ధనుష్ తో లవ్ రూమర్లతో ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది హీరోయిన్ మృణాల్ ఠాకూర్. తాజాగా ఆమె రామ్ చరణ్ పెద్ది సినిమాలో ఐటమ్ సాంగ్ చేయబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఈ సాంగ్ కు మృణాల్ ఎంత వసూలు చేస్తుందో తెలుసా? నిజమెంత?
మెగా పవన్ స్టార్ రామ్ చరణ్ పెద్ది సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. రామ్ చరణ్ నుంచి సాలిడ్ హిట్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈక్రమంలో పెద్దిగా గట్టిగ ఫోకస్ చేశాడు రామ్ చరణ్. ఈక్రమంలో పెద్ది సినిమాను అద్భుతంగా తీర్చిదిద్దడం కోసం అన్ని వైపుల నుంచి ఆలోచిస్తున్నారు మేకర్స్. బుచ్చిబాబు డైరెక్ట్ చేస్తున్న ఈసినిమాలో ఓ స్పెషల్ ఐటమ్ సాంగ్ ను కూడా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఈ సాంగ్ ను ఇప్పటి వరకూ ఎటువంటి స్పెషల్ సాంగ్ లో కనిపించని.. మృణాల్ ఠాకూర్ తో చేయించాలని అనుకుంటున్నారట.
25
తెలుగువారి మనసుదోచిన హీరోయిన్
హిందీ సిరియల్స్ తో బాగా పేమస్ అయిన మృణాల్.. సీతా రామం’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. ఆతరువాత హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ లాంటి సినిమాలతో టాలీవుడ్ లో దూసుకుపోయింది మృణాల్ ఠాకూర్. ఈమధ్య కాలంలో ధనుష్ తో డేటింగ్ రూమర్స్ తో ఇంకాస్త వైరల్ అయ్యింది బ్యూటీ. ఇప్పుడు మరోసారి టాలీవుడ్‌లో స్పెషల్ సాంగ్ తో అలరించే అవకాశం కనిపిస్తోంది.
35
మృణాల్ ఠాకూర్ ఒప్పుకుంటుందా?
ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. పెద్ది సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కోసం నిర్మాతలు మృణాల్ ఠాకూర్‌ను ఇప్పటికే సంప్రదించారని తెలుస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న భారీ ప్రాజెక్ట్ కావడంతో, ఈ అవకాశానికి మృణాల్ వెంటనే సానుకూలంగా స్పందించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఐటమ్ సాంగ్ సినిమాకు బాగా ఉపయోగపడేలా డిజైన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అందుకోసం భారీగా కర్చుపెట్టబోతున్నారట కూడా. అద్భుతమైన సెట్స్‌లో, భారీ స్థాయిలో చిత్రీకరించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రత్యేక గీతానికి సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహమాన్ ఇప్పటికే ఓ ట్యూన్‌ను సిద్ధం చేశారని టాక్
పాన్ ఇండియా సినిమాల్లో ప్రత్యేక గీతాలకు ఉండే క్రేజ్ దృష్ట్యా, ఈ పాటపై గట్టిగా ఫోకస్ చేశారట టీమ్. ఈ సాంగ్ కోసం మృణాల్ 3 కోట్లకు పైగా రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. స్టార్ హీరోయిన్లు స్పెషల్ సాంగ్స్ లో నటించడం ఈమధ్య ట్రెండ్ గా మారింది. ఈసాంగ్స్ కొట్లలో వ్యూస్ ను సాధించి రికార్డులు బ్రేక్ చేస్తున్నాయి. రీసెంట్ గా తమన్నా చేసిన ఓ సాంగ్ ఎంత రచ్చ చేసిందో తెలిసిందే. ఈ ట్రెండ్ లోకి మృణాల్ కూడా రాబోతోందని సమాచారం. అయితే మృణాల్ ఈ సాంగ్ చేస్తుందని అధికారికంగా మాత్రంఎక్కడా అనౌన్స్ చేయలేదు. టాలీవుడ్ లో టాక్ మాత్రం గట్టిగా నడుస్తోంది. చూడాలి పెద్దిలో నిజంగా ఈ స్టార్ హీరోయిన్ సాంగ్ చేస్తుందా లేదా అనేది.
55
మృణాల్ ఠాకూర్ సినిమాలు..
ప్రస్తుతం మృణాల్ ఠాకూర్ హిందీతో పాటు తెలుగు భాషల్లో పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆమె, అల్లు అర్జున్–అట్లీ కాంబినేషన్‌లో రూపొందుతున్న పాన్ వరల్డ్ చిత్రంలో కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు రామ్ చరణ్ చిత్రం ‘పెద్ది’లో ప్రత్యేక గీతం నిజమైతే, మృణాల్ క్రేజ్ మరింత పెరిగే అవకాశముందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.