Deepika Padukone Biopic: తన తండ్రి జీవితం ఆధారంగా దీపికా పదుకొనే బయోపిక్.

Published : Feb 19, 2022, 09:59 AM IST

బాలీవుడ్ లో టార్ హీరోయిన్ గా వెలుగు వెలుగుతోంది దీపికా పదుకొనే (Deepika Padukone). ఒకప్పుడు స్పోర్డ్స్ లో ఇదే స్టార్ డమ్ తో దూసుకుపోయాడు దీపిక తండ్రి ప్రకాశ్ పదుకొనే. ప్రస్తుతం తన తండ్రి జీవితాన్నివెండితెరపై ఆవిష్కరించే పనిలో ఉంది స్టార్ హీరోయిన్.

PREV
17
Deepika Padukone Biopic: తన తండ్రి జీవితం ఆధారంగా దీపికా పదుకొనే బయోపిక్.

బాలీవుడ్‌లో మ‌రో బ‌యోపిక్  రూపుదిద్దుకోబోతుంది. ఈ సారి  స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే (Deepika Padukone) తన తండ్రి బయోపిక్ ను తెరకెక్కించబోతోంది. ఆమె తండ్రి ప్రకాశ్ పదుకొనే ఒకప్పుడు ప్ర‌ముఖ బ్యాడ్మింట‌న్ ప్లేయ‌ర్‌. ఇండియా తరపున ఎన్నో మ్యాచ్ లు ఆడి స్టార్ ప్లేయర్ గా వెలుగొందిన వ్యక్తి ప్రకాశ్. ఈ విషయం చాల మందికి తెలియదు. అందుకే బయోపిక్ ద్వారా తన తండ్రి గోప్పతనాన్ని చాటబోతోంది దీపికా.

27

బ్యాడ్మింటన్ ఆటలో అంతర్జాతీయ స్థాయిలో మన దేశ ఉనికిని చాటిన ఆటగాడు  ప్ర‌కాశ్‌ ప‌దుకోన్‌. దీపిక (Deepika Padukone) హీరోయిన్ గా స్టార్ డమ్ సంపాధించే వరకూ కూడా.. ఆమెకు ఓ బ్యాండ్మింటన్ స్టార్ కూతురుగానే గుర్తింపు ఉండేది. తరువాత ఆమె స్టార్ గా మారి సొంత గుర్తింపుతో దూసుకుపోతుంది. ఇక తాజాగా దీపికా తన తండ్రి  ప్ర‌కాశ్ ప‌దుకోనే జీవితం ఆధారంగా బయోపిక్ చేస్తున్నట్టు ఓ  ఇంట‌ర్వ్యూలో ప్రకటించింది.

37

1980లో వరల్డ్‌ నంబర్‌ 1 బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌గా నిలవడంతో పాటు ఆల్‌ ఇంగ్లాండ్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ను గెలిచి, రికార్డు సృష్టించారు ప్రకాశ్‌. అప్పట్లో మీడియా.. పబ్లిసిటీ ఇంత విసృతంగా లేకపోవడంతో దీపికా (Deepika Padukone) తండ్రి గురించి చాల మందికి తెలియదు. అది తెలియజేసే ప్రయత్నం చేస్తుంది స్టార్ హీరోయిన్.

47

ఏ సౌకర్యాలు లేని రోజుల్లో కూడా  నాన్న ప్రకాశ్‌ బ్యాడ్మింటన్‌లో అద్భుతాలు సాధించారంటోంది దీపిక. ప్రక్టీస్ కోసం ప్లేస్ లు అందుబాటులో లేక.. ఓ కళ్యాణ మండపంలో ఆయన ప్రాక్టీస్ చేసేవారట. అప్పట్లో అంటే 1983 లో క్రికెట్ లో ఇండియా వరల్డ్ కప్ గెలవక ముందే.. ఇండియాలో స్టార్ బ్యాడ్మింటన్‌  ప్లేయర్ గా గుర్తింపు ఉంది అంటోంది దీపికా పదుకొనే(Deepika Padukone).

57

ఇక అప్పుట్లో ఎటువంటి సౌకర్యాలు లేవు. ఇప్పుడు ప్లేయర్స్ ను గుర్తించిన విధంగా అప్పుడు కూడా గుర్తించి ఉంటే.. తన తండ్రి ఇంకా ఎన్నెన్నో విజయాలు ఇండియాకు అందించి ఉండేవారు అన్నారు దీపికా(Deepika Padukone). బలహీనతలనే బలంగా మార్చుకునేందుకు తన తండ్రి నిరంతరం కృషి చేసేవారు. అందుకే ఆయన జీవితం ఓ స్ఫూర్తి అన్నారు దీపికా. అందుకే తన తండ్రి జీవితం అందరికి తెలియాలి అన్న ఉద్దేశ్యంతోనే ఈ బయోపిక్ నిర్మిస్తున్నట్టు తెలిపారు.

67

ఇక ప్ర‌కాశ్ ప‌దుకోన్ బ‌యోపిక్ నిర్మాణ బాధ్య‌త‌లు తానే తీసుకుంది దీపికా పదుకొనే (Deepika Padukone).  ఈ సినిమాకు సంబంధించిన న‌టీనటులు, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే వెల్ల‌డిస్తాన‌ని చెప్పింది. తన తండ్రి పాత్రలో ఎవరు నటించబోతున్నారు. ఎవరు డైరెక్ట్ చేయబోతున్నారు అనే విషయాలు అతిత్వరలోనే తెలియబోతున్నాయి.  

77

నటిగా.. నిర్మాగా బిజీ అయిపోయింది దీపికా పదుకొనే (Deepika Padukone) రీసెంట్ గా ఆమె నటించిన గెహ్ర‌యాన్ వెబ్‌సిరీస్‌కు మంచి స్పంద‌న వ‌స్తోంది. ఇక వీటితో పాటు ప్ర‌స్తుతం ఈ స్టార్ హీరోయిన్ టాలీవుడ్  లో  ప్ర‌భాస్‌తో క‌లిసి పాన్ వరల్డ్  ప్రాజెక్ట్ కె సినిమాలో న‌టిస్తోంది. ఇవి కాకుండా ప‌టాన్‌, ఫైట‌ర్‌, హాలీవుడ్ ఫిలిం ది ఇంట‌ర్న్ రీమేక్స్ సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories