ఈ సబ్జక్ట్స్ స్టార్ హీరోలతో చేయాలంటే పాన్ ఇండియా స్థాయిలో అత్యుత్తమ ప్రమాణాలతో తెరకెక్కించాలి. బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ మధు మంతెన (Madhu Mantena)మహేష్ ఫ్యాన్స్ కోరిక తీర్చనున్నాడని, ఆయన మహేష్ ని రామునిగా చూపించడానికి సిద్ధమయ్యారని అప్పట్లో వరుస కథనాలు వెలువడ్డాయి. ఇక ఉహాగానాలు వచ్చిందే తడవుగా.. రాముడి గెటప్ లో మహేష్ ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ సోషల్ మీడియాలో పోటెత్తాయి. కుప్పలు తెప్పలుగా మహేష్ రాముడి లుక్ కి సంబంధించిన ఫోటోలు హల్చల్ చేసాయి.