Karthika Deepam: డాక్టర్ బాబుని కిడ్నాప్ చెయ్యడానికి మోనిత సిద్ధం.. రుద్రాణి నుంచి పిల్లలను కాపాడిన సౌందర్య?

Navya G   | Asianet News
Published : Jan 11, 2022, 11:02 AM IST

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. కుటుంబ కథ నేపథ్యంలో ప్రసారమవుతున్న ఈ సీరియల్ రేటింగ్ లో కూడా మొదటి స్థానంలో దూసుకెళ్తుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం.  

PREV
19
Karthika Deepam: డాక్టర్ బాబుని కిడ్నాప్ చెయ్యడానికి మోనిత సిద్ధం.. రుద్రాణి నుంచి పిల్లలను కాపాడిన సౌందర్య?

సౌందర్య (Soundarya), ఆనంద్ రావు ప్రకృతి వైద్యశాలకని బయలుదేరుతుండగా వాళ్ళ ప్రయాణం మోనిత కంటిలో పడుతుంది. ఇక వెంటనే వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అనుకోని.. కార్తీక్ (Karthik) జాడ కూడా తెలిసిందేమో అనుకొని వాళ్లని ఫాలో అవుతూ ఉంటుంది.
 

29

కార్తీక్ ఆనంద్ (Anand) తో ఆడుకుంటూ ఉండగా.. దీప ఆనంద్ గురించి గొప్పగా చెబుతుంది. అస్సలు ఏడవడు అని చెబుతుంది. ఇక కార్తీక్ బాబు ని చూసి ఏరా.. అనడంతో వెంటనే దీప (Deepa) బాబుని ఏరా.. అనకూడదని ఎందుకంటే మామయ్య పేరు అని అనడంతో కార్తీక్ కు మోనిత మాటలు గుర్తుకు వస్తాయి.
 

39

వెంటనే అదే ఆలోచనలో పడతాడు. దాంతో మోనిత (Monitha) మాటలు గుర్తుకొస్తున్నాయి అని అనటంతో దీప చెపుతుంది. బాబును పిలిచినప్పుడల్లా మామయ్య గారిని గుర్తు చేసుకోండి అని అంటుంది. ఇక కార్తీక్ (Karthik) గతంలో తాను గడిపిన అద్భుతమైన క్షణాలను తల్చుకుంటాడు.
 

49

మరోవైపు మోనిత సౌందర్య (Soundarya) వాళ్ళ కారు ని ఫాలో అవుతుంది. ఎక్కడికి వెళ్ళినా వదలను అని గట్టిగా పంతం పడుతుంది. ఇక కార్తీక్  (Karthik) దగ్గరికి దీప వచ్చి కాసేపు మాట్లాడుతుంటుంది. ఇంట్లో డబ్బులు, సరుకులు లేవు కదా పిల్లలకు భోజనం ఎలా తీసుకెళ్లారు అని అడుగుతుంది.
 

59

వెంటనే కార్తీక్ (Karthik) తన దగ్గర డబ్బు లేకుండా ప్రేమ ఉంది అంటూ చెబుతాడు. ఇక దీప అదేపనిగా ప్రేమతో మాట్లాడుతూ ఉండగా కార్తీక్ తనను ఒక బిడ్డ లాగా చూడకు దీప (Deepa) అంటూ వేడుకుంటాడు. ఇక రుద్రాణి గురించి మాట్లాడటంతో ఆవిడ గురించి మాట్లాడకండి అని ధైర్యం ఇస్తుంది.
 

69

తను ఓ చోట పని చేస్తున్నానని కార్తీక్ (Karthik) కు చెబుతుంది. ఇక ఏమీ ఆలోచించకండి అని ధైర్యం ఇస్తుంది. ఇక కార్తీక్ దీప (Deepa) కష్టాన్ని చూసి ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండమని చెబుతాడు. దానికి దీప సంతోష పడుతూ ఉంటుంది. మరోవైపు మోనిత కారును ఫాలో అవుతూనే ఉంటుంది.
 

79

మొత్తానికి సౌందర్య (Soundarya) తాడికొండ గ్రామానికి చేరుతుంది. ఇక అది చూసిన మోనిత.. ప్రియమణి (Priyamani) వాళ్ళ ఊరు అని..  బహుశ ప్రియమణి ప్లేట్ మార్చి దీప వాళ్ళకు హెల్ప్ చేస్తుందేమో అని కోపంతో రగిలిపోతుంది. కార్తీక్ పిల్లలకు భోజనం తయారు చేస్తాడు.
 

89

పిల్లలకు ఆ భోజనం నచ్చకపోవడంతో అదే సమయంలో దీప (Deepa) వచ్చి వారికి నచ్చజెపుతుంది. ఇక సౌందర్య వాళ్ళు ప్రజా వైద్యశాల వెళ్ళటంతో మోనిత (Monitha) ఇందుకా వీళ్ళు వచ్చింది అని అనుకుంటుంది. ఇక తాను వెళ్లి కార్తీక్, బాబుని వెతుకుతానని అనుకుంటుంది.
 

99

ఇక ప్రియమణిని (Priyamani) వెతకాలని ఆ ఊరిలో వెతకడానికి వెళుతుంది. మరోవైపు కార్తీక్, దీప సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక కార్తీక్ ను బాధపడవద్దు అని దీప నచ్చ చెప్తుంది.  తరువాయి భాగంలో మోనిత ఆ ఊరిలో ప్రియమణి కోసం వెతుకుతోంది. అదే సమయంలో దీప, బాబు అక్కడి నుంచి రావడంతో బాబు ఏడుపు గొంతు విని మోనిత (Monitha) షాక్ అవుతుంది.

click me!

Recommended Stories