2026 లో ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయిన వాటిలో ప్రత్యేకమైన సినిమా ఒకటి ఉంది. బాక్సాఫీస్ వద్ద 3 వేల కోట్లు వసూలు చేసి, భారీ విజయం సాధించిన హారర్ థ్రిల్లర్ సినిమా సిన్నర్స్. ఈ మూవీ ఏ ఓటీటీలో అందుబాటులో ఉందంటే.
ఒకే సినిమా, 16 నామినేషన్లు... ఈ ఏడాది అకాడమీ అవార్డుల్లో (ఆస్కార్ 2026) ఓ హారర్ థ్రిల్లర్ మూవీ సత్తా చాటింది. ఆస్కార్ చరిత్రనే తిరగరాసింది. టైటానిక్, లా లా ల్యాండ్ లాంటి సినిమాలను దాటేసింది. ఇంతకీ ఆ సినిమా ఏదో కాదు సిన్నర్స్.
25
హారర్ థ్రిల్లర్ సినిమా
ఈ సినిమా థియేటర్లలో రిలీజైనప్పుడు భారీ రెస్పాన్స్ సాధించింది. బాక్సాఫీస్ దగ్గర రూ.3,000 కోట్లకు పైగా వసూలు చేసి చరిత్ర సృష్టించింది. దీనికి అద్భుతమైన రేటింగ్స్ కూడా వచ్చాయి. 2 గంటల 17 నిమిషాల ఈ సినిమాకు 7.5 రేటింగ్ ఉంది.
35
16 ఆస్కార్ నామినేషన్లు సాధించిన సినిమా..
ఈ హారర్ థ్రిల్లర్ సినిమా మొత్తం 16 ఆస్కార్ నామినేషన్లు పొందింది. ఆస్కార్ హిస్టరీలో ఈ ఘనత సాధించిన మొదటి సినిమా గా రికార్డు సాధించింది. వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్ నిర్మించిన సిన్నర్స్.. ఉత్తమ నటుడు, దర్శకుడు, చిత్రం, సంగీతం, సినిమాటోగ్రఫీ సహా మొత్తం 16 కీలక విభాగాల్లో ఈ సినిమా ఆస్కార్ నామినేషన్లు దక్కించుకుంది. కు ఓటీటీలో కూడా భారీ రెస్పాన్స్ వస్తోంది.
ఇదొక సూపర్ నాచురల్ హారర్ థ్రిల్లర్. ఏళ్ల తర్వాత తమ ఊరికి తిరిగొచ్చిన ఇద్దరు కవల సోదరుల (మైఖేల్ జోర్డాన్) కథ. కొత్త జీవితం మొదలుపెట్టాలనుకున్న వారికి ఎదురైన పరిణామాలే ఈ సినిమా. ఈ మధ్యలో జరిగిన సంఘటనలు.. సన్నివేశాలు ఉత్కంఠను రేపుతాయి.
55
సిన్నర్స్ ఏ ఓటీటీలో చూడొచ్చు?
హాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో సిన్నర్స్ ఒకటి. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.325.5 మిలియన్లు, ఇండియాలో రూ.120 మిలియన్లు వసూలు చేసింది. ఈ సినిమా జియో హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉంది.