Karthika Deepam: దీపను కార్తీక్ ముందు అడ్డంగా బుక్ చేసిన మోనిత.. డాక్టర్ బాబు కోసం ఒక ఊరినే సృష్టించిందిగా!

First Published Sep 22, 2022, 8:12 AM IST

Karthika Deepam:బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్,కుటుంబ కథా నేపథ్యంతో కొనసాగుతూ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు సెప్టెంబర్ 22వ తేదీన ఏం జరుగుతుందో తెలుసుకుందాం...
 

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే.. ఆనందరావు, హిమ రాసిన ఉత్తరాన్ని చదువుతూ ఉంటాడు. అందులో, తాతయ్య సౌర్య లేకుండా నేను ఉండలేను. నేను సౌర్యను జాగ్రత్తగా చూసుకుంటాను అని అమ్మానాన్నలకు మాట ఇచ్చాను. నా గురించి వెతకొద్దు మళ్ళీ మీరు  సౌర్య దగ్గరికి వస్తే శౌర్య నన్ను కూడా వదిలేసి వెళ్ళిపోతుంది. ఇంక నేను వెళ్తున్నాను అని ఉత్తరం రాసి వెళ్ళిపోతుంది. ఆనందరావు ఏడుచుకుంటూ, నీ దగ్గర ఉండకూడదు అనే కదమ్మా శౌర్య కూడా వెళ్ళిపోయింది.
 

 ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్తే తను అక్కడి నుంచి ఇంక ఎక్కడికో వెళ్ళిపోతుంది.ఇప్పటికే కొడుకు,కోడల్ని, మనవరాలను దూరం చేసుకున్నాము. ఇప్పుడు నిన్ను కూడా దూరం చేసుకోవాల్సి వస్తుంది సౌందర్య కి విషయం తెలిస్తే ఎంత బాధ పడుతుంది అని ఏడుస్తూ ఉంటాడు ఆనందరావు. ఆ తర్వాత సీన్లో కార్తీక్ మోనిత కార్లో వెళ్తూ ఉండగా దీప వాళ్ళని ఫాలో అవుతూ ఉంటుంది. అప్పుడు మోనిత వెనకాతల వస్తున్న దీప నీ చూసి, రా దీప అక్కడ  నీకోసం పెద్ద బాంబు ఎదురుచూస్తుంది అని అనుకుంటుంది.
 

 ఆ తర్వాత సీన్లో సౌందర్య కారులో వెళ్తున్నప్పుడు ఆనందరావు ఫోన్ చేసి జరిగిన విషయం అంతా చెప్తాడు. నేను రోడ్లు, రైల్వే స్టేషన్లు అన్ని వెతికాను,ఎక్కడ దొరకలేదు సౌందర్య అని  చెప్తాడు. అప్పుడు సౌందర్య, భయపడొద్దు అండి సౌర్య ఉండేది ఈ ఊర్లోనే కదా, కూడా ఇక్కడికే వచ్చి ఉంటుంది నేను అన్ని వెతుకుతాను అని ధైర్యం చెప్తుంది సౌందర్య. ఆ తర్వాత సీన్లో మోనిత, కార్తీక్ నీ ఒక దగ్గర ఆపి పక్కన ఉన్న ఒక బ్యానర్ ని చూపిస్తుంది. అందులో కార్తీక్ బట్టలు కొట్టు అని రాసి కింద మోనిత పేరు రాసి ఉంటుంది.
 

అప్పుడు మోనిత కార్తీక్ తో, ఇది మనం పెళ్లయిన కొత్తలో నడిపిన కొట్టు కార్తీక్.తర్వాత బిజినెస్ బాలేదని మూసివేము అని చెప్తుంది. అలా ఊర్లోకి వెళ్లి కార్తీక్, మోనితలు కార్ దిగేసరికి అక్కడికి ఊర్లో జనం అంతా వస్తారు.దూరం నుంచి చూస్తూ దీప, ఒక కొత్త గతమే సృష్టించేసేలా ఉన్నదే అని అనుకుంటుంది. అప్పుడు ఆ ఊరి వాళ్ళు అందరూ కార్తీక్ ని, మోనిత నీ మొగుడు పెళ్ళాలు లాగా మాట్లాడుతూ, ఎన్ని రోజులైంది అమ్మ ఈ ఊరికి వచ్చి, మమ్మల్ని మర్చిపోయారా? ఆనంద్ బాబు ఎక్కడ? కార్తీక్ బాబుకు తగ్గిందా అని అంటారు.
 

