Karthika Deepam: భాగ్యం ఇంటికి వెళ్లిన కార్తీక్, దీప.. సౌందర్యకు అసలు నిజం చెప్పిన మోనిత?

First Published Jan 16, 2023, 7:45 AM IST

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ మంచి రేటింగ్ తో దూసుకెళ్తుంది. ఒకటే కథతో నిత్యం ట్విస్ట్ ల మీద ట్విస్టులతో ప్రసారమవుతున్న ఈ సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు జనవరి 16వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
 

 ఈరోజు ఎపిసోడ్ లో దీప, మోనిత గురించి ఆలోచిస్తూ దానివల్ల ఇంట్లో ఎవరికి మనశ్శాంతి లేకుండా పోతోంది. చనిపోయిన తర్వాత కూడా అది అలాగే డాక్టర్ బాబుని పెళ్లి చేసుకోమని వేధిస్తుంది దీనికి ఏదో ఒక పరిష్కారం చూడాలి లేకపోతే అది ఇంకా రెచ్చిపోతుంది. నా ఆరోగ్యం విషయం గురించి అత్తయ్య గారికి చెప్పడమే మంచిది ముందు ఎలాగైనా అత్తయ్య గారితో ఈ విషయం గురించి మాట్లాడాలి. ఎలాగో నేను పోతాను కాబట్టి నాతో పాటు ఆ మోనితను కూడా తీసుకెళ్తాను అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే హిమ,శౌర్య అక్కడికి వచ్చి నాన్న ఎక్కడ అనడంతో డాక్టర్ సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు.
 

నువ్వు ఎందుకు అమ్మ అలా ఉన్నావు అని అడగడంతో నాకేమైందమ్మ బాగానే ఉన్నాను అంటుంది దీప. మా దగ్గరికి రావడం నీకు ఇష్టం లేదమ్మా అని సౌర్య అడగడంతో అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు అనగా ఇంతలో సౌందర్య అక్కడికి నీ వాలకం చూస్తే అలాగే అనిపిస్తోంది దీప అని అంటుంది. వచ్చినప్పుడు నుంచి అదోలా ఉంటున్నావు నాకు ఏదో చెప్తాను అని మాట ఇచ్చావు కదా నీ మాట మీద నేను నిలబడతాను చెప్పు దీప అనడంతో సౌందర్య పిల్లలను అక్కడి నుంచి పంపిస్తుంది. అప్పుడు సౌర్య  నానమ్మ హైదరాబాద్ కి వెళ్దాము అని అనగా సరేలే అలాగే వెళ్దాం మీరు వెళ్లి మీ నాన్నని పిలుచుకురండి అని పిల్లలను అక్కడి నుంచి పంపిస్తుంది.
 

ఇప్పుడు చెప్పు దీప ఏంటో అనడంతో అదేం లేదు అత్తయ్య హైదరాబాద్ కు వెళ్ళిపోదాము మామయ్య గారికి ఆపరేషన్ అయింది కదా ఎలా ఉందో అని బెంగగా ఉంది అంటుంది. ఇదేనా నువ్వు చెప్పాలనుకుంది అనడంతో అవును అత్తయ్య అని అంటుంది దీప. ఆ మోనిత సంగతి నేనే తెలుస్తాను. ఆ తర్వాత నాతో కుదరకపోతే నీతో చెప్తాను అత్తయ్య అనుకుంటూ ఉంటుంది దీప. చెప్పు దీప అనడంతో స్టవ్ మీద పాలు పెట్టాను అని అబద్ధాలు చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది దీప. అప్పుడు సౌందర్య, దీప కార్తీక్ లపై అనుమాన పడుతూ ఉంటుంది. ఆ తర్వాత అందరూ కలిసి సంక్రాంతి పూజ చేయడానికి దేవుడు ముందు కూర్చుంటారు.
 

అప్పుడు సౌందర్య ప్రతి సంక్రాంతికి అందరము ఇలాగే సంతోషంగా మరింత హ్యాపీగా ఉండాలి అది మీ చేతుల్లోనే ఉంది అనగా దీప కార్తీక్ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు. అప్పుడు దీప ఎప్పటికీ సంతోషం అలాగే ఉంటుంది అత్తయ్య అని అంటుంది. తర్వాత శౌర్య సంక్రాంతి పండుగ గురించి అడగడంతో సౌందర్య సంక్రాంతి పండుగ గురించి సంక్రాంతి పండుగ గొప్పతనం గురించి చెబుతూ ఉంటుంది. తర్వాత అందరూ అక్కడ నుంచి వెళ్లిపోవడంతో చూశారు కదా డాక్టర్ బాబు మన నిజం చెప్పేసి ఉంటే ఇంత హ్యాపీగా ఉండేవారు కాదు అని అంటుంది దీప. మరి నువ్వు ఎందుకు దీప అమ్మకి ఎప్పటికీ సంతోషం అలాగే ఉంటుందని మాట ఇచ్చావు అని కార్తీక్ అడగడంతో అది మీ చేతుల్లోనే ఉంటుంది డాక్టర్ బాబు అని అంటుంది.
 

అప్పుడు దీప కార్తీక్ కి రెండో పెళ్లి గురించి మాట్లాడడంతో కార్తీక్ పండగ పూట ఆనందంగా ఉండనివ్వు ఇలాంటి టాపిక్ తీసుకురాకు అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత దీప వాళ్ళు అందరూ ఆనందంగా డాన్స్ చేస్తూ ఉండగా మోనిత అదంతా చూస్తూ ఉంటుంది. ఇంతలోనే హేమచంద్ర అక్కడికి రావడంతో ఎవరు నువ్వు అని అడగగా మోనిత కార్తీక్ రెండవ భార్యని అని అంటుంది. అలా మాట్లాడకు మోనిత అని తెలుసు కార్తీక్ రెండవ భార్య కాదు దీప మాత్రమే అని అంటాడు హేమచంద్ర. అప్పుడు హేమచంద్ర కోపంతో మాట్లాడగా మోనిత మాత్రం కూల్ గా మాట్లాడుతూ ఉంటుంది. ఇలా ఇవ్వండి బట్టలు నేను ఆరేస్తాను అని అనగా అవసరం లేదు నేను ఆరేసుకుంటాను అంటాడు హేమచంద్ర. అప్పుడు హేమచంద్ర ఎంత చెప్పినా కూడా హేమచంద్రను మాటలతో మాయ చేసి బట్టలు ఆరేస్తూ ఉంటుంది.
 

మరోవైపు దీప సంతోషంగా డాన్స్ చేసి కార్తీక్ దగ్గరికి వెళ్లి ఆయాసంగా ఉంది డాక్టర్ బాబు అని అంటుంది. అప్పుడు కార్తీక్ నీళ్ళు తెచ్చి ఇవ్వడంతో నీళ్లు తాగి మళ్లీ వెళ్లి డాన్స్ చేస్తూ ఉంటుంది దీప. అప్పుడు దీప ఒక్కసారిగా మోనితను హేమచంద్ర ఇంట్లో చూసి కళ్ళు తిరిగి పడిపోవడంతో అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. మరొకవైపు దీప వాళ్ళ నాన్న దీప కార్తీక్ లో ఫోటో చూసి ఏడుస్తూ ఉండగా ఇంతలో భాగ్యం అక్కడికి వచ్చి ఎంత సేపు ఆ ఫోటోని అలాగే చూస్తూ ఉంటావు. కాఫీ తాగు అని అంటుంది. అప్పుడు దీప వాళ్ళ నాన్న ఏడుస్తూ కుమిలిపోతూ ఉండగా భాగ్యం కూడా నేను వాళ్ళను మర్చిపోలేక పోతున్నాను అని బాధపడుతూ ఉంటుంది. తలుపు కొట్టడంతో భాగ్యం వెళ్లి తలుపు తీయగా అక్కడ దీప కార్తీక్ వాళ్ళు ఉండడం చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది.
 

అప్పుడు భాగ్యం కళ్ళు తిరిగి పడిపోవడంతో దీప, కార్తీక్ వాళ్ళు నిద్ర లేపుతూ ఉండగా ఇంతలోనే దీప వాళ్ళను చూసి వాళ్ళ నాన్న సంతోష పడుతూ ఉంటాడు. అప్పుడు భాగ్యం కళ్ళు తెరిచి వాళ్ళను చూసి సంతోష పడుతూ ఉంటుంది. అప్పుడు అందరూ సంతోషపడుతూ ఉంటారు. మరొకవైపు సౌందర్య దేవుడిని మొక్కుకుంటూ అందరమూ హ్యాపీగా ఉన్నాము. ఈ సంతోషం ఇలాగే ఉండేలా చూడు స్వామి తిరుపతికి వస్తాము అని మొక్కుకుంటూ ఉండగా ఇంతలోనే వెనకవైపు మోనిత వచ్చి నిలబడి ఆ మాటలు విని నవ్వుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత మోనిత ఏమీ తెలియనట్టుగా సంతోషంగా సౌందర్యను వెటకారంగా పలకరిస్తూ ఉంటుంది.
 

 అప్పుడు సౌందర్య కోప్పడడంతో కొద్దిసేపు నేను చెప్పేది వినండి ఆంటీ ఆ తర్వాత మీరు మాట్లాడండి అని అంటుంది. తర్వాత వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా మోనిత కొంచం  ఓవర్గా మాట్లాడుతుంది. కొడుకు కోడలు వచ్చారని సంతోష పడుతున్నారు. వాళ్ళు బతికి ఉన్నారు కాబట్టి ఆనంద పడుతున్నారు వచ్చిన ప్రణాలు అలాగే పోతే అనడంతో మోనిత అని గట్టిగా అరుస్తుంది సౌందర్య. ఏంటే వాగుతున్నావ్ అనడంతో ఆవేశ పడొద్దు ఆంటీ అని కూల్ గా మాట్లాడుతూ ఉంటుంది మోనిత. ఎంత చెప్పినా మీకు ఆవేశం చల్లడం లేదు ఈ ఫైల్ చూడండి.  అప్పుడు మీకు మీ కొడుకు కూడా ఇన్నాళ్లు ఎందుకు ఉన్నారో అర్థం కావడం లేదు అని సౌందర్య కి ఫైల్ ఇస్తుంది. అసలు దీపకి ఇలాంటి పరిస్థితి వస్తుందని తెలిసే ఉంటే నేను దీప జోలికి వచ్చేదాన్నే కాదు. అప్పుడు సౌందర్య ఆ ఫైల్ చూసి ఒకసారిగా షాక్ అవుతుంది.

click me!