అయితే ఈ సినిమా షూటింగ్ టైమ్‌లో ఓ వైపు తాను, తన అమ్మ కూర్చునే వాళ్లట. వాళ్లని గమనించిన శోభన్‌బాబు ఇటు రమ్మని సైగలు చేసేవాడట. చాలా సేపు ఆయన సైగలు చేయడంతో మొదట్లో ఇబ్బంది పడ్డారు. అంత పెద్ద హీరో అలా సైగలు చేస్తున్నాడేంటి? అని ఏవేవో అనుకున్నారట. ఆ తర్వాత తనే దగ్గరికి వెళ్లింది. ఆయన ఏ ఊరు అని అడిగితే బెజవాడ అని, వేషాలు వేయడానికి వచ్చామని చెప్పారట.
అయితే ఇక్కడ వేషాలు వేయాలంటే అలా ఓ మూలకు కూర్చోవద్దు, అలా కూర్చుంటే ఎవరూ పట్టించుకోరు, ఎప్పుడూ అక్కడే ఉండిపోతారు, కాస్త పది మంది ఉన్న చోట, ఎక్కువగా మాట్లాడుకునే చోట ఉండాలని, వాళ్ల మధ్యలో ఉండాలని, మాటలో మాట కలుపుతుండాలని తెలిపారట శోభన్‌బాబు.