 ఇదంతా విన్న దీప, లాభం లేదు ఇప్పుడు నేను అక్కడికి వెళ్లాలి లేకపోతే డాక్టర్ బాబు జరిగిందంతా అమ్మేస్తారు అని అక్కడికి వెళ్తుంది. దీప ను చూసిన ప్రతి ఒక్కరూ వంటలక్క, నువ్వు ఇంకా కార్తీక్ ని వదల్లేదా ఇప్పటికైనా నీ పీడ లేకుండా వాళ్ళిద్దరూ హాయిగా ఉంటారు అనుకున్నాను కానీ ఇక్కడ కూడా వాళ్ళు ఎందుకు వదలట్లేదు. ఈ వంట లెక్కకి పెళ్లయింది కార్తీక్,తన భర్త ఒక ఆర్ఎంపీ డాక్టర్.మీ ఇంట్లో ఇంట్లో వంటమనిషిగా పని చేసేది.నిన్ను చూసి డాక్టర్ అంటే నీలా ఉండాలి అని తన భర్తని చిన్నచూపు చూసింది. అప్పుడు తన భర్త తని వదిలేసి వెళ్ళిపోయాడు అప్పుడు నుంచి నీ వెంటే తిరుగుతుంది అని కద అల్లుతారు.అప్పుడు దీప ఆశ్చర్య పోతుంది.ఎవరు మీరు అంతా మోనిత చెప్పిన మాటలు నమ్మొద్దు. 

డాక్టర్ బాబు, నా మెడలో తాడి మీరే కట్టారు అని అనగా కార్తీక్ కోపం వచ్చి,ఊరంతా ఒక మాట మాట్లాడితే,నువ్వు ఒక్కద్దనివే ఇంకో మాట్లాడుతున్నావా.ఇంకా ఆపు అని చెప్పి అరుస్తాడు. ఇంతలో అక్కడికి ఇంకొక కారు వచ్చి ఆగుతుంది. కార్ దిగుతూనే,కార్తీక్, మోనితా ఎప్పుడొచ్చారు? నాకు చెప్పకుండా వచ్చారేంటి చాలా రోజులైంది మిమ్మల్ని చూసి. ఆనంద్ కూడా వచ్చాడా అని పలకరిస్తూ పక్కన ఉన్న దీప ను చూసి ఏ వంటలక్క సిగ్గు లేదా నీకు ఇప్పుడు కూడా వస్తున్నావు అని తిడుతుంది. అప్పుడు మోనిత, ఇప్పటికే డోస్ ఎక్కువైందిలే చాలు అని అంటుంది. అప్పుడు కార్తీక్, మోనిత లు అక్కడ నుంచి వెళ్ళిపోతారు. దీప ఏడుచుకుంటూ అక్కడే ఉంటుంది. ఆ తర్వాత సీన్లో సౌందర్య ఎవరికో ఫోన్ చేసి మోనిత నెంబర్ తీసుకుంటుంది. అదే సమయంలో కార్తీక, మోనితలు బోటిక్ లో ఉంటారు. కార్తీక్ బట్టల బొమ్మని సర్దుతాడు.

 మోనిత కుర్చీలో కూర్చొని జరిగిన విషయం అంత ఆలోచించి తెగ సంబరపడిపోతూ ఉంటుంది. ఇప్పటినుంచి దీప గోల మాకు ఉండదు, మేము హాయిగా గడపవచ్చు అని అనుకుంటుంది. అప్పుడు కార్తీక్, మోనిత తో, నాకు ఆ ఊరు చూపించి మంచి పనే చేశావు, లేకపోతే కొంచెం అనుమానం ఉండేది ఇప్పుడు ఏ అనుమానం లేదు హాయిగా ఉంది అని అంటాడు. ఇంతలో సౌందర్య మోనిత కి ఫోన్ చేస్తుంది. ఎవరు మాట్లాడుతున్నారు అని మోనిత అనగా నేను సౌందర్య ని అని అంటుంది సౌందర్య. ఇంతలో కార్తీక్ సర్దుతున్న బొమ్మ కింద పడేస్తాడు. అప్పుడు జాగ్రత్త కార్తిక్ అని మోనిత అంటుంది. అప్పుడు ఈ మాటలు విన్న ఆనందరావు, సౌందర్య కార్తీక్ అంటున్నావ్ ఏంటి అని అంటారు. 

భయంతో మోనిత ఫోన్ పెట్టేస్తుంది. సౌందర్య, విన్నారు కదండీ అది కార్తీక్ అన్న మాట అన్నది. నేను చెప్పాను ఇక్కడ ఏదో పెద్దదే జరుగుతుందని వెంటనే బయలుదేరాలి అని అనుకుంటుంది. ఫోన్ లో ఈవిడున్నారని కూడా తెలియకుండా నోరు జారాను.  ఇప్పుడు ఇక్కడికి వచ్చేస్తారా ఏంటి అని భయపడుతూ ఉంటుంది. అప్పుడు కార్తీక్, ఫోన్ వచ్చిన దగ్గరి నుంచి ఎందుకు భయపడుతున్నావు మోనిత అని అనగా, ఏం లేదు కార్తీక్ చిన్న తలనొప్పి అని అంటుంది మోనిత. సరే వెళ్లి పడుకో అని అనగా వద్దు కార్తీక్ నేను రాత్రికి పడుకుంటాను అని అంటుంది. మనసులో, మళ్ళీ ఆవిడ ఫోన్ చేస్తారేమో అని భయపడుతూ ఉంటుంది మౌనిత.ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

click me!