Kangana Ranaut: టర్కీష్‌ అందాల దేవతగా ఫైర్‌ బ్రాండ్‌.. క్లీవేజ్‌ షోతో రచ్చ.. ప్రభాస్‌ భామ మైండ్‌ బ్లోయింగ్‌

Published : Dec 14, 2021, 07:53 PM IST

బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌.. వివాదాస్పద బోల్డ్ కామెంట్లతో వార్తల్లో నిలుస్తుంటుంది. మరోవైపు తన హాట్‌ షోతోనూ రచ్చ చేస్తుంది. గ్లామర్‌ పరంగానూ బాంబ్‌ పేల్చుతూ ఇంటర్నెట్‌లో మంటలు పెడుతుంటుంది కంగనా. 

PREV
17
Kangana Ranaut: టర్కీష్‌ అందాల దేవతగా ఫైర్‌ బ్రాండ్‌.. క్లీవేజ్‌ షోతో రచ్చ.. ప్రభాస్‌ భామ మైండ్‌ బ్లోయింగ్‌

బాలీవుడ్‌ ఇన్నోసెంట్‌గా ఎదిగి ఇప్పుడు సంచలనంగా మారింది కంగనా రనౌత్‌. స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తున్న ఈ భామ లేడీ ఓరియెంటె చిత్రాలకు కేరాఫ్‌గా నిలుస్తుంది. ఇటీవల `మణికర్ణిక`, `తలైవి` వంటి చిత్రాలతో ఇండియన్‌ ఆడియెన్స్ ని మెప్పించింది కంగనా రనౌత్‌. ఆయా పాత్రలకు ప్రాణం పోసింది. ఇలాంటి బలమైన పాత్రలతోపాటు గ్లామర్‌ పాత్రల్లోనూ మెప్పిస్తుంది కంగనా. ఈ బ్యూటీ హాట్‌ షో చేస్తే వేరే లెవల్‌ లో ఉంటుందని చెప్పొచ్చు. 
 

27

ప్రస్తుతం కంగనా గ్లామర్‌లో మరో యాంగిల్‌ని ఆవిష్కరించింది. టర్కీష్‌ కల్చర్‌ని ఇండియన్‌ ఆడియెన్స్ కి చూపించింది. లేటెస్ట్ గా ఆమె పంచుకున్న ఫోటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. తెగ ఆకట్టుకుంటున్నాయి. ఇందులో కంగనా సరికొత్తగా కనిపించడం విశేషం. నెవర్‌ బిఫోర్‌ అనేలా హాట్‌ షో చేస్తుంది. ట్రెడిషనల్‌గా కనిపిస్తూనే గ్లామర్‌ షోకి తెరలేపింది కంగనా. 

37

16వ శతాబ్దంలో టర్కీ రాణులు ముస్తాబైనట్టుగా తాజాగా కంగనా మెరిసిపోయింది. హోయలు పోయింది. తన ఫ్రెండ్‌, `మణికర్ణిక` కోస్టార్‌ అంకితా లోఖండా పెళ్లి వేడుకలో ఇలా అందంగా ముస్తాబై హోయలు పోయింది కంగనా. అంకితా లోఖండే, విక్కీ జైన్‌ సంగీత్‌ కార్యక్రమం మంగళవారం జరిగింది. ఈ వేడుకలో కంగనా సందడిచేసింది. ఇలా సరికొత్తగా అందంగా,మహరాణిలా ముస్తాబై వయ్యారాలు ఒలకబోసింది కంగనా. 

47

ప్రస్తుతం కంగనా పిక్స్ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. నెటిజన్లని మంత్రముగ్దుల్ని చేస్తున్నాయి. కంగనా క్లీవేజ్‌ అందాలకు ఫిదా అవుతున్నారు. ఈ హాట్‌ నెస్‌ మైండ్‌ బ్లోయింగ్‌ అంటూ కామెంట్‌ చేస్తున్నారు. ఫైర్‌ బ్రాండ్‌ అని ఆమె మాటల విషయంలో కాదు, గ్లామర్‌ విషయంలో అంటూ ఫైర్‌ ఎమోజీలను పంచుకుంటున్నారు. కంగనా అందాల చిత్రాలను షేర్‌ చేస్తూ ట్రెండ్‌ చేస్తున్నారు. కంగనా రనౌత్‌ గత కొన్ని రోజులుగా సంచలనాలకు తెరలేపుతుంది. సామాజిక, రాజకీయ అంశాలపై ఆమె చేసే కామెంట్లు దుమారం రేపుతుంటాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే కంగనాపై అనేక చోట్ల కేసులు కూడా నమోదయ్యాయి. 

57

గతేడాది బాలీవుడ్‌ యంగ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ చనిపోయినప్పటి నుంచి కంగనా ఓపెన్‌ అయ్యారు. అంతకు ముందు క్యాస్టింగ్‌ కౌచ్‌ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. `మీటూ`కి సంబంధించి పలు షాకింగ్‌ విషయాలను వెల్లడించింది కంగనా. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణం సమయంలో బాలీవుడ్‌పై విరుచుపడింది. వారసత్వంపై ఆమె తీవ్ర విమర్శలు చేశారు. కొందరు పెద్ద మేకర్స్..సుశాంత్ కి అవకాశాలు రాకుండా అడ్డుపడ్డారని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. మరోవైపు బాలీవుడ్‌ డ్రగ్స్ కేసు విషయంలోనూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 

67

దీంతోపాటు రాజకీయాలపై కూడా ఆమె తరచూ స్పందిస్తుంది. రైతు చట్టాలపై పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి రైతులు ఆగ్రహానికి కారణమయ్యారు. సిక్కులను ఏకంగా టెర్రరిస్టులుగా వర్ణిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. గాంధీజీపై, స్వాతంత్య్రంపై ఆమె అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతోపలు కేసులు కంగనాపై నమోదైన విసయం తెలిసిందే.
 

77

కంగనా ప్రస్తుతం `ధాఖడ్‌`, `తేజాస్‌`, `టికు వెడ్స్ షేరు` చిత్రాల్లో నటిస్తుంది. `టికు వెడ్స్ షేరు` చిత్రంతో నిర్మాతగానూ మారారు. ఈ సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఇక కంగనా తన అద్భుతమైన నటనతో నాలుగు జాతీయ అవార్డులను, ఇండియన్‌ సినిమాకి ఆమె చేస్తున్న సేవలకుగానూ పద్మశ్రీ పురస్కారం పొందారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories