Thalapathy Vijay: 'జన నాయగన్' దెబ్బకు జడుసుకున్న స్టార్స్.. వాయిదా పడ్డ సినిమాల లిస్ట్ ఇదే!

Published : Jul 18, 2026, 09:40 AM IST

Thalapathy Vijay: విజయ్ నటిస్తున్న 'జన నాయగన్' సినిమా జులై 23న రిలీజ్ అవుతుండటంతో, బాక్సాఫీస్ పోటీని తట్టుకోలేమని భావించి చాలా సినిమాలు తమ రిలీజ్‌ను వాయిదా వేసుకున్నాయి. ఆ సినిమాలేంటో  చూద్దాం.

PREV
15
విజయ్ సినిమాకు భయపడి..

సీఎం విజయ్ జననాయగన్ రిలీజ్ డేట్ ఫిక్స్ అవ్వడంతో చాలాసినిమాలు తమ రిలీజ్ డేట్ ను మార్చకుంటున్నాయి. విజయ్ సినిమాకు భయపడి స్టార్స్ కూడా వెనకడుగు వేస్తున్నారు.  హీరోగా లోకేష్ కనగరాజ్ నటించిన 'డీసీ' సినిమా రిలీజ్‌ను ఆగస్ట్ 7కి వాయిదా వేశారు. ముందుగా ఈ సినిమాను జులై 31న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ, జులై 23న 'జన నాయగన్' వస్తుండటంతో, బాక్సాఫీస్ పోటీని తప్పించుకోవడానికే 'డీసీ' టీమ్ ఈ నిర్ణయం తీసుకుందని టాక్.

25
సన్ పిక్చర్స్ అధికారిక ప్రకటన..
సన్ పిక్చర్స్ సంస్థ తమ ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఈ విషయాన్ని ప్రకటించింది. లోకేష్ కనగరాజ్, వామికా గబ్బీ ఉన్న కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేసింది. 'డీసీ' చిత్రానికి 'A' సర్టిఫికెట్ వచ్చిందని, ఆగస్ట్ 7 నుంచి ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వస్తుందని పేర్కొంది. అరుణ్ మాధేశ్వరన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇందులో లోకేష్, వామికాతో పాటు సంజనా కృష్ణమూర్తి కూడా కీలక పాత్రలో నటించారు.
35
జన నాయగన్' రిలీజ్ డేట్ ప్రకటించాక..

'జన నాయగన్' రిలీజ్ డేట్ ప్రకటించాక, తమ సినిమాల తేదీలను మార్చుకున్న జాబితాలో మరికొన్న సినిమాలు కూడా ఉన్నాయి.  'ది డార్క్ హెవెన్', 'ఇమ్మోర్టల్' చిత్రాలు కూడా వాయిదా పడ్డాయి. సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ అయిన 'ఇమ్మోర్టల్' సినిమాను మొదట జులై 23న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు సెప్టెంబర్ 4కి మార్చారు. ఈ విషయాన్ని జీ.వీ. ప్రకాష్ కుమార్ తన X ఖాతాలో ప్రకటించారు. 'జన నాయగన్' విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ చిత్రానికి మరియప్పన్ సిన్నా దర్శకత్వం వహించగా, జీ.వీ. ప్రకాష్ కుమార్, గయత్రి లోహర్ ప్రధాన పాత్రల్లో నటించారు.

45
దళపతి 'వన్ లాస్ట్ డ్యాన్స్' కోసం..
'ది డార్క్ హెవెన్' నిర్మాతలు ఒక ప్రెస్ రిలీజ్ ద్వారా తమ సినిమా వాయిదాను ప్రకటించారు. విజయ్ 'చివరి సినిమా'కు దారి ఇచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ ప్రకటనను దర్శకుడు బాలాజీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. 'దళపతి విజయ్ నటించిన జన నాయగన్ జులై 23న విడుదలవుతున్నందున, జులై 17న రావాల్సిన మా ది డార్క్ హెవెన్ సినిమాను వాయిదా వేస్తున్నాం. కొత్త తేదీని త్వరలో ప్రకటిస్తాం' అని ఆ ప్రకటనలో ఉంది. 'కోట్లాది మంది అభిమానుల్లాగే మేం కూడా దళపతి 'వన్ లాస్ట్ డ్యాన్స్' కోసం ఎదురుచూస్తున్నాం' అని కూడా పేర్కొన్నారు.
55
విజయ్ తనయుడు తగ్గుతాడా లేదా?
బాలాజీ దర్శకత్వం వహించిన 'ది డార్క్ హెవెన్' ఒక తమిళ క్రైమ్ థ్రిల్లర్. ఇందులో సిద్దూ సిద్, దర్శిక ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా మొదట జులై 17న విడుదల కావాల్సి ఉంది. అలాగే, నటుడు విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ దర్శకత్వం వహించిన 'సిగ్మా' సినిమా రిలీజ్ కూడా వాయిదా పడే అవకాశం ఉంది. ఈ సినిమాను జులై 31న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రం జాసన్ సంజయ్‌కు దర్శకుడిగా తొలి సినిమా కావడం విశేషం.
Read more Photos on
click me!

Recommended Stories