గులాబ్ జామ్‌తోనో, ఫ్రూట్ సలాడ్‌తోనో ఐస్‌క్రీమ్ తినడం కామన్. కానీ వేడివేడి అన్నంలో ఐస్‌క్రీమ్ వేసుకుని తినేవాళ్లను చూశారా? మృణాల్ ఠాకూర్ అలానే తింటారట. ఈ వింత అలవాటు వెనుక ఓ ఆసక్తికరమైన కథ ఏంటో తెలుసా?
భోజనం తర్వాత స్వీట్‌గా ఐస్‌క్రీమ్ తినడం మనందరికీ అలవాటే. కొందరు గులాబ్ జామ్‌తో తింటారు, మరికొందరు ఫ్రూట్ సలాడ్‌తో తింటారు. కానీ వేడి అన్నంలో ఐస్‌క్రీమ్ కలుపుకుని తినడం ఎప్పుడైనా చూశారా?
26
విచిత్రమైన ఫుడ్ హ్యాబిట్..
వినడానికి వింతగా ఉన్నా, మనందరి ఫేవరెట్ 'సీతా మహాలక్ష్మి' మృణాల్ ఠాకూర్‌కు ఈ కాంబినేషన్ అంటే ప్రాణమట! అవును, సౌత్, నార్త్ ఇండస్ట్రీలలో సత్తా చాటుతున్న మృణాల్, ఓ ఇంటర్వ్యూలో తన ఈ విచిత్రమైన ఫుడ్ హ్యాబిట్ గురించి మాట్లాడింది.
36
డైట్ విషయంలో చాలా స్ట్రిక్ట్..
హీరోయిన్లు డైట్ విషయంలో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారు. కానీ మృణాల్ మాత్రం డిఫరెంట్. మృణాల్ మాట్లాడుతూ.. "నా స్నేహితురాలు ఒక సినిమాలో పాత్ర కోసం అన్నంలో ఐస్‌క్రీమ్ కలుపుకుని తినాల్సి వచ్చింది. తను తింటుంటే చూసి నాకు కూడా ట్రై చేయాలనిపించింది. తిని చూస్తే, నాకు విపరీతంగా నచ్చేసింది. అప్పటి నుంచి ఇది నా ఫేవరెట్ అయిపోయింది" అని మృణాల్ నవ్వుతూ చెప్పింది.
మృణాల్ ఫుడ్ హ్యాబిట్‌లాగే ఆమె జీవిత ప్రయాణం కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మహారాష్ట్రలోని ధులే అనే చిన్న ఊరిలో పుట్టిన మృణాల్, తల్లిదండ్రుల కోరిక మేరకు డెంటిస్ట్ అవ్వాలనుకుంది. కానీ నటనపై ఇష్టంతో ముంబైకి వచ్చింది. మొదట్లో ఇంట్లో వాళ్లు ఒప్పుకోకపోయినా, చదువుతో పాటు ఆడిషన్లకు వెళ్తూ చాలా కష్టపడింది.
56
ఎన్నో అవమానాలు దాటుకుని..
కేవలం 19 ఏళ్లకే 'కుంకుమ భాగ్య' సీరియల్‌తో ఫేమస్ అయినా, సినిమా అవకాశాలు అంత సులభంగా రాలేదు. సినిమా ఆఫీసులకు వెళ్తే, "నువ్వు టీవీ నటివి, నీది హీరోయిన్ ఫేస్ కాదు" అని డైరెక్టర్లు ముఖం మీదే చెప్పేవారట.
66
అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు
అవమానాలను తట్టుకుని నిలబడ్డ మృణాల్, 'లవ్ సోనియా' సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. ఆ తర్వాత వచ్చిన 'సీతా రామం' సినిమా ఆమె జీవితాన్నే మార్చేసింది. ఒకప్పుడు అవకాశాల కోసం ఎదురుచూసిన మృణాల్, ఇప్పుడు వరుణ్ ధావన్, పూజా హెగ్డే లాంటి స్టార్లతో స్క్రీన్ షేర్ చేసుకుంటూ కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుంది.