బాలకృష్ణ సినిమాలో నటించమని అడిగితే గెటౌట్ అని గెంటేసిన లెజెండ్రీ నటి, కట్ చేస్తే దిమ్మ తిరిగే బ్లాక్ బస్టర్

Published : Jan 25, 2026, 12:31 PM IST

నందమూరి బాలకృష్ణ కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఓ చిత్రంలో నటించడానికి సీనియర్ నటి ఒకరు నిరాకరించారు. కానీ చివరికి ఆమె ఒప్పుకుని నటించారు. సంచలన విజయం సాధించిన ఆ మూవీ ఏంటో ఈ కథనంలో తెలుసుకోండి. 

PREV
15
నందమూరి బాలకృష్ణ 

నందమూరి బాలకృష్ణ కెరీర్ లో మరపురాని అద్భుతమైన చిత్రాలు ఎన్నో ఉన్నాయి. కొన్ని కమర్షియల్ బ్లాక్ బస్టర్స్ ఉండగా, మరికొన్ని ఆల్ టైం క్లాసిక్స్ ఉన్నాయి. నరసింహనాయుడు, సమరసింహారెడ్డి లాంటి చిత్రాలు కమర్షియల్ గా తిరుగులేని సక్సెస్ అందుకున్నాయి. అదే విధంగా ఆదిత్య 369 లాంటి ఆల్ టైం క్లాసిక్స్ కూడా ఉన్నాయి. 

25
వాళ్ళిద్దరి కాంబినేషన్ కి తిరుగులేదు 

బాలకృష్ణ కెరీర్ లో తిరుగులేని విజయం సాధించిన ఒక క్లాసిక్ మూవీ విషయంలో ఆసక్తికర సంఘటన జరిగింది. కోడి రామకృష్ణ, బాలకృష్ణ లది డెడ్లీ కాంబినేషన్. వీరి కాంబోలో సినిమా అంటే బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అని అభిమానులు భావించేవారు. కోడి రామకృష్ణ బాలకృష్ణతో సినిమా చేయడానికి రెడీ అయ్యారు. ఆ మూవీలో కీలక పాత్రలో నటించేందుకు ఓ లెజెండ్రీ నటిని అడగడానికి వెళ్లారు. 

35
గెటౌట్ అని గెంటేసిన లెజెండ్రీ నటి 

ఆమె కోడి రామకృష్ణని గెటౌట్ అని ఇంట్లో నుంచి గెంటేయడానికి ప్రయత్నించారట. ఇంతకీ ఆ నటి ఎవరో కాదులెజెండ్రీ భానుమతి. ఆ సినిమా మంగమ్మ గారి మనవడు. ఆ మూవీలో భానుమతి మనవడిగా బాలయ్య నటించారు. కోడి రామకృష్ణ.. భానుమతి గారికి కథ చెబుతూ ఈ చిత్రంలో మీరు కొన్ని నాటు పదాలు డైలాగులుగా చెప్పాలి అని వివరించారట. అవి కాస్త అసభ్యంగా ఉండడంతో ఆమె గెటౌట్ అని ఆగ్రహంతో తరిమేయడానికి ప్రయత్నించారట. 

45
ఆమె నటనకు అంతా చప్పట్లు 

కోడి రామకృష్ణ గారు.. లేదమ్మా ఈ పాత్ర మీరే చేయాలి, మీకు ఇష్టం లేకుంటే ఆ డైలాగులు తీసేస్తాను అని చెప్పారట. తర్వాత మంగమ్మగారి మనవడు చిత్రాన్ని భానుమతి ఒకే చెప్పారు. కానీ స్క్రిప్ట్ లో మాత్రం కోడి రామకృష్ణ ఆ డైలాగులని తొలగించలేదట. ఆ విషయాన్ని మరచిపోయి భానుమతి ఆ డైలాగులు చెప్పేశారట. ఆమె డైలాగ్ డెలివరీకి సెట్ లో ఉన్నవారంతా ఫిదా అయి చప్పట్లు కొట్టారట. ఏంటి వీళ్లంతా ఇంతలా చప్పట్లు కొడుతున్నారు అని కోడి రామకృష్ణని భానుమతి అడిగారు. ఆ రోజు కొన్ని డైలాగులు తొలగిస్తాను అని చెప్పాను. కానీ వాటిని తొలగించలేదు. మీరు చెప్పిన విధానం ఎంతో అద్భుతంగా ఉంది అని కోడి రామకృష్ణ అన్నారు. 

55
సినిమా మధ్యలోనే వెళ్లిపోయిన డైరెక్టర్ 

అవును నిజమే, ఈ సీన్ కి ఆ డైలాగులు అవసరమే అని భానుమతి అంగీకరించారట. మంగమ్మ గారి మనవడు చిత్రం తమిళ చిత్రం మాన్ వాసనై అనే చిత్రానికి రీమేక్. ఆ మూవీని తమిళంలో భారతీ రాజా తెరకెక్కించారు. కానీ తమిళ వెర్షన్ ఇంత మాస్ గా ఉండదు. తెలుగు వర్షన్ తొలి కాపీని భారతీరాజా చూసి మధ్యలోనే లేచి వెళ్లిపోయారట. నా సినిమాని తెలుగు వాళ్ళు చెడగొట్టారు అని భావించారట. కానీ కట్ చేస్తే మంగమ్మ గారి మనవడు బాలకృష్ణ కెరీర్ లోనే అప్పటికి బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. 

Read more Photos on
click me!

Recommended Stories