్ పాపులారిటీ ఉంది. కొన్నేళ్లుగా ఆయన వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. మహేష్ బాబు గత చిత్రం గుంటూరు కారం మిక్స్డ్ టాక్ తో కూడా వంద కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. 

ఆచితూచి సినిమాలు చేస్తాడు మహేష్ బాబు. హీరోగా ఆయన చిత్రాల సంఖ్య  30 కూడా దాటలేదు. తన ఇమేజ్ కి సెట్ అయ్యేలా మంచి కథలు ఎంచుకుంటారు. మహేష్ బాబు సక్సెస్ సీక్రెట్ కూడా అదే. కాగా మహేష్ బాబు తన 29వ చిత్రం దర్శకుడు రాజమౌళితో చేస్తున్నాడు. 

కాగా మహేష్ బాబును ఓ బడా పొలిటీషియన్ ఫోన్ చేసి మరీ తిట్టాడట. తన మూవీ విడుదలైతే ఆయన ఏమంటాడో అని మహేష్ బాబు, ఆ పొలిటీషియన్ కి భయపడతాడట. మహేష్ బాబును అంతగా భయపెట్టిన ఆ రాజకీయ నాయకుడు ఎవరో కాదు, మాజీ మంత్రి కేటీఆర్. గతంలో భరత్ అనే నేను మూవీ ప్రమోషనల్ ఈవెంట్లో కేటీఆర్, మహేష్ బాబు, కొరటాల శివ పాల్గొన్నారు. 
 


కేటీఆర్ ముందే ఈ విషయం మహేష్ బాబు చెప్పి, అందరినీ ఆశ్చర్యపరిచారు. మహేష్ బాబు మాట్లాడుతూ.. కేటీఆర్ నాకు బెస్ట్ ఫ్రెండ్. ఆయన నా సినిమాలు చూసిన వెంటనే తన అభిప్రాయం తెలియజేస్తారు. ఆగడు మూవీ చూసి నాకు ఫోన్ చేసి తిట్టారు. ఇలాంటి చెత్త చిత్రాలు చేయకండి, అన్నారు. ఆ సంఘటన నాకు ఇప్పటికీ గుర్తుంది. 

అంత హానెస్ట్ గా కేటీఆర్ తన అభిప్రాయం వ్యక్తపరుస్తారు. నా మూవీ విడుదలైతే, కేటీఆర్ రెస్పాన్స్ ఏమిటనే ఒక భయం ఉంటుంది. ఇక భరత్ అనే నేను మూవీలో నా రోల్ డిజైన్ చేయడంలో కేటీఆర్ ని స్ఫూర్తిగా తీసుకున్నాం. కేటీఆర్ లైఫ్ స్టైల్ కి కొంచెం దగ్గరగా, భరత్ అనే నేను మూవీలో నా క్యారెక్టర్ ఉంటుంది, అన్నారు. 
 

మహేష్ బాబు గతంలో చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన భరత్ అనే నేను సూపర్ హిట్. ఈ చిత్రంలో మహేష్ బాబు సీఎంగా నటించిన సంగతి తెలిసిందే. మహేష్ బాబు కెరీర్లో చేసిన బెస్ట్ మూవీస్ లో భరత్ అనే నేను ఒకటి. మహేష్ బాబు క్యారెక్టరైజేషన్ బాగుంటుంది. కొరటాల-మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కిన శ్రీమంతుడు, భరత్ అనే నేను మంచి విజయాలు సాధించాయి. 

రాజమౌళి-మహేష్ కాంబోలో మొదటి ప్రాజెక్ట్ గా ఎస్ఎస్ఎంబి 29 తెరకెక్కనుంది. దాదాపు రూ. 800 కోట్ల రూపాయల బడ్జెట్ తో పాన్ వరల్డ్ మూవీగా ప్లాన్ చేస్తున్నారు. జంగిల్ యాక్షన్ అడ్వెంచర్ డ్రామా అని ఇప్పటికే రాజమౌళి తెలియజేశారు. హాలీవుడ్ మూవీ ఇండియానా జోన్స్ తరహాలో సాగుతుందట 
 

స్క్రిప్ట్ వర్క్ కోసమే రెండేళ్ల సమయం తీసుకున్నారు. జనవరి నుండి ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. మహేష్ బాబు ఈ చిత్రం కోసం సరికొత్తగా సిద్ధం అవుతున్నారు. ఎన్నడూ లేని విధంగా జుట్టు, గడ్డం పెంచాడు. ఎస్ఎస్ఎంబి 28లో మహేష్ ఎలా కనిపించనున్నాడనే ఆసక్తి పెరిగిపోయింది. 

Rajamouli and Mahesh Babu

రెండేళ్లకు పైగా ఎస్ఎస్ఎంబి 29 షూటింగ్ జరగనుందని సమాచారం. ఇండియా వైడ్ ఈ ప్రాజెక్ట్ పై ప్రేక్షకుల్లో హైప్ నెలకొంది. ఎస్ఎస్ఎంబి 29తో మహేష్ బాబు పాన్ ఇండియా బరిలో దిగనున్నారు. నెక్స్ట్ మహేష్ బాబు సందీప్ రెడ్డి వంగతో మూవీ చేసే అవకాశం కలదు. 
 

బిగ్ బాస్ తెలుగు లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇక్కడ చూడండి

ఇండియాలోనే మోస్ట్ హ్యాండసమ్ హీరోల్లో సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) ఒకరు. హాలీవుడ్ హీరోలను తలపించే ఆయన లుక్ కు దేశ వ్యాప్తంగా అభిమానులు ఉంటారు. మిల్క్ బాయ్ గానూ అమ్మాయిల్లో క్రేజ్ దక్కించుకున్నారు. ఇక మహేశ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 
 

Latest Videos

click me!