Karthika Deepam: పిలుపు మార్చిన వంటలక్క.. ఆ దంపతుల ఒడికి చేరుకున్న మోనిత బాబు!

Navya G   | Asianet News
Published : Dec 15, 2021, 10:50 AM IST

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కుటుంబ కథ నేపథ్యంలో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ మొదటి స్థానంలోనే దూసుకెళ్తుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం.  

PREV
17
Karthika Deepam: పిలుపు మార్చిన వంటలక్క.. ఆ దంపతుల ఒడికి చేరుకున్న మోనిత బాబు!

సౌందర్య (Soundarya), ఆనందరావు దీప, కార్తీక్ (Karthik) ల గురించి మాట్లాడుతుండగా మోనిత వచ్చి వారిపై అరుస్తుంది. తన బాబును దాచారని ఎక్కడ ఉంచారు అని నా బాబుని నాకు ఇవ్వండి అని వాళ్లతో వాదిస్తుంది. సౌందర్య, ఆనందరావు మాత్రం తమకు సంబంధం లేదని అంటారు. అంతటితో మోనిత ఆగకుండా బాబుని ఇచ్చే వరకు ఇక్కడే సెటిల్ అవుతాను అని అంటుంది.
 

27

మరోవైపు శ్రీవల్లి (Srivalli) ఈసారి కూడా తనకు దేవుడు బిడ్డ ని దూరం చేసినందుకు బాధపడుతుంది. తన భర్త కోటేష్ (Kotesh) రావడంతో ఆయనతో చెప్పుకుంటూ బాధపడుతుంది. వెంటనే అతడు బయటికి వెళ్లి మోనిత బాబును తీసుకొని వచ్చి ఈ బాబు తల్లి చనిపోయిందని చెప్పడంతో సంతోషంగా బాబును తీసుకుని ముద్దాడుతుంది.
 

37

కోటేష్ తాను చేసిన పనిని తలుచుకుంటూ.. తన భార్య డెలివరీ అయ్యాక మళ్లీ బిడ్డను కోల్పోయిందని తన భర్త బాధపడుతుండగా రోడ్డుపై మోనిత (Monitha)కారులో ఉన్న బాబుని అతడే తీసుకెళ్తాడు. ఇదంతా శ్రీవల్లి (Srivalli) కోసమే చేస్తున్నాను అనుకొని ఈ తప్పు చేస్తున్నాను అని అనుకుంటాడు.
 

47

కార్తీక్, దీప పిల్లలతో కలిసి భోజనం చేస్తుంటారు. ఇక కార్తీక్ పిల్లలను చూసి డైనింగ్ టేబుల్ పై కూర్చొని భోజనం చేస్తున్నా సమయాన్ని గుర్తు చేసుకొని బాధపడతాడు. ఇక దీప (Deepa) ఏమైంది కార్తీక్ బాబు (Karthik babu) అంటూ పిలుపు మార్చిమాట్లాడుతుంది. పిల్లలు కింద కూర్చొని భోజనం చేస్తే బాగుందని అంటారు.
 

57

అదే సమయంలో రుద్రాణి (Rudhrani) అక్కడికి వస్తుంది.  ఒకసారి ఇల్లంతా చుట్టుముట్టి ఇవన్నీ ఎక్కడి సామాన్లు అని అడుగుతుంది. శ్రీవల్లి (Srivalli) వాళ్లవి తీసుకు వచ్చామని అనడంతో వెంటనే అక్కడున్న అన్నం సామాన్లను తన్ని పడేస్తుంది. వెంటనే కార్తీక్ రుద్రాణిపై అరుస్తాడు. ఇక రుద్రాణి కార్తీక్ పై అరుస్తుంది.
 

67

వెంటనే దీప (Deepa) కోపంతో రుద్రాణి (Rudhrani) చెంప పగలగొడుతుంది. ఇక రుద్రాణి షాక్ అవుతూ దీపకు గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. అయినా కూడా దీప భయపడకుండా ధైర్యం గా మాట్లాడుతుంది. రుద్రాణి దీప మాటలను, ధైర్యాన్ని చూసి వారినే కోటేష్ అప్పును తీర్చమని చెప్పి వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది.
 

77

మరోవైపు సౌందర్య (Soundarya) ఇంట్లో మోనిత ఉదయాన్నే లేచి దీపం పెట్టి ఓవర్ గా ప్రవర్తిస్తుంది. తరువాయి భాగంలో శ్రీవల్లి బిడ్డను దీప ఎత్తుకుంటుంది. ఆ బాబుని చూసి కార్తీక్, దీప బాబు ఇప్పుడు పుట్టిన వాడిలా లేడని అనేసరికి కోటేష్ భయపడతాడు. మరోవైపు మోనిత (Monitha) నా బాబు ఎక్కడికి వెళ్లాడు చెప్పండి అంటూ బాధ పడుతుంది.

click me!

Recommended Stories