Karthika Deepam: మరో షాకింగ్ ప్లాన్.. కార్తీక్ కాళ్ళు పట్టుకున్న మోనిత.. డాక్టర్ బాబు షాకింగ్ నిర్ణయం?

Navya G   | Asianet News
Published : Feb 19, 2022, 11:32 AM IST

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగింది తెలుసుకుందాం. ఇంట్లో వాళ్ళ ముందు కార్తీక్ (Karthika) కి మోనిత ఫోన్ చేయగా వాళ్ల ఒప్పందం గురించి మోనితను అడిగి ఇంట్లో వాళ్లకి వివరించి వాళ్ళ పై విరుచుకు పడతాడు.

PREV
17
Karthika Deepam: మరో షాకింగ్ ప్లాన్.. కార్తీక్ కాళ్ళు పట్టుకున్న మోనిత.. డాక్టర్ బాబు షాకింగ్ నిర్ణయం?

ఆ తర్వాత హిమ (Hima) , సౌర్యలు (sourya) కార్తీక్ దగ్గరకు వచ్చి 'డాడీ మమ్మీ తాడికొండ వెళ్ళింది రేపు వస్తుంది అని చెబుతారు'. దానికి కార్తీక్  రేపు కాకపోతే ఎల్లుండి రమ్మనండి అని పిల్లల పై విరుచుకు పడతాడు. మరో వైపు మోనిత (Monitha)  వాళ్ళ బాబాయ్ పై కపట ప్రేమ చూపుకుంటూ ఆకట్టుకుంటోంది.

27

మరోవైపు కార్తీక్ (Karthik), మోనిత వాళ్ళ బాబాయ్ కి ఆపరేషన్ చేసి స్మూత్ గా వదిలించు కోవచ్చు అని సౌందర్యకు చెబుతాడు. కానీ సుందర్య మాత్రం ఈ విషయంలో మోనిత ఎదో నాటకం ఆడుతుంది అన్నట్లు అంటుంది. అంతే కాకుండా దీప (Deepa)  ఎప్పుడూ కరెక్ట్ గానే ఆలోచిస్తుందని అంటుంది.
 

37

ఇదే క్రమంలో సౌందర్య (Soundarya)  'మంచితనం మనకు చాలా చెడు చేసిన విషయం మర్చిపోకు' అని కార్తీక్ కి చెబుతుంది. దాంతో కార్తీక్ అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు. మరోవైపు సౌర్య,  హిమతో (Hima) తమ్ముడు పెద్దయ్యాక తాడికొండలో మన ఇంటికి తీసుకువెళ్లి ఇదే మన ఇల్లు అని చెబుదాం అంటుంది.

47

దాంతో హిమ (Hima) కోపంగా తమ్ముడికి వాళ్ళ అమ్మా నాన్నలు లేరని తెలిస్తే ఎంత భాద పడతాడు అని సౌర్య పై కోపడుతూ ఉంటుంది. ఆనంద్ మీద వీరిద్దరి ప్రేమను గమనించిన సౌందర్య (Soundarya) నిజం ఏమిటో సమాజానికైనా చెప్పాలి అని మనసులో అనుకుంతుంది.

57

మరోవైపు మోనిత (Monitha) ఆమె వేసిన ప్లాన్ గురించి హాస్పిటల్ లో నర్స్ తో డీల్ మాట్లాడుతూ ఉంటుంది. కానీ నర్స్ డానికి ఏమాత్రం ఒప్పుకోదు. ఈలోగా అక్కడకు కార్తీక్ వచ్చి ఏమైంది మోనిత అని అడగగా టాపిక్ మర్చి కవర్ చేసుకుంటుంది. ఆ తర్వాత కార్తీక్ (Karthik)  'మీ బాబాయ్ కి ఆపరేషన్ చేసే విషయంలో ఇలాంటి కుట్రలు కుతంత్రాలు లేవుగా' అని మోనితను అడుగుతాడు.

67

దాంతో మోనిత(monitha)నా మీద నీకు పూర్తిగా నమ్మకం పోయిందంటూ కార్తీక్ కాళ్ళ మీద పడి ఏడుస్తుంది. ఇక కార్తీక్, మోనిత (Monitha)  కన్నీళ్లకు కరిగిపోయి మోనిత తో ఓదార్చినట్లుగా మాట్లాడుతాడు. ఆపరేషన్ చేస్తానని కార్తీక్ మాట ఇవ్వగా మోనిత షాకింగ్ లుక్స్ చూస్తూ కరిగిపోయాడు అని రాక్షస నవ్వు నవ్వుతుంది. 

77

ఆ తరువాత సౌందర్య (Soundarya), మోనిత వాళ్ళ బాబాయ్ దగ్గరకి వచ్చి ఇచ్చిన మాట ప్రకారం కార్తీక్ మీకు ఆపరేషన్ చేస్తాడు. కానీ ఆపరేషన్ అవ్వగానే  మోనిత (Monitha) ను మీతో పాటు తీసుకు వెళ్ళాలి అంటుంది. అప్పుడే మోనిత ఎంట్రీ ఇస్తుంది ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది. మరో ఎపిసోడ్ లో ఎలాంటి ట్విస్ట్ లు చోటు చేసుకుంటాయ్ అనేది తెలియాలంటే సోమవారం వరకు వేచి చూడాల్సిందే. 

click me!

Recommended Stories