అయితే నాగ చైతన్య చేసిన కొన్ని కామెంట్స్.. సమంతను ఉద్దేశించేనా అనే అనుమానాలు బలపడుతున్నాయి. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగ చైతన్యను యాంకర్ 'మీరు ఎలాంటి పాత్రలు చేయడానికి ఇష్టపడరు?' అని అడగడం జరిగింది. దీనికి సమాధానంగా .. 'నటుడిగా నేను ఎలాంటి పాత్ర చేయడానికైనా సిద్ధం. అయితే ఆ పాత్ర కానీ, కథ కానీ వ్యక్తిగతంగా, కుటుంబ గౌరవానికి భంగం కలిగించేదిగా ఉండకూడదు. అలాంటి పాత్రలు నేను చేయను' అని అన్నారు